వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

35 వేల అడుగుల ఎత్తు: విమానంలో రచ్చరచ్చ (వీడియో)

|
Google Oneindia TeluguNews

మెక్సికో: అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో ఇప్పటికీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ మీద డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో విమానంలో పెద్ద గొడవ జరిగింది.

35 వేల అడుగుల ఎత్తులో వెలుతున్న విమానంలో జరిగిన ఈ గొడవను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో కలకలం రేపింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికోకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది.

ఆ విమానంలో హిల్లరీ పై ట్రంప్ విజయం సాధించిన విషయంపై మాట్లాడుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎంత సేపటికి ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో రచ్చరచ్చ అయ్యింది.

విషయం తెలుసుకున్న పైలట్ జోక్యం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఎదో ఒక అభిప్రాయం ఉంటుందని, అయితే ఇంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో మీరు ఇలా రాజకీయాల కోసం గొడవపడటం మంచిది కాదని ఇరు వర్గాలకు సర్థి చెప్పారు.

తరువాత గొడవ సర్దుమనిగింది. ఈ విషయంపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మెక్ కార్తే వివరణ ఇచ్చారు. గొడవ జరగడం వాస్తవమని చెప్పారు. మా పైలట్ పరిస్థితిని చక్కదిద్దారని ఆయన వివరించారు.

ఎవరికైనా సమస్య ఉంటే చెప్పండి, మరుసటి రోజు వేరే విమానంలో పంపిస్తామని ప్రయాణికులకు సూచించామని అన్నారు. గొడవ జరిగే సమయంలో ఆఫ్రో-అమెరికన్ మహిళను జాతి వివక్ష వ్యాఖ్యలతో దూషించారు.

ఆసమయంలో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ గొడవను అంతా అదే విమానంలో ప్రయాణిస్తున్న బ్యుయర్ అనే వ్యక్తి తన మొబైల్ లో వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది.

English summary
Footage posted to YouTube shows the pilot addressing passengers over the intercom, telling them to “let cooler heads prevail” following a politically charged dispute on board the flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X