Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2029ఎన్నికల బరిలో కవిత.. పార్టీ పేరుపై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులు వస్తాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కెసిఆర్ కుమార్తె కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. సామాజిక తెలంగాణను లక్ష్యంగా చేసుకొని 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించడం కవిత రాజకీయ పార్టీ పెట్టబోతోంది అన్న ఊహాగానాలకు బలం చేకూర్చింది.

కవిత పార్టీ పేరుపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా జరిగిన ఆస్క్ కవిత సెషన్లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. 2029 ఎన్నికలలో పోటీ చేస్తామని తేల్చి చెప్పిన ఆమె, పార్టీ పేరును ప్రజలు సూచించిన దానినే పెడతామని స్పష్టం చేశారు.

Kavitha to contest in the 2029 elections makes crucial remarks on the party name

Take a Poll

రాజకీయాల్లో మా తొలి ప్రాధాన్యం అదే
మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి జాగృతి కృషి చేస్తుందని, వారికి నచ్చిన రంగాలలో రాణించేలా ప్రోత్సహించడం అవసరమని కవిత పేర్కొన్నారు.
తమ ప్రథమ ప్రాధాన్యం యువతకు ఉద్యోగాల కల్పన అంటూ కవిత తేల్చి చెప్పారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రతలలో యువతకు దేనికి ప్రాధాన్యం ఇస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కవిత ఈ విషయం చెప్పారు.

రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసిన కవిత
తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన విమర్శలు గుప్పించిన కవిత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరం కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల పైన స్పందించిన ఆమె, ఇది అత్యంత బాధాకరమన్నారు

ఈ సమస్యల కోసం పోరాటం చేస్తాం
ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ డ్రామాను ఖండించిన కవిత త్వరలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తానని ప్రకటించారు. సింగరేణి సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్న ఆమె, హెచ్ఎంఎస్ తో కలిసి ప్రభుత్వ విధానాలపై ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వెస్ట్ సిటీ అభివృద్ధి పైన చూపిన శ్రద్ధ ఈస్ట్ సిటీ పైన లేదని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఇష్టమైన హీరో ఆయనే
ఇక వ్యక్తిగత అభిరుచుల పైన కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స్పందించిన కవిత తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని స్పష్టం చేశారు నటుడు రామ్ చరణ్ కూడా చాలా వినయంగా ఉండే మంచి డాన్సర్ అని చెబుతూనే ఏదేమైనా చిరంజీవి తర్వాతే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు చిన్నతనంలో ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన క్షణాలని కవిత స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+