వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ దేశాల్లో ఉద్యోగం అన్నింటా బెస్ట్: జాబితా ఇదే!..

సుమారు 27 వేల మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి ఈ జాబితాను తయారుచేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచంలో ఉద్యోగానికి అత్యంత అనువుగా ఉండే దేశాలేంటో తెలుసా? ఇదే విషయంపై తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. ప్యాకేజీ, ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితా తయారు చేశారు.

జాబితాలో స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్‌లు వ‌ర‌ుస‌గా టాప్-3 స్థానాల్లో నిలిచాయి. నాలుగో స్థానంలో యూఏఈ నిలిచింది. కాగా, గతేడాది హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన వార్షిక సర్వేలో ఆరో స్థానంలో ఉన్న యూఏఈ ఇప్పుడు మ‌రో రెండు స్థానాలు ఎగ‌బాకి నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.

 Best employee friendly countries in the world

విదేశాల్లో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న యువతకు యూఏఈ సరైన గమ్య‌స్థానంగా నిలుస్తోంద‌ని సర్వే తెలిపింది. సుమారు 27 వేల మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి ఈ జాబితాను తయారుచేశారు. సొంత దేశంలో క‌న్నా యూఏఈలో అధికంగా సంపాదిస్తున్నట్టు సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది అభిప్రాయపడ్డారు. ఇందులో స్విట్జర్లాండ్ (75 శాతం మంది), ఖతార్ (66 శాతం) టాప్ లో నిలిచాయి.

కంపెనీలో చేరేటప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా కనీసం ఒక్క ప్రయోజనాన్ని అయినా తాము అదనంగా పొందుతున్నామని మధ్యప్రాచ్య దేశాల్లోని 91శాతం మంది ఉద్యోగులు తెలియజేశారు. ఇది ప్రపంచసగటు (67శాతం) కన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

English summary
Its an interesting survey that revealed best employee friendly countries across the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X