వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కు షాక్, కొడుకుని అరెస్టు చేసిన ఎన్ఐఏ

మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయీద్ సలాహుద్దీన్‌కు ఎన్‌ఐఏ షాక్ ఇచ్చింది. సలాహుద్దీన్ కుమారుడు సయీద్ షాహిద్ యూసుఫ్‌(42)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. 2011నాటి ఉగ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయీద్ సలాహుద్దీన్‌కు ఎన్‌ఐఏ షాక్ ఇచ్చింది. సలాహుద్దీన్ కుమారుడు సయీద్ షాహిద్ యూసుఫ్‌(42)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది.

2011నాటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోతహిస్తూ, నిధులు సమీకరించిన కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నాడు. 42 ఏళ్ల షాహిద్ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

Hizbul Chief Syed Salahuddin's Son, Who Is Government Employee, Arrested

టెర్రర్ ఫండింగ్ కేసులో సుదీర్ఘకాలం దర్యాప్తు జరిపిన తరువాత అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. షాహిద్‌కు అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయి.

మంగళవారం ఎన్‌ఐఏ అరెస్టు చేసిన షాహిద్ యూసుఫ్ తండ్రి మహ్మద్ యూసుఫ్ షా అలియాస్ సయీద్ సలాహుద్దీన్ కరుడుగట్టిన ఉగ్రవాది. అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో సలాహుద్దీన్ పేరు ఉంది.

సలాహుద్దీన్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌గా యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నాడు. కాశ్మీర్ లోయలో అనేక ఉగ్రవాద సంస్థలతో అతడికి సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ ప్రకటించింది.

ఐజాజ్ అహ్మద్ భట్ నుంచి నిధులు బదిలీ చేయించినట్టు ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. ఉగ్రవాది భట్ దేశం నుంచి పారిపోయి ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. భట్‌తో ఇంకా పలువురికి సంబంధాలున్నట్టు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.

భట్‌తో నిత్యం టెలిపోన్లలో మాట్లాడుతూ సీక్రెట్ కోడ్ ద్వారా నిధులు బదిలీ చేయిస్టున్నట్టు తెలిసింది. ఢిల్లీలోని హవాలా చానళ్ల ద్వారా పాకిస్తాన్ నుంచి జమ్మూకాశ్మీర్‌కు అక్రమ పద్ధతుల్లో నిధులు వస్తున్నట్టు ఎన్‌ఐఏ పసిగట్టింది.

విరాళాలతో భారత్‌లో ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై 2011 ఏప్రిల్‌లో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.

ఈ ఉగ్ర ఫండింగ్ కేసులో మొత్తం ఆరుగురిపై రెండు చార్జిషీట్‌లను ఎన్‌ఐఏ దాఖలు చేసింది. పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ, ముఖ్య అనుచరుడు జిఎం భట్, మహ్మద్ సిద్దిఖీ గనాయ్, గులాం జిలానీ లిలూ, ఫరూఖ్ అహ్మద్ దగ్గాలపై చార్జిషీట్‌లు దాఖలయ్యాయి.

అందులో నలుగురు ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. మహ్మద్ మఖ్బుల్ పంటిట్, ఇజాజ్ అహ్మద్ భట్‌లతో రెండో చార్జిషీట్ దాఖలు చేయగా ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులపైనా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.

English summary
Syed Shahid Yousuf, the son of terror group Hizbul Mujahideen's chief Syed Salahuddin, has been arrested in Jammu and Kashmir by the National Investigation Agency (NIA) in a 2011 terror funding case. Yousuf, 42, works in the state government as a village agriculture assistant and has a family home in Budgam."He was summoned for questioning to Delhi on Tuesday after initial rounds his role was conclusively established in the case and so we arrested him," NIA spokesperson Alok Mittal told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X