US Shutdown: అమెరికా ప్రభుత్వం మళ్లీ షట్ డౌన్..! ట్రంప్ కు కాంగ్రెస్ లో షాక్..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ లోకి (US Shutdown) వెళ్లిపోయింది. 2026 సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆమోదించడానికి అర్ధరాత్రి వరకూ గడువు ఉన్నా.. ఆ లోపు దాన్ని కాంగ్రెస్ ఆమోదించలేకపోయింది. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువును కాంగ్రెస్ దాటవేయడంతో ప్రభుత్వం ఇవాళ పాక్షికంగా షట్ డౌన్ అయింది. దీంతో పలు సేవలు నిలిచిపోబోతున్నాయి.
అమెరికాలోని మిన్నియాపాలిస్లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు చనిపోవడంతో డెమొక్రాట్లలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ లో బడ్జెట్ కు మద్దతిచ్చేందుకు డెమోక్రాట్లు నిరాకరించారు. డెమోక్రాట్లతో బడ్జెట్ పై చర్చలు విఫలమైన తర్వాత షట్ డౌన్ తప్పలేదు. తాజా పరిణామాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి కొత్తగా ఇవ్వాల్సిన నిధులపై చర్చలు కూడా నిలిచిపోయాయి.

సెనేట్ మద్దతు ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక షట్ డౌన్ లోకి వెళ్లింది. అయితే వచ్చేవారం ప్రారంభంలో సెనేట్ మద్దతున్న నిధుల ఒప్పందాన్ని కాంగ్రెస్ ఆమోదించే అవకాశం ఉన్నందున.. షట్‌డౌన్ స్వల్పకాలికంగా ఉండవచ్చని సెనేటర్లు చెప్తున్నారు. మరోవైపు గడువుకు ముందు బడ్జెట్ పై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో, తాత్కాలిక లేదా పూర్తి-సంవత్సర నిధుల చర్యను కాంగ్రెస్ ఆమోదించే వరకు కీలకం కాని పలు ప్రభుత్వ కార్యకలాపాల్ని నిలిపేస్తున్నారు. సభ తిరిగి సమావేశం అయ్యాక సెనేట్ మద్దతు ఉన్న ఒప్పందాన్ని ఆమోదించడానికి తగినంత మద్దతును కూడగట్టడానికి చట్టసభ సభ్యులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికాలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, రక్షణను నిర్వహించే అనేక ఏజెన్సీలలో షట్‌డౌన్ చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విభాగాలు రాత్రికి రాత్రే షట్‌డౌన్ ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించాలని భావించాయి. కానీ ఇది తాత్కాలికమేనన్న అంచనాలతో ఆ ప్రతిపాదన విరమించుకున్నాయి. వచ్చే వారం ప్రారంభంలో కాంగ్రెస్ ఊహించిన విధంగా ప్యాకేజీని ఆమోదిస్తే, కొన్ని రోజుల్లో నిధుల పునరుద్ధరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. షట్‌డౌన్ కొనసాగితే మాత్ం పదివేల మంది ప్రభుత్వ కార్మికులు జీతం లేని సెలవును ఎదుర్కోవలసి రావచ్చు, లేదా నిధులు అందేవరకు జీతం లేకుండా పని చేయాల్సి రావచ్చు.
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications