వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కలవరం: సమస్య భారత ఐటీకేనా? అమెరికాకు నష్టం వాటిల్లదా?

లక్షల మంది భారతీయుల కలల దేశం అమెరికా. ఏటా వేల మంది ఉద్యోగం కోసం ఆ దేశానికి వెళుతూ వచ్చారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారతీయులు, ప్రత్యేకించి ఐటీ నిపుణుల

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లక్షల మంది భారతీయుల కలల దేశం అమెరికా. ఏటా వేల మంది ఉద్యోగం కోసం ఆ దేశానికి వెళుతూ వచ్చారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారతీయులు, ప్రత్యేకించి ఐటీ నిపుణులు కలవరానికి గురవుతున్నారు. అమెరికా వెళ్లాలన్న ఆకాంక్షా పరులు ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, వీసాలపై సమీక్షల బెంబేలెత్తున్నారు. తాజాగా హెచ్ - 1 బీ వీసాల జారీపై ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా హెచ్ - 1 బీ వీసాల జారీలో సంస్కరణల ప్రక్రియకు తెర తీశారు.

హెచ్ 1 బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై అమెరికా సెనెటర్లు, కాంగ్రెస్ (పార్లమెంట్) సభ్యులు సమర్పించే సిఫారసుల నివేదికలు బయటకు వస్తే గానీ ట్రంప్ అమలుజేయనున్న సంస్కరణల తీరు తెన్నులు బహిర్గతం కానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా ఐటీ నిపుణుల, ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో వీసా నిబంధనలు మరింత కఠినతరం చేయడం వల్ల అమెరికా ఐటీ రంగం కష్టకాలంలో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐటీ సంస్థలే వలసలు వెళ్లే పరిస్థితులు తలెత్తుతాయని ఆ రంగ నిపుణులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా 'అమెరికా వస్తువులే కొనుగోలు చేయాలి.. అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలి' అనే పేరుతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇందులో 'అమెరికన్లకే ఉద్యోగాలు' అంశం కింద హెచ్ ‌- 1 బీ వీసా విధానంలో సంస్కరణలు చేపట్టేందుకు ప్రారంభించారు. దీని ప్రకారం అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వంలోని నాలుగు శాఖలు.. విదేశాంగ శాఖ, అంతర్గత భద్రత శాఖ, కార్మిక శాఖ, న్యాయ శాఖలు ప్రస్తుత హెచ్ - 1 బీ వీసా విధానాన్ని నవంబర్‌ నాటికి సమీక్షిస్తాయి. అందులో చేయాల్సిన మార్పులను సిఫారసు చేస్తాయి. ఆయా సంస్థలు సమీక్షించి, సిఫారసులు ఇచ్చే వరకూ హెచ్ - 1 బీ వీసా విధానంలో ఎటువంటి మార్పులు వస్తాయన్నది అస్పష్టమే.

విదేశీ నిపుణుల నియామకానికే హెచ్ 1 బీ వీసా

విదేశీ నిపుణుల నియామకానికే హెచ్ 1 బీ వీసా

అమెరికాలోని సంస్థలు తమ దేశంలో అంతర్గతంగా లభించని ఉద్యోగులను.. అందులోనూ ఉన్నత నైపుణ్య ఉద్యోగాలను భర్తీ చేయడానికి విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అవకాశం కల్పించే వీసాయే హెచ్ - 1 బీ వీసా. వీటి కోసం ఏటా వేల మంది నిపుణులు దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తుదారులకు లాటరీ పద్ధతిలో ప్రస్తుతం ఏటా 85 వేల మందికి ఈ వీసాలు జారీ చేస్తున్నారు. వీటిలో 20 వేల ఉద్యోగాలను పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఆ పైన విద్యార్హతలు గల వారికి మాత్రమే ఇస్తారు. ఈ వీసా వస్తే మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకూ అమెరికాలో ఉద్యోగం చేసుకునే హక్కు లభిస్తుంది.

