ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ?
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారడం, దీని ప్రభావం భారత్ పై ఊహించిన దాని కంటే ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) ఇవాళ అత్యున్నత స్దాయి భేటీ నిర్వహిస్తున్నారు. ఇందులో కేంద్రంలో కీలక మంత్రులతో పాటు అత్యున్నత స్థాయి అధికారులు కూడా హాజరయ్యారు. ఇందులో క్రూడాయిల్, గ్యాస్, ఎల్పీజీ, విద్యుత్, ఎరువుల పరిస్ధితిపై సమీక్షిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నిత్యావసర వనరుల నిరంతర సరఫరా, స్థిరమైన లాజిస్టిక్స్, సమర్థవంతమైన పంపిణీపై ప్రధాని మోడీ ఈ భేటీలో చర్చిస్తున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర సీనియర్ మంత్రులు హాజరయ్యారు.

ఇరాన్ వార్ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో గ్యాస్ సిలెండర్ల నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని, ఎటువంటి రద్దీ లేదని అధికారులు చెప్తున్నారు. ఇవాళ అమెరికాలోని టెక్సాస్ నుండి ఎల్పీజీ నౌక న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. అంతకుముందు మార్చి 14 నుండి మార్చి 31 వరకు ముడి చమురు, ఎల్బీజీపై సరుకు రవాణా సంబంధిత ఛార్జీలను పోర్టు మాఫీ చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
-
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్‌లకే దిక్కులేని పరిస్థితి! -
Raghav Chadha: మోడీని వదిలేసి సమోసా రేట్లపై ప్రశ్నలా? రాఘవ్ చద్దాకు ఆప్ కౌంటర్ ..! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..! -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
ఫ్రీ టిఫిన్.. గ్యాస్ కష్టాల్లో అదిరిపోయే ఐడియా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!














Click it and Unblock the Notifications