India Corona Cases Today: లక్షకు దిగొచ్చిన కొత్త కేసులు, 2 నెలల కనిష్టం: 15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గుదల కనిపించింది. తాజా కేసులు లక్షకు దిగిరావడం గమనార్హం. సుమారు రెండు నెలల తర్వాత ఇదే కనిష్టం. దేశంలో రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. 94శాతానికి చేరింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.

Recommended Video

    Kamala Harris Speaks To PM Modi, బైడెన్, కమలా కి మోదీ ధన్యవాదాలు!! || Oneindia Telugu
    దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు

    దేశంలో గత 24 గంటల వ్యవధిలో 15,87,589 నమూనాలను పరీక్షంగా.. కొత్తగా 1,00,636 కరోనా కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే 12 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడినవారి సంఖ్య 2,89,09,975కు చేరింది.

    దేశంలో తాజాగా 2427 మంది మృతి.. రికవరీ పెరిగింది..

    దేశంలో తాజాగా 2427 మంది మృతి.. రికవరీ పెరిగింది..

    గడిచిన 24 గంటల్లో 2427 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి 3,49,186 మంది మరణించారు. ఆదివారం ఒక్కరోజే దేశంలో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,71,59,180కి చేరింది.

    15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

    15లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

    దేశంలో రికవరీ రేటు 94 శాతానికి చేరగా, పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు నమోదైంది.

    ప్రస్తుతం దేశంలో 14,01,609 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13.90 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23కోట్లకు చేరింది.

    లాక్‌డౌన్, కర్ఫ్యూ సడలింపుల దిశగా రాష్ట్రాలు

    లాక్‌డౌన్, కర్ఫ్యూ సడలింపుల దిశగా రాష్ట్రాలు

    కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలను సడలిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఐదు కేటగిరీల్లో సడలింపులను ఇస్తోంది. ఢిల్లీలో కూడా మినహాయింపులను లాక్‌డౌన్ ప్రకటించింది. షాపులను సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతిచ్చింది. ఢిల్లీలో మెట్రో సేవలు కూడా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, 50శాతం కెపాసిటీతోనే నడవనున్నాయి. యూపీలోనూ కర్ఫ్యూ నిబంధనలను సడలించారు. హర్యానా, సిక్కింలలో మాత్రం జూన్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే జూన్ 14 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీల్లోనూ సడలింపులు ప్రకటించే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+