భారతీయులకు హెచ్ 1 బీ వీసాతో బంధం ఇదీ..

భారతీయులకు హెచ్ 1 బీ వీసాతో బంధం ఇదీ..

హెచ్ - 1 బీ వీసాలు పొందుతున్న వారిలో దాదాపు మూడొంతుల వీసాలు భారతీయ ఐటీ ఇంజినీర్లు, డెవలపర్లే ఉన్నారు. భారత్ నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గత ఏడాది దాదాపు 1.27 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయి. ఇందులో అత్యధికులు సాంకేతిక రంగంలో పనిచేసే వారే. కొందరు అమెరికా సంస్థల్లోనే పనిచేస్తే, మరికొందరు అమెరికాలోని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఇండియన్ ఔట్ సోర్సింగ్ సంస్థల్లో పనిచేస్తారు. ఈ వీసా విధానంలో జరిగే మార్పులు ఏవైనా భారతీయ ఐటీ ఉద్యోగులు, ఆశావాహులతో పాటు.. భారత ఐటీ పరిశ్రమపైనా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

హెచ్ - 1 బీ వీసా దుర్వినియోగం అవుతుందన్న ట్రంప్

హెచ్ - 1 బీ వీసా దుర్వినియోగం అవుతుందన్న ట్రంప్

హెచ్‌ - 1 బీ వీసా విధానం దుర్వినియోగం అవుతోందని, విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా ఉద్యోగులు నష్టపోతున్నారని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదే పదే విమర్శిస్తున్నారేగానీ అదేమిటో వివరించడం లేదు. కనీస వేతన నిబంధనలు వంటి అమెరికా పౌరులకు వర్తించే కొన్ని అమెరికా కార్మిక చట్టాలు హెచ్ -1 బీ వీసాదారులకు అదే స్థాయిలో వర్తించవు. ఈ కారణంగా అమెరికా సంస్థలు తక్కువ వేతనానికే పని చేయడానికి సిద్ధంగా ఉండే విదేశీ ఉద్యోగుల నియామకానికి మొగ్గు చూపే అవకాశం కొంత ఉండొచ్చు. దీని నియంత్రణకు నియమ నిబంధనలు ఉన్నాయి. హెచ్ ‌- 1 బీ వీసాదారులకు మార్కెట్‌ వేతనాల కన్నా తక్కువ వేతనాలు చెల్లించడానికి వీలులేకపోవడం, సదరు సంస్థలో ఉన్న ఉద్యోగుల స్థానంలో విదేశీ ఉద్యోగులను భర్తీ చేయడం కాక.. అదనంగా కొత్త ఉద్యోగులుగా నియమించుకోవడం వంటివి ఆ నిబంధనలు. ఆ నిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదని, ఆయా సంస్థలు తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ అమెరికన్లకు అవకాశాలు నిరాకరిస్తున్నాయని ట్రంప్ వాదన.

హెచ్ 1 బీ వీసా చౌక అనేది అపోహే

హెచ్ 1 బీ వీసా చౌక అనేది అపోహే

నిజానికి అమెరికా సాంకేతిక పరిశ్రమ ఇప్పటికే నిపుణులైన ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోందని, తీవ్రమైన పోటీ కారణంగా అమెరికా పరిశ్రమకు ఈ ఉద్యోగుల అవసరం వేగంగా పెరుగుతోందని భారత సాఫ్ట్వేర్, సర్వీసెస్ సంస్థల సంఘం నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ అన్నారు. హెచ్ - 1 బీ వీసాదారులు చౌక కార్మికులని, వారితో అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పోతున్నాయని జరుగుతున్న ప్రచారం అంతా అపోహేనని, అందులో ఏమాత్రం నిజం లేదని ఆయన ఉద్ఘాటించారు. నిజానికి భారతదేశానికి చెందిన 150 బిలియన్ డాలర్ల సాంకేతిక పరిశ్రమ అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తోందని భారత్ వాదిస్తోంది. ఈ వీసా సంస్కరణల అమలుకు ముందడుగు వేసేక్రమంలో అమెరికా సాంకేతిక పరిశ్రమ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.

