Kindap: కలకలం రేపుతున్న యువతి కిడ్నాప్.. సినీఫక్కీలో 100 మందితో వచ్చి..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ సంచలనం సృష్టిస్తోంది. తమ కుమార్తెన్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మంది వచ్చి కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

కారు ధ్వంసం
యువకుల దాడిలో ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారు ధ్వంసం అయ్యాయి. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు చెప్పారు.

ఆదిభట్ల పోలీస్ స్టేషన్
గతంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని సమాచారం. అయినప్పటికీ యువతిని కొంతకాలంగా నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని చెబుతున్నారు. పోలీసుల సపోర్ట్ తోనే నవీన్ రెడ్డి మనుషులు రెచ్చిపోయారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి కొంతమంది మనుషులతో తమ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న సమయంలో పోలీసులకు, 100కు కాల్ చేసినా స్పందించలేదన్నారు. యువతిని తీసుకెళ్లిన యువకుడు నవీన్ రెడ్డి మిస్టర్ టీ టైం ఓనర్ గా తెలుస్తోంది.

పెళ్లి సంబంధం
దుండగులు బాధితురాలి ఇంటిపై దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలికి పెళ్లి సంబంధం చూడమని స్థానికులను కోరగా.. నవీన్ రెడ్డి సంబంధం తీసుకొచ్చినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. తమకు అబ్బాయి నచ్చలేదని చెప్పామని అయినా కూడా తమ కూతురిని నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
-
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications