వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌, విజయవంతంగా పునర్వినియోగం

అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. ఒకసారి ఉపయోగించిన రాకెట్ ను మరోసారి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కేప్ కెనెవరల్: అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సేవల ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. ఒకసారి ఉపయోగించిన రాకెట్ ను మరోసారి విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.

స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్ ను ప్రయోగించిన తరువాత దానిని సురక్షితంగా మళ్లీ లాంచ్ ప్యాడ్ పై ల్యాండ్ అయ్యే విధంగా చేస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు చేసింది. అయితే ఇప్పుడు అలా ఒకసారి ఉపయోగించి తిరిగి భూమికి చేరిన రాకెట్ ను మరోసారి విజయవంతంగా ప్రయోగించింది.

రాకెట్ ను పునర్వినియోగించడం ఇదే ప్రథమం. గురువారం ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా సమాచారం ప్రసార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ విధానంతో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గుతుంది.

SpaceX makes aerospace history with successful launch and landing of a used rocket

రెండోసారి ఉపయోగించిన రాకెట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించి తిరిగి మళ్లీ అట్లాంటిక్ సముద్రంలోని డ్రోన్ షిప్ లాంచ్ ప్యాడ్ పై ల్యాండ్ అయింది. దీంతో నిపుణులు, శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

లక్సెంబర్గ్ కు చెందిన ఎస్ఈఎస్ కంపెనీ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. రాకెట్ పునర్వినియోగంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ ముస్క్ చాలా కాలంగా నిరంతర కృషి జరుపుతున్నారు. కార్లు, విమానాలు, వాహనాల మాదిరిగానే రాకెట్ భాగాలు కూడా తిరిగి ఉపయోగపడాలన్నదే తమ లక్ష్యమని ముస్క్ తెలిపారు.

English summary
After more than two years of landing its rockets after launch, SpaceX finally sent one of its used Falcon 9s back into space. The rocket took off from Cape Canaveral, Florida, this evening, sending a communications satellite into orbit, and then landed on one of SpaceX’s drone ships floating in the Atlantic Ocean. It was round two for this particular rocket, which already launched and landed during a mission in April of last year. But the Falcon 9’s relaunch marks the first time an orbital rocket has launched to space for a second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X