పెద్దనోట్లు రద్దు వలన ఇవే ప్రయోజనాలు, బినామి కంపెనీలు ఉగ్రవాదంపై దెబ్బ, సామాన్యులకు !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పెద్దనోట్లు రద్దు చేసి నేటికి (నవంబర్ 8) సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు కొంతమంది ప్రజలు. పెద్దనోట్లు రద్దు అయిన తరువాత దేశంలో ఉగ్రవాదం, నక్సల్ కార్యకలాపాలు చాల వరకూ తగ్గిపోయాయని అంటున్నారు.

  Did Notes Ban Choke Black Money

  దేశంలోని 2, 24 లక్షల బినామీ కంపెనీలు మూతపడ్డాయని గుర్తు చేశారు. వేల సంఖ్యలో బినామీ కంపెనీల బ్యాంకు అకౌంట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారని అంటున్నారు. 35,000 కంపెనీలకు సంబంధించి 58,000 బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ. 17,000 కోట్ల రూపాయల విలువైన పెద్దనోట్లు అధికారికంగా మార్పిడి జరిగిందని గుర్తు చేస్తున్నారు.

  రూ. 7.76 లక్ష్లల నకిలీ నోట్లు !

  రూ. 7.76 లక్ష్లల నకిలీ నోట్లు !

  జమ్మూ కాశ్మీర్ లో 2016 నవంబర్ 8 వ తేదీకి ముందు తరువాత పొల్చుకుంటే 75 శాతం అక్రమ నగదు లావాదేవీలు, విదేశాల నుంచి ఉగ్రవాదులకు అందుతున్న నిధులు తగ్గిపోయాయి అంటున్నారు. రూ. 7.62 లక్షల విలువైన నకిలీ నోట్లు బయటకు వచ్చాయని చెబుతున్నారు.

  సామాన్యుడికి సొంత ఇల్లు

  సామాన్యుడికి సొంత ఇల్లు

  రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడంతో సామాన్యులు సొంత ఇళ్లు కట్టుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో వ్యాపారాలు 4 శాతం, గుజరాత్, మధ్యప్రదేశ్ లో 5 శాతం అభివృద్ది అయ్యాయని అంటున్నారు. 17.73 లక్షల మంది ఇంత కాలం ఆదాయపన్ను చెల్లించలేదని వెలుగు చూసిందని చెబుతున్నారు.

  ఆధారాలు లేని రూ. 29,213 కోట్లు !

  ఆధారాలు లేని రూ. 29,213 కోట్లు !

  సరైన ఆధారాలు లేని రూ. 29,213 కోట్లు బయటపడిందని అంటున్నారు. పీఎఫ్ 9 శాతం నుంచి 13.3 శాతం పెరిగిందని గుర్తు చేస్తున్నారు. దేశంలో బ్లాక్ మనీ, ఉగ్రవాద నిర్మూలన, అక్రమ లావాదేవీలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు.

  ఉద్యోగులకు నేరుగా జీతం

  ఉద్యోగులకు నేరుగా జీతం

  ఇంత కాలం మధ్యవర్తుల ద్వారా జీతాలు తీసుకుంటున్న లక్షల మంది ఉద్యోగులు పెద్దనోట్లు రద్దు కారణంగా పని చేస్తున్న కంపెనీల నుంచి బ్యాంకు అకౌంట్ల ద్వారా నేరుగా జీతం తీసుకు అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. మధ్యవర్తుల కమిషన్ తీసుకుని జీతం ఇచ్చేవారని, ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులకు నేరుగా బ్యాంకుల ద్వారా జీతం వస్తున్నదని చెబుతున్నారు.

  సామాన్యులు ఇబ్బంది పడినా !

  సామాన్యులు ఇబ్బంది పడినా !

  పెద్దనోట్ల రద్దుతో రెండు మూడు నెలలు సామాన్యులు ఇబ్బంది పడినా కేంద్రం నిర్ణయం దేశానికి మంచి చేసిందని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్దనోట్లు రద్దును సమర్థించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు సహకారం ఎప్పటికీ మరువలేనని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a series of tweets Narendra Modi thanks people for supporting the Brave decision of Demonatisation. he also uploded a short video witch showing Benifits of Demonatisation, and in a another tweet Modi asked people to give opinion about demonatisation in NM app.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి