వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో అవమానం: కోర్టుకు వెళ్లే యోచనలో బాక్సింగ్ దిగ్గజం కొడుకు

దివంగత బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ కుమారుడు జూనియర్ అలీకి సొంత గడ్డ అమెరికాలోనే చేదు అనుభవం ఎదురైంది. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: దివంగత బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ కుమారుడు జూనియర్ అలీకి సొంత గడ్డ అమెరికాలోనే చేదు అనుభవం ఎదురైంది. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

ఆయన పేరులో అరబిక్ ధ్వని ఉన్నదన్న కారణంగా ఫ్లోరిడా విమానాశ్రయంలో రెండున్నర గంటలకు పైగా అధికారులు ప్రశ్నలతో వేధించిన విషయం తెలిసిందే.

అతని పేరు అరబిక్‌ పదంలా ధ్వనిస్తుండటంతో ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన్ను అధికారులు నిర్బంధించారు. ప్రశ్నల వర్షం కురిపించి, ఆ తర్వాత వదిలేశారు. ఈ నెల ఏడో తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసింది.

Muhammad Ali’s son may sue after being detained at Florida airport and questioned about his religion

44 ఏళ్ల అలీ జూనియర్‌ తన తల్లి ఖలీలా కమాకో-అలీతో కలిసి ఈ నెల 7న జమైకా నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడర్డలే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పేర్లు అరబిక్‌ పదాల్లా ధ్వనిస్తుండటంతో అధికారులు వారిని అడ్డుకున్నారు.

అయితే, తన భర్త మహ్మద్‌ అలీతో కలిసి దిగిన ఫొటోను చూపించడంతో కమాకోను అధికారులు విడిచిపెట్టారు. జూనియర్‌ వద్ద అలాంటి ఫొటోలేవీ లేకపోవడంతో రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు.

మీరు ముస్లిం మతస్థులా?, మీ పేరును ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటూ పదే పదే ప్రశ్నించారు. తన తండ్రిలాగే తానూ ముస్లింనని జూనియర్‌ చెప్పడంతో మరిన్ని ప్రశ్నలు అడిగారు. చాలాసేపు నిర్బంధం అనంతరం ఆయన్ను వదిలేశారు.

నిజానికి వీసాల నిరాకరణ పైన ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలుపుదల చేసింది. అయినా అలీ కుటుంబం పట్ల ఎయిర్ పోర్టు అధికారులు అమర్యాదగా ప్రవర్తించడంపై బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ అభిమానులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లాలని చూస్తున్నారు.

English summary
Muhammad Ali’s son may sue after being detained at Florida airport and questioned about his religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X