సైన్యం కాన్వాయ్‌పై ఉగ్రకాల్పులు: తిప్పికొట్టిన భద్రతా దళాలు, ఒకరికి గాయాలు

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో శనివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. క్వాజిగుండ్‌ ప్రాంతంలో భద్రతా బలగాల వాహన శ్రేణిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఆ సమయంలో అటుగా కారులో వస్తున్న ఓ పౌరుడికి బుల్లెట్‌ తగిలింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఉగ్రవాదులు అక్కడ్నుంచి పరారయ్యారు.

Attack on ITBP convoy, one injured

ఘటన స్థలంలో లభించిన ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఉగ్ర కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని భద్రతా బలగాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం నియంత్రణ రేఖ వద్ద చొరబాటుదార్ల కుట్రను భగ్నం చేసిన మరుసటి రోజే ఉగ్రవాదులు ఈ దాడికి యత్నించడం గమనార్హం. చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాగా, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర ఏరివేత ఆపరేషన్‌ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth was injured when unknown gunmen on Saturday attack ITBP convoy in south Kashmir’s Anantnag district, sources said. Arif Dar of Anantnag was injured when unidentified gunmen fired upon ITBP convoy at Vessu village in Qazigund,sources told Media Sources.
Please Wait while comments are loading...