వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కార్యాలయంలో కప్ బోర్డుల్లో కరెన్సీ కట్టలు, 82 కిలోల బంగారం స్వాధీనం

కప్ బోర్డుల్లో కుప్పలు కుప్పలుగా ఉన్న కరెన్సీని డిల్లీలో ఆదాయపు పన్నుశాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు. టీ అండ్ టీ న్యాయసంస్థ కార్యాలయంపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించి 13 కోట్ల నగదును స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :అది ఒక న్యాయసంస్థ కార్యాలయం, అక్కడ కేసులకు సంబంధించిన ఫైళ్ళు లేవు. వాటి స్థానంలో కట్టలు కట్టలుగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించి ఈ నగదును స్వాధీనం చేసుకొన్నారు.

న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ 1 లో ఉన్న టీ అండ్ టీ న్యాయ సంస్థ కార్యాలయంలో ఆధాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించి 13.56 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు..ఇందులో కొత్త , పాత కరెన్సీ నగదు నోట్లు ఉన్నాయి.

 over 13 crores seized from law firm in delhi

టీఅండ్ టీ న్యాయసంస్థ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించగా, 2.5 కొత్త కరెన్సీని, 7 కోట్లకు రద్దు చేసిన పాత నగదును స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు ,ఆదాయపు పన్నుశాఖాధికారలు దాడులు నిర్వహించిన సమయంలో కేర్ టేకర్ మినహా ఎవరూ లేరు కార్యాలయంలోలేరు.ఈ సంస్థ ప్రమోటర్ రోహిత్ టాండన్ కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

మరో వైపు కొత్త కరెన్సీ కోసం సామాన్యులు కష్టాలు పడుతోంటే, ధనవంతులు మాత్రం తమ ఇళ్ళలో కోట్లాది రూపాయాల కొత్త కరెన్సీని కలిగి ఉంటున్నారు. వీరికి ఎలా కొత్త కరెన్సీ చేరిందోనని అర్థం కావడం లేదు. దేశ వ్యాప్తంగా శనివారం నాడు 44 కోట్లు, 82 కిలోల బంగారాన్ని ఆదాయపు పన్ను శాకాధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో 32 కోట్ల రూపాయాలు కొత్త కరెన్సీ .

English summary
income tax officials , delhi police raided the office of law film in delhi.officers seize 13 croresof cash in the office. police searching for promoter tandan,. entire in the country income tax officers, police seized around 44 crores ,82 kgs gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X