వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జాంగ్ మరో సంచలనం -నిద్ర పోవాలని లేదా? -బైడెన్‌కు యో వార్నింగ్ -భారత్‌కు రావాల్సి ఉండగా

|
Google Oneindia TeluguNews

కొన్నాళ్ల ప్రశాంతను పక్కన పెడుతూ ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ జూలు విదిల్చాడు. ఆగర్భ శత్రువు అమెరికాపై మరోసారి మండిపడ్డాడు. ట్రంప్ ఏలుబడిలో అమెరికా పట్ల చాకచక్యంగా వ్యవహరించిన కిమ్, నూతన అధ్యక్షుడు జోబైడెన్ కొత్త ఎత్తులకు దీటుగా స్పందిస్తున్నాడు. నార్త్ కు వ్యతిరేకంగా సౌత్ కొరియా, జపాల్ లతో కలిసి అమెరికా కొత్త మంత్రాంగం మొదలుపెట్టిన దరిమిలా కిమ్ తాను బ్రహ్మ్రాస్త్రంగా భావించే సోదరి కిమ్ యో జాంగ్ ను రంగంలోకి దిపాడు.

ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్నys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్న

అమెరికా మంత్రాంగంతో..

అమెరికా మంత్రాంగంతో..

ట్రంప్ హయాంలో అటు ఇటైన విదేశాంగ విధానాన్ని సవరించుకోవడంలో భాగంగా జోబైడెన్ కీలక చర్యలకు ఉపక్రమించాడు. ఆ క్రమంలోనే బైడెన్ కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా పనిచేస్తోన్న ఆంటోనీ బ్లింకెన్, అమెరికా సైనిక హెడ్ క్వార్టర్స్ 'పెంటగాన్' చీఫ్ లాయిడ్ అస్టిన్ తూర్పు దేశాల్లో కీలక పర్యటన చేపట్టారు. ఇప్పటికే టోక్యోలో మతనాలు జరిపిన ఈ ఇద్దరూ బుధవారం దక్షిణ కొరియాకు వెళతారు. ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనాతోపాటు ఉత్తరకొరియాను కట్టడి చేసే దిశగా బ్లింకెన్, అస్టిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో నార్త్ కొరియా సరిహద్దులో అమెరికా-సౌత్ కొరియా సంయుక్తంగా సైనిక కలాపాలు నిర్వహిస్తున్నది. ఈ పరిణామాలపై నార్త్ కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ మేరకు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ పేరుతో నార్త్ అధికారిక పత్రిక 'రొడాంగ్ సిన్మన్'లో ఓ ప్రకటన వెలువడింది..

బైడెన్‌కు కిమ్ సోద‌రి వార్నింగ్‌

బైడెన్‌కు కిమ్ సోద‌రి వార్నింగ్‌

ఉత్తరకొరియా సరిహద్దులో యూఎస్-సౌత్ దళాల విన్యాసాలు, జపాన్, సౌత్ లకు అమెరికా మంత్రులు, అధికారుల రాక నేపథ్యంలో కిమ్ జాంగ్ కు ప్రధాన సలహాదారుగానూ వ్యవహరిస్తోన్న సోదరి కిమ్ యో జాంగ్ సంచలన ప్రకటన చేశారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియాతో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని, సరిహద్దు వెంబడి, అలాగే అంతర్జాతీయంగా నార్త్ కు వ్యతిరేకంగా సాగుతోన్న కుట్రలను సహించబోమని అన్నారు. బైడెన్ అధికారంలోకి వ‌చ్చిన సుమారు రెండు నెల‌ల త‌ర్వాత నార్త్ కొరియా ఈ తరహాలో ఘాటు హెచ్చరిక చేయడం ఇదే తొలిసారి. అందులో..

నాలుగేళ్లూ నిద్ర పోవాలని లేదా?

నాలుగేళ్లూ నిద్ర పోవాలని లేదా?

''ఏమనుకుంటున్నారు మీరు? మాకు గన్ పౌడర్ వాసన చూపించాలని ఉత్సాహపడుతున్నారా? సరిహద్దులో తాటాకు చప్పుళ్లతో మమ్మల్ని బెదరగొడతారా? మాతో పెట్టుకుంటే ఎవర్నీ వదలం. పాపం, అమెరికా కొత్త అధ్యక్షుడికి.. రాబోయే నాలుగేళ్లూ ప్రశాంతంగా నిద్రపోవాలని లేదేమో? నార్త్ కు సంబంధించిన ఎలాంటి వ్యవహారంలోనైనా అమెరికా ఆటలు సాగనీయం. అయినాసరే కవ్వింపులు మానుకోకపోతే నిద్రపట్టకుండా చేస్తాం. జాగ్రత్త..'' అంటూ బైడెన్ ను ఉద్దేశించి కిమ్ యో జాంగ్ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ -టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ దిక్కు -జగన్ మాటే ఫైనల్: మంత్రి బాలినేనిచంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ -టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ దిక్కు -జగన్ మాటే ఫైనల్: మంత్రి బాలినేని

సిద్ధంగా స‌బ్‌మెరైన్ మిస్సైల్‌

సిద్ధంగా స‌బ్‌మెరైన్ మిస్సైల్‌

బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేసిన సందర్భంలో నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ లో నిర్వహించిన భారీ కార్యక్రమంలో అమెరికాను ప్ర‌ధాన శ‌త్రువుగా కిమ్ జాంగ్ ప్రకటించారు. నాటి మిలిట‌రీ ప‌రేడ్‌లో భాగంగా స‌బ్‌మెరైన్ ద్వారా బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించారు. ప్రస్తుతం ఉత్తర-దక్షిణ కొరియాల సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొందని, అమెరికా మంత్రి, రక్షణ శాఖ అధికారుల పర్యటన పరిస్థితిని ఇంకాస్త వేడక్కించాయని నార్త్ పరిశీలకులు అంటున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జోబెడన్ కు హెచ్చరికగా కిమ్ మరోసారి బాంబుల పరీక్షలు చేపట్టే అవకాశం లేకపోలేదనీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే..

కొరియా నుంచి భారత్‌కు

కొరియా నుంచి భారత్‌కు

బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఇండో-పసిఫిక్ రీజియన్ పై అమెరికా ఎక్కువ శ్రద్ధ పెట్టడం, చైనాతో వాణిజ్య ఒప్పందాలను తిరగరాసుకుంటూనే, దానికి శతృదేశాలైన జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఆస్ట్రేలియాలతో బైడెన్ టీమ్ వరుసగా మంతనాలు జరుపుతుండటం తెలిసిందే. అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, పెంటగాన్ చీఫ్ లాయిడ్ అస్టిన్ ఇప్పటికే జపాన్ పర్యటన ముగించుకుని సియోల్(సౌత్ కొరియా) బయలుదేరే పనిలో ఉన్నారు.

అక్కడి నుంచి బ్లింకెన్ తిరిగి అమెరికా వెళ్లిపోనుండగా, అస్టిన్ మాత్రం నేరుగా భారత్ విచ్చేయనున్నారు. భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు సంయుక్తంగా 'క్వాడ్' పేరుతో నిర్వహిస్తోన్న చర్చల్లో పాల్గొనేందుకు అస్టిన్ భారత్ రానున్నారు. ఇప్పటికే క్వాడ్ మీటింగ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ తో ఫేస్ టైమ్ లో మాట్లాడటం తెలిసిందే.

English summary
North Korean leader Kim Jong Un's influential sister Kim Yo Jong warned the United States against actions that could make it "lose sleep", state media reported Tuesday, as top Biden administration officials began a visit to key allies Tokyo and Seoul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X