వీసా సంస్కరణలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి

వీసా సంస్కరణలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి

హెచ్ - 1 బీ వీసా విధానం మీద.. అతి తక్కువ వేతనానికే విదేశీ ఉద్యోగులను నియమిస్తున్నారని, లాటరీ విధానంతో అర్హులైన ఉన్నతస్థాయి నిపుణులకు అవకాశాలు తగ్గుతున్నాయని తదితర విమర్శల విషయంలో ట్రంప్ తాజా ఉత్తర్వు చేపట్టిన చర్యలేవీ లేవని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విలియమ్ స్టాక్ పెదవి విరిచారు. ట్రంప్ మార్పులు చేస్తానని చెప్పిన, చేసిన ప్రచారం చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరని ఆయన వివరించారు. వేతన స్థాయిలు, హెచ్ - 1 బీ వీసాలు జారీ చేసేందుకు లాటరీ విధానం అన్నీ కాంగ్రెస్ నిర్ణయించినవేనని.. ట్రంప్ వాటిని మార్చాలంటే అమెరికా కాంగ్రెస్‌ను ఒప్పించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ వీసా నియమనిబంధనలను కాంగ్రెస్ 1990 నుంచీ మార్చలేదన్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వు ప్రకారం హెచ్ - 1 బీ విధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అమెరికా ప్రభుత్వ విభాగాలు సమీక్షించి సిఫారసు చేసిన తర్వాత.. వాటిని అమలు చేయాలంటే చట్టాన్ని మార్చడానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఒబామా కేర్ పథకాన్ని తొలగించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమవడాన్ని బట్టి.. సొంత పార్టీ రిపబ్లికన్లే ఆధిక్యంలో ఉన్నా కూడా ఇలాంటి కీలక మార్పులకు వారిని ఒప్పించడం ఎంతకష్టమో తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆంక్షలు పెరిగితే ఐటీ సంస్థలే వలస బాట

ఆంక్షలు పెరిగితే ఐటీ సంస్థలే వలస బాట

అమెరికా ఐటీ పరిశ్రమ కూడా హెచ్‌ - 1బీ వీసా కార్యక్రమంపై అధికంగా ఆధారపడి ఉంది. హెచ్ ‌-1 బీ వీసా ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఫేస్‌బుక్‌, క్వాల్‌కామ్‌ సంస్థలు రెండే నియమించుకుంటున్నట్లు మీడియా కథనాలు చెప్తున్నట్లు. ట్రంప్ తాను అనుకున్నట్లు హెచ్ - 1 బీ వీసాలను మరింతగా నియంత్రిస్తే.. అది అమెరికాకు మేలు చేయడానికి బదులు కీడు చేస్తుందని.. దేశంలో ఐటీ పరిశ్రమ, ఉద్యోగ రంగాలపైనే ప్రతికూల ప్రభావం చూపొచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘అమెరికా సంస్థలకు అవసరమైన సాంకేతిక నిపుణులు లభించకపోతే.. విదేశాల నుంచి ఉద్యోగులు వచ్చి చేరే అవకాశం లేకపోతే.. ఆ సంస్థలే ఉద్యోగుల వద్దకు వలసపోవాల్సి వస్తుంది. దానివల్ల ఐటీ నిపుణులు ఎక్కువగా అందుబాటులో ఉన్న భారత్, ఐర్లాండ్, చైనాతోపాటు దక్షిణ అమెరికా దేశాలకు సంస్థలను తరలించవచ్చు. ఫలితంగా అమెరికాలో అమెరికన్లకు ఉద్యోగాలు పోతాయి. ఆయా దేశాల వారికి మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి'' అని విలియమ్ స్టాక్ పేర్కొన్నారు.

English summary
President Trump likes to say that he doesn’t want to announce in advance when he’s going to launch an attack. But on Tuesday, he signed an executive order that did just that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X