వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆరే సీఎం, ఏపీకి ఏం చేయని చంద్రబాబుకు హైదరాబాద్‌లో దమ్ముందా: అసదుద్దీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పూర్తి మెజార్టీతో మళ్లీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అవుతారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. అతని సోదరుడు, తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో అసదుద్దీన్ మాట్లాడారు. తమ పార్టీకి పదవుల పైన ఎలాంటి ఆశ లేదని చెప్పారు. మైనార్టీలు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే పాటు పడతామని చెప్పారు. తెలంగాణలో నాలుగేళ్లుగా ఒక్క మతఘర్షణా జరగలేదన్నారు. ప్రజలు అందరూ కలిసి ఉంటున్నారని వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ శనివారం ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు.

కేసీఆర్ అంటున్నారు, కుమారస్వామి సీఎం అయ్యారు మనం కాలేమా: అక్బరుద్దీన్ సంచలనం కేసీఆర్ అంటున్నారు, కుమారస్వామి సీఎం అయ్యారు మనం కాలేమా: అక్బరుద్దీన్ సంచలనం

కేసీఆర్‌కు ప్రజాదరణ ఉంది

కేసీఆర్‌కు ప్రజాదరణ ఉంది

అనంతరం అసదుద్దీన్ మాట్లాడారు. ప్రజల విశ్వాసం ఉండడం వల్లే పదవీకాలం ఉన్నా టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధమైందన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఒక్క రోజు కూడా పదవిని వదులుకోవన్నారు. కేసీఆర్‌కు ప్రజాదరణ చాలా ఉందని అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్‌లను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేకే కాంగ్రెస్‌, టీడీపీలు ఇతర పార్టీలు పొత్తుల కోసం పాకులాడుతున్నాయన్నారు.

ఏపీకి ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు?

ఏపీకి ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు?

నాలుగున్నరేళ్లుగా ఏపీకి ఏం చేయని నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పొత్తుతో కాంగ్రెస్‌, టీడీపీలు నిండా మునుగుతాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అని, అదే పార్టీతో మళ్లీ పొత్తు ఎలా పెట్టుకుంటుందన్నారు.

చంద్రబాబుకు దమ్ముంటే ఇక్కడ పోటీ చేయ్

చంద్రబాబుకు దమ్ముంటే ఇక్కడ పోటీ చేయ్

తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల పొత్తులు, ఎత్తులను ప్రజలు తిప్పికొడతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే హైదరాబాద్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు పోటీ చేయకపోయినా ఆయన కొడుకు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను అయినా పోటీ చేయించాలన్నారు.

 ఓ విజన్ లేదు

ఓ విజన్ లేదు

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడాన్ని అసదుద్దీన్ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. వారికి ఓ అజెండా లేదన్నారు. కానీ తెలంగాణపై కేసీఆర్, తెరాసకు విజన్ ఉందని చెప్పారు. కేసీఆర్ తప్పు చేస్తే తప్పకుండా విమర్శిస్తామని, కానీ ఆయన ఇప్పటి వరకు చేసిన పనికి ప్రశంసించాల్సిందే అన్నారు.

English summary
AIMIM President and Hyderabad MP Asaduddin Owaisi on Saturday said that his party would not ally with the TRS in Telangana, during the upcoming Assembly elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X