వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్యూంలో అబద్దాలు చెబుతున్నారా: సాఫ్టువేర్ రంగంలో 8% మందివి అంతే!

ఆథ్ బ్రిడ్జ్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్న ప్రతి ఆరుగురు వ్యక్తుల్లో ఒకరు తమ రెస్యూమ్‌లో అబద్దాలు పేర్కొంటున్నారని తేలింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆథ్ బ్రిడ్జ్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్న ప్రతి ఆరుగురు వ్యక్తుల్లో ఒకరు తమ రెస్యూమ్‌లో అబద్దాలు పేర్కొంటున్నారని తేలింది.

ఫోర్జరీ సర్టిఫికేట్లు, గ్రాడ్యుయేట్ షీట్లు, శాలరీ క్లిప్స్ తప్పుగా చూపించడం సరికాదు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారిలో చాలామంది తమ చదువును లేదా గతంలో పని చేసిన కంపెనీలో అనుభవాన్ని, వేతనాన్ని తప్పుగా చెబుతుంటారు.

రెస్యూంలు తప్పుగా చూపిస్తున్నారు

రెస్యూంలు తప్పుగా చూపిస్తున్నారు

అది తప్పు మాత్రమే కాదు. తోటి ఉద్యోగుల దృష్టికి అది వెళ్తే అవమానకరంగానూ ఉంటుంది. ఇలాంటి పరిణామాలు ఉద్యోగం కోల్పోయేందుకు, శాశ్వతంగా వ్యతిరేక ముద్రకు కారణాలు అవుతాయి. అంతేకాదు, భవిష్యత్తులో అవకాశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ప్రతి ఆరుగురిలో ఒకరిది తప్పుడు రెస్యూమ్

ప్రతి ఆరుగురిలో ఒకరిది తప్పుడు రెస్యూమ్

ఉద్యోగుల విషయంలో ఆథ్ బ్రిడ్జ్ ఓ సర్వే చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రెస్యూంలు ఇచ్చే ప్రతి ఆరుగురు ఉద్యోగార్థుల్లో ఒక్కరు తప్పుగానే పేర్కొంటున్నారని తేలింది. 2016లో చేసిన సర్వే కంటే ఇది 50 శాతం ఎక్కువ.

దరఖాస్తు చేసే వారిలో ఇలా

దరఖాస్తు చేసే వారిలో ఇలా

2.99 శాతం మంది స్పందించని వారిని రిఫరెన్సుగా పేర్కొంటున్నారు. 1.27 శాతం మంది తమ అనుభవాన్ని తప్పుగా పేర్కొంటున్నారు. 1.26 శాతం మంది తాము చెప్పినవి సరైనవే అనేందుకు డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు.

ఫేక్ ఐడీలు

ఫేక్ ఐడీలు

డ్రగ్ టెస్టులో పది లక్షల మందిలో ఆరు వేల మందికి పైగా ఫెయిలయ్యారు. 4,352 మంది పాన్‌కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్టు, ఆధార్‌లకు సంబంధించిన పేక్ ఐడీలను ఇచ్చారు. 13.09 శాతం మంది మహిళలు తప్పుడు సమాచారం ఇచ్చారు.

వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి

వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి

ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టారులో 23.99 శాతం మంది రెస్యూంలో ఎన్నో వ్యత్యాసాలను గుర్తించారు. టెలికాం సెక్టారులో 23.44 శాతం, మ్యాన్‌పవర్ సెక్టారులో 15.9 శాతం, రిటైల్ సెక్టారులో 14.38 శాతం, ఫార్మా-బయోటెక్ రీసెర్చ్ సెక్టారులో 13.88 శాతం, ఈ కామర్స్ సెక్టారులో 12.04 శాతం, ఐటీ సెక్టారులో 8.25 శాతం, బీపీవోలో 8.13 శాతం వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

English summary
Forged certificates, grade sheets, employment letters or salary slips are false instruments in the eyes of the law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X