ఏప్రిల్ 1: కొత్త శకం ప్రారంభం, లాభనష్టాలు ఇవే!
రోజుల వ్యవధిలో క్యాలెండర్ మారుతోంది.. దాంతో పాటే మీ జేబుకు సంబంధించిన లెక్కలు కూడా మారుతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 60 ఏళ్ల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం కనుమరుగవుతూ, సులభతరమైన 'కొత్త చట్టం' అమల్లోకి వస్తోంది. కేవలం ట్యాక్స్ మాత్రమే కాదు, మీ జీతం, ప్రయాణం, బ్యాంకింగ్ లావాదేవీలపై పడే ప్రభావం ఎలా ఉంటుందో ఈ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం.
1. 'ట్యాక్స్ ఇయర్' - కొత్త పేరు.. పాత శ్లాబులే!
ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అంటూ తలపట్టుకునేవాళ్లం. ఇకపై ఆ తిప్పలు ఉండవు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని నేరుగా 'ట్యాక్స్ ఇయర్' గానే పిలుస్తారు. పన్ను రేట్లలో మార్పులు లేకపోయినా, చట్టంలోని నిబంధనలను సామాన్యుడికి అర్థమయ్యేలా సరళీకరించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట.

2. భాగ్యనగర ఉద్యోగులకు గుడ్ న్యూస్..
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం నాలుగు మెట్రో నగరాలకే పరిమితమైన 50% హెచ్ఆర్ఏ (HRA) మినహాయింపును, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లకు విస్తరించారు. దీనివల్ల ఈ నగరాల్లో పనిచేసే లక్షలాది మంది సాఫ్ట్వేర్, ప్రైవేట్ ఉద్యోగుల పన్ను భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే, ఇంటి యజమాని పాన్ వివరాలు ఇవ్వడం ఇకపై తప్పనిసరి.
3. చేతికి వచ్చే జీతం (Take Home)పై కోత?
కొత్త లేబర్ కోడ్ నిబంధనలు కంపెనీలకు సవాలుగా మారనున్నాయి. మీ మొత్తం ప్యాకేజీలో బేసిక్ శాలరీ కనీసం 50 శాతం ఉండాలన్నది నిబంధన. బేసిక్ పెరిగితే మీ పీఎఫ్ (PF) కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే భవిష్యత్తు కోసం ఎక్కువ పొదుపు అవుతుంది కానీ, నెలాఖరున మీ చేతికి వచ్చే జీతం మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. కంపెనీలు తమ శాలరీ స్ట్రక్చర్‌ను ఏప్రిల్ 1 నుంచి సవరించే అవకాశం ఉంది.
4. పాన్ (PAN) కార్డు.. ఎక్కడ పడితే అక్కడ అడగాల్సిందే!
- పాన్ కార్డు కేవలం ఆదాయపు పన్నుకే కాదు, ప్రతి చిన్న లావాదేవీకి ఇప్పుడు ప్రాణాధారంగా మారింది.
- రూ. 5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఏ మోటారు వాహనం (టూవీలర్ సహా) కొన్నా పాన్ మస్ట్.
- హోటల్ బిల్లులు రూ. లక్ష దాటినా, ఏడాదికి రూ. 10 లక్షలు బ్యాంకులో జమ చేసినా పాన్ ఇవ్వాల్సిందే.
- ఆఖరికి బీమా పాలసీలు (Insurance) తీసుకోవాలన్నా ఇకపై పాన్ నంబర్ లేనిదే పని జరగదు.
5. రైలు ప్రయాణికులకు '8 గంటల' నిబంధన!
టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో రైల్వే తన నిబంధనలను కఠినతరం చేసింది. రైలు బయల్దేరడానికి కనీసం 8 గంటల ముందే టికెట్ రద్దు చేసుకుంటేనే రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. 4 గంటల ముందే రద్దు చేసుకునే పాత వెసులుబాటు ఇప్పుడు లేదు. 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే మీ నగదు పూర్తిగా రైల్వే ఖాతాకే వెళ్తుంది. కాబట్టి ప్రయాణ ఏర్పాట్లు ముందే పక్కాగా చేసుకోవాలి.
6. స్టాక్ మార్కెట్ & గ్యాస్ ధరలు
ట్రేడర్లకు ఎఫ్అండ్ఓ (F&O) లావాదేవీలపై ఎస్టీటీ (STT) భారం పెరగనుంది. అలాగే ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్ ధరల సవరణ ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ ధరలు మండిపోతుండటంతో సామాన్యులు ఆందోళనలో ఉన్నారు.
7 - E20 పెట్రోల్..
భారతదేశ ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవానికి తెరలేచింది. మన వాహనాల ఇంజిన్లలో ఇకపై మరింత 'పవర్ ఫుల్' గా మాత్రమే కాకుండా 'పర్యావరణ హిత' ఇంధనం మండనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన ఇంధనం) విక్రయాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేవలం ఇథనాల్ కలపడమే కాదు, ఇంధన నాణ్యతను సూచించే రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) కనీసం 95 ఉండాలని నిబంధన విధించింది
ఈ మార్పులన్నీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. కాబట్టి మీ ప్లానింగ్ ఇప్పుడే మొదలుపెట్టండి.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!














Click it and Unblock the Notifications