వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి ఆధిపత్యం భారత్‌దే: చైనాకు నోరెత్తనివ్వకుండా: నిర్మొహమాటంగా తప్పును ఎత్తి చూపిన ఆర్మీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య పతాక స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడటానికి, యుద్ధ వాతావరణం నెలకొనడానికి దారి తీసిన సరిహద్దు వివాదంపై చర్చల పర్వం శనివారం ముగిసింది. ఉదయం 11:30 గంటలకు ఆరంభమైన ఈ చర్చలు సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగాయి. ఈ అయిదున్నర గంటల కాలంలో రెండు దేశాల మిలటరీ ప్రతినిధుల మధ్య సుమారు 12 రౌండ్ల పాటు చర్చలు కొనసాగినట్లు ఆర్మీ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఉద్రిక్తతలకు కారణమైన లడక్ సెక్టార్‌లోనే

ఉద్రిక్తతలకు కారణమైన లడక్ సెక్టార్‌లోనే

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి మిలటరీ అధికారుల మధ్య చర్చలు ఆరంభం అయ్యాయి. ఈ చారిత్రాత్మక సంఘటనకు లడక్ సరిహద్దు ప్రాంతం వేదికగా మారింది. చైనా భూభాగంలోని మాల్డోలో ఈ రెండు దేశాల మధ్య చర్చలకు వేదికగా మారింది. భారత్ భూభాగంపై సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛుసుల్‌కు సమీపంలో ఉంటుందీ మాల్దో. మాల్దో-చుసుల్ బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ వద్ద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

పాల్గొన్నది వీరే..

పాల్గొన్నది వీరే..

రెండు దేశాల మిలటరీ తరఫున లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. మనదేశ ఆర్మీ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ దీనికి సారథ్యం వహించనున్నారు. హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ఆర్మీ ప్రతినిధుల బృందం ఈ చర్చలకు హాజరవుతుంది. చైనా తరఫున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొననున్నారు. సరిహద్దుల్లో మోహరింపజేసిన సైనికులను ఉపసంహరించడం, సైనిక శిబిరాలను తొలగించాలనేది భారత ప్రధాన డిమాండ్. దీనిపై చైనా వైఖరి ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఆలస్యంగా ప్రారంభమైన చర్చలు..

ఆలస్యంగా ప్రారంభమైన చర్చలు..

షెడ్యూల్ ప్రకారం.. ఈ ఉదయం 9:30 గంటలకు చర్చలు కావాల్సి ఉన్నట్లు తెలిసింది. ఇందులో ప్రస్తావనకు తీసుకొచ్చిన అంశాలు అత్యంత సున్నితం, సమస్యాత్మకమైనవి కావడం వల్ల ఆర్మీ అధికారులు చివరి నిమిషంలో షార్ట్ లిస్ట్ చేయాల్సి వచ్చిందని, కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర అజెండాను కుదించాల్సి రావడం వల్ల ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. ఉదయం 11:15 నుంచి 11:30 గంటల మధ్య చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Recommended Video

VVS Laxman Lauds Virender Sehwag
తొలి వాదన భారత్‌దే

తొలి వాదన భారత్‌దే

చర్చల సందర్భంగా తొలి వాదనను భారత ప్రతినిధులే ప్రారంభించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన సందర్భాలను భారత ఆర్మీ ప్రతినిధులు అంశాలవారీగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ,చైనా బలగాలు సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడం, వారిని అడ్డుకోవడానికి మనదేశ సరిహద్దు భద్రతా బలగాలను ప్రయత్నించడం, ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం వంటి విషయాలను పాయింట్ల వారీగా భారత ప్రతినిధులు ప్రస్తావించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

English summary
India China Standoff: Talks between military commanders of India and China in Moldo on the Chinese side of Line of Actual Control are over. The Indian delegation led by 14 Corps Commander Lt Gen Harinder Singh is returning to Leh, says Indian Army Sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X