వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడేం చేశారు: వెంకయ్య గట్టి కౌంటర్, కెసిఆర్‌కు ప్రశంస, ఏకైక సిటీ వరంగల్..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో అసహనం పెరుగుతోందన్న వాదన సరికాదని, ఒకటి రెండు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని దేశాన్ని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

ఆదివారం ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన నాయకత్రయం పుస్తకాన్ని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకటి రెండు సంఘటనల దృష్ట్యా కొందరు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. సాహిత్యకారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

దేశంలో అత్యవసర పరిస్థితి విధించి లక్షల మందిని జైళ్లకు పంపించినప్పుడు, ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసినప్పుడు వీరంతా ఏమయ్యారని నిలదీశారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఖండించాల్సిందే అన్నారు. ఈ అపశ్రుతులను ప్రభుత్వానికి అంటగట్టాలనుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు.

Generalising 'stray incidents of violence' will damage country's image: Venkaiah Naidu

దేశంలో ఇతర మతాలు, సిద్ధాంతాలను గౌరవించే పరిస్థితి ఎప్పుడూ ఉందన్నారు. ఇప్పుడు కొందరికి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే సహనం లేకుండా పోతోందని ఎద్దేవా చేశారు.

కాగా, కొన్ని ఘటనలను చూపిస్తూ సాహిత్యకారులు తమ అవార్డులు వెనక్కి ఇస్తోన్న విషయం తెలిసిందే. దీనిప పలువురు సాహిత్యకారులను నిలదీస్తున్నారు. 2007లో తస్లిమా నస్రీన్ పైన దాడి జరిగిందని, అలాగే ఆ తర్వాత 2010లో, ఆ తర్వాత పలు సంఘటనలు జరిగాయని, అప్పుడు వీరేం చేశారని నిలదీస్తున్నారు. ఇప్పుడే అవార్డులు ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశ్యం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కెసిఆర్‌కు వెంకయ్య ప్రశంస

కేంద్ర ప్రభుత్వం ఒకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇస్తోందని, అందరికీ ఇండ్ల పథకంలో కేంద్రం ఒక్క బెడ్‌రూంతో ఇల్లు నిర్మిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించడం అభినందనీయమని వెంకయ్య ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం బాగుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హృదయ్‌ని వెంకయ్య ఆదివారం వరంగల్ నగరంలో ప్రారంభించారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హృదయ్ పథకం పైలాన్ పనులకు అయన భూమి పూజ చేశారు.

అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో వెంకయ్య మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక మూడు ప్రాజెక్ట్‌లు హృదయ్, స్మార్టసిటీ, అమృత్ పథకాలను దక్కించుకున్న ఏకైక నగరం వరంగల్ అని చెప్పారు.

చారిత్రక నగరంపై తనకు అమితమైన ప్రేమ ఉందన్నారు. అందుకే హృదయ్ పథకం ప్రారంభానికి వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకున్నామన్నారు. మూడు కేంద్ర పథకాలను దక్కించుకున్న వరంగల్ నగరం అభివృద్ధిలో దేశానికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వాలతో ప్రజలు భాగస్వామ్యమయితేనే ప్రగతికి బాటలు పడుతాయన్నారు. పార్టీలు వేరైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

వారసత్వ సంపదను పరిరక్షించేందుకే కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకాన్ని రూపొందించిందని, పట్టణాల్లో మెరుగైన పౌరసేవలు అందించేందుకు, చారిత్రక నగరాలకు ప్రపంచ పర్యాటకులను వచ్చేలా అభివృద్ధి చేయడమే హృదయ్ లక్ష్యమన్నారు.

హృదయ్ పథకంలో చారిత్రక వరంగల్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు.

నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్మార్ట్‌సిటీల ఎంపిక పారదర్శకంగా చేశామని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ బ్లూబర్గ్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని స్మార్ట్‌సిటీ చాలెంజ్ పోటీ నిర్వహిస్తున్నామని, వచ్చే నెలలో స్మార్ట్‌సిటీపై వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తానన్నారు.

English summary
Generalising 'stray incidents of violence' will damage country's image: Venkaiah Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X