వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ లక్ష్యంగా.. సీబీఐకి కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, మేఘా కంపెనీపై కాంగ్రెస్ ఫిర్యాదు; సీబీఐ స్పందిస్తుందా?

|
Google Oneindia TeluguNews

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పంపు హౌస్ లు మునగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రతిపక్ష పార్టీలు కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. కెసిఆర్ అవినీతి అక్రమాలు వల్లే, కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్ లు ముంపునకు గురయ్యాయని ఆరోపణలు వినిపించాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో, మేఘ కంపెనీ నిర్వాకంపై నేటికి పోరాటం చేస్తున్నారు వైయస్ షర్మిల. ఇక వైయస్ షర్మిల మాత్రమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐకి ఫిర్యాదుచేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏఐసిసి సభ్యుడు బక్క జడ్సన్.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవినీతి జరిగిందని, మేఘ కంపెనీ పై చర్యలు తీసుకోకపోవడం వెనుక కేసీఆర్ అవినీతి కారణమని పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు వైయస్ షర్మిల. సీబీఐ దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక తాజాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కూడా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ సీబీఐ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఫిర్యాదు చేశారు.

 కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, తాజాగా మోటార్ల మరమ్మత్తు ఖర్చులపై దర్యాప్తుకు విజ్ఞప్తి

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, తాజాగా మోటార్ల మరమ్మత్తు ఖర్చులపై దర్యాప్తుకు విజ్ఞప్తి


కాళేశ్వరం ప్రాజెక్టు, మేఘా కంపెనీపై ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ సీబీఐ, నీతి ఆయోగ్‌లకు ఫిర్యాదు చేశారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేసి అశాస్త్రీయంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, బాహుబలి మోటార్ల మరమ్మత్తు ఖర్చులపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపించాలని బక్క జడ్సన్ తన ఫిర్యాదులో కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదట దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని భావించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత 2020 నాటికి ప్రాజెక్టు బడ్జెట్‌ను రూ.88,000 కోట్లకు పెంచారు. ఇప్పటి వరకు సుమారు 1 లక్షా15 వేలకోట్లను ఖర్చు చేసినట్టు ఆయన సిబిఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేంద్ర నిధులను దారి మళ్ళించి మరీ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారని ఆరోపణ

కేంద్ర నిధులను దారి మళ్ళించి మరీ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారని ఆరోపణ


జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చిందని, పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చిందని పేర్కొన్న ఆయన ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు అప్పగించినట్లు తెలిపారు.

కన్నెపల్లి పంప్ హౌస్ వరద నీటిలో మునకపై ఫిర్యాదు

కన్నెపల్లి పంప్ హౌస్ వరద నీటిలో మునకపై ఫిర్యాదు


ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా కంపెనీ రికార్డు సమయంలో పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించినట్లు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి చేరిందని తెలిపారు. దీంతో 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు

 బాహుబలి మోటార్ల రిపేర్ ఖర్చు మేఘా కంపెనీదే .. ఎందుకంటే

బాహుబలి మోటార్ల రిపేర్ ఖర్చు మేఘా కంపెనీదే .. ఎందుకంటే

ఇప్పుడు ఈ బాహుబలి మోటార్లను రిపేర్ చేయడానికి 20 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారని బక్కా జడ్సన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఎంతో కాలం కాలేదని, మరమ్మత్తు ఖర్చుల బాధ్యత మేఘా కంపెనీదేనని ఆయన స్పష్టం చేశారు. మరమ్మత్తు ఖర్చుల బాధ్యత ప్రభుత్వంపై కాదని అన్నారు. అయితే కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరేలా మరమ్మత్తుల బిల్లును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందన్నారు.
దీనిపై విచారణ జరిపించాలని కోరారు.

సీబీఐ కి చేరిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అక్రమాల రగడ.. సీబీఐ స్పందిస్తుందా ?

సీబీఐ కి చేరిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అక్రమాల రగడ.. సీబీఐ స్పందిస్తుందా ?

కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన మొత్తం అక్రమాలు, అవకతవకలను, ప్రభుత్వ అవినీతి, నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం కేసీఆర్ అవినీతి పై గతంలో కూడా తన ఫిర్యాదును ఇచ్చానని గుర్తు చేస్తూ నీతి ఆయోగ్ కు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను తెలియజేస్తూ ఇచ్చిన ఫిర్యాదును కోట్ చేశారు బక్కా జడ్సన్ .మొత్తంమీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి, అక్రమాల ఆరోపణల వ్యవహారం ప్రస్తుతం బక్క జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కి చేరింది. గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా మోడీ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సి.బి.ఐ స్పందిస్తుందా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.

English summary
AICC member, congress leader Bakka Judson has filed a complaint with CBI and NITI Aayog against the Kaleswaram project and Megha company and aslo on CM KCR over irregularities and corruption in the project works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X