వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. ఈరోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వచ్చాయి: మీడియాపై ట్రంప్ సెటైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై సెటైర్ వేశారు. ఫేక్ న్యూస్ మీడియా అంటూ ఎద్దేవా చేశారు. మీడియా నిజాలను రాయదని, చెప్పదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై సెటైర్ వేశారు. ఫేక్ న్యూస్ మీడియా అంటూ ఎద్దేవా చేశారు. మీడియా నిజాలను రాయదని, చెప్పదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ట్రంప్ కి మీడియా అంటే ఆదినుంచీ ఆగ్రహమే. ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు ఆయన మీడియాను ఏకిపారేయడం మామూలే. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ మీడియాపై విరుచుకుపడే వారు.

donald-trump

తాజాగా బుధవారం కూడా ట్రంప్ మీడియాపై విరుచుకుపడ్డారు. 'వావ్.. ఈరోజు చాలా ఫేక్ న్యూస్ స్టోరీలు వచ్చాయి.. నేను సరిగ్గా ఏం చెప్పానో, ఏం చేస్తున్నానో తెలుసుకోవలసిన అవసరం మీడియాకు లేదు.. ఫేక్ న్యూస్ మీడియా నియంత్రణ కోల్పోయింది..'' అంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాలో తన అక్కసును వెళ్లగక్కారు.

నిజానికి తనకు మీడియా కన్నా ట్విట్టర్ అంటేనే ఇష్టమని తరచూ ట్రంప్ చెబుతుంటారు. మీడియా నిజాలను రాయదు, చెప్పదు అంటూ ఎద్దేవా చేశారు. తన ప్యూర్టోరికో పర్యటనకు సంబంధించి మీడియా కవరేజి గురించి ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు.

English summary
President Trump lambasted the "the fake news media" in a tweet early Wednesday, saying it is "out of control." "Wow, so many Fake News stories today. No matter what I do or say, they will not write or speak truth. The Fake News Media is out of control!" the president said. Trump's tweet comes as he faces scrutiny for his comments during a visit to hurricane-ravaged Puerto Rico on Tuesday. During the trip, he joked that relief efforts are breaking the federal budget and compared the death tolls from Hurricanes Katrina and Maria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X