Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (jeevan reddy) ఇవాళ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు తాను పెట్టుకున్న ముహుర్తాన్ని వెల్లడించారు. అలాగే భవిష్యత్తు రాజకీయంపైనా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడినట్లయింది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి తాను ఈ నెల 25న రాజీనామా చేయబోతున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆయన కాంగ్రెస్ లో కొనసాగలేనంటూ వెల్లడించారు. గత 20 నెలలుగా మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాబట్టి అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగలేనని జీవన్ రెడ్డి కార్యకర్తలకు తేల్చిచెప్పేశారు. అలాగే భవిష్యత్ రాజకీయంపైనా క్లారిటీ ఇచ్చారు.

రాజీనామా తర్వాత జగిత్యాలలో స్థానిక నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతానని జీవన్ రెడ్డి తెలిపారు. ఇందులో అందరి సలహాలు, సూచనలతో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. అలాగే తన రాజకీయ ప్రస్ధానంలో మీ తోతడు, మార్గదర్శనం కావాలంటూ కార్యకర్తల్ని జీవన్ రెడ్డి కోరారు. మరోవైపు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పకముందే ఆయన్ను తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బీజేపీ నేతలతో ఆయన చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.
-
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా.. ఆప్ ఆరోపణల వెనుక భారీ కుట్ర? -
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??












Click it and Unblock the Notifications