వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hair Growth Tip: జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ పని చేయండి..

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఒత్తిగా జుట్టు ఉండేది. వృద్ధాప్యం వచ్చిన తర్వాతే వెంట్రుకలు తెల్లబడేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులో వెంట్రుకలు ఊడిపోతున్నాయి. తెల్లగా మారిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం, జీవన శైలి. అయితే సమాజంతో పాటు మనం మారాలి కాబట్టి ఏం చేయాలేం. అయితే మహిళలకు వెంట్రుకలు రాలిపోతే ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి వారు ఉల్లి రసం వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు రాలడం

జుట్టు రాలడం


ఉల్లిపాయలో ఉండే పోషక విలువలు వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు చుండ్రు, కేరాటిన్ అనే ప్రొటీన్ లోపం వల్ల జరుగుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సల్ఫర్ కేరాటిన్ అవసరం. ఉల్లిపాయ రసంలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఇది కేరాటిన్ అనే ప్రొటీన్ పెంచి చుండ్రుని కూడా తగ్గిస్తుందట. అందుకని ఉల్లిపాయ రసం ఊడిపోయిన జుట్టుని తిరిగి పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుందట.

యాంటీ ఆక్సిడెంట్

యాంటీ ఆక్సిడెంట్


ఎన్నో రకాల సమస్యలను కేవలం ఉల్లి రసంతో చెక్ పెట్టొచ్చట. ఇంతకీ ఉల్లిపాయ రసంతో ఉల్లిగడ్డలో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వాటినే క్వెర్ సెటిన్ అని పిలుస్తారు. అది మెటబాలిజం రేటును పెంచుతుందట. దాని వల్ల.. శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది తమ పొట్టను తగ్గించుకోవాలని అనుకుంటారు. పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి నిత్యం తీసుకోవాలి.ఉల్లిపాయ రసం తాగడం వల్ల.. పొట్ట తగ్గడం మాత్రమే కాదు.. జలుబు ఉన్నా.. దగ్గు ఉన్నా.. జ్వరం వచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుందట. అయితే జట్టు పెరగడానికి ఉల్లి రసం ఉపయోగపడుతుందట.

ఎలా తయారు చేసుకోవాలంటే..

ఎలా తయారు చేసుకోవాలంటే..

2 టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, 2 టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె, 5 చుక్కల టీ ఆయిల్‌ తీసుకుని మూడింటిని మిక్స్ చేయాలి. ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు మెల్లగా రాసుకోవాలి. దాదాపు 15 నిమిషాలు అలా వదిలేయండి.ఇప్పుడు తేలికపాటి షాంపుతో తలస్నానం చేయండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే చుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుందట.

English summary
Onion juice is useful for those who want to grow thick hair. Applying onion juice to the hair can help in hair growth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X