కేసీఆర్ మరో యాగం.. ఎందుకు.. ఎప్పుడు..
జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో చండీ యాగం చేయాలా లేక హోమం చేయాలా అన్న దానిలో క్లారిటీ లేదు.
ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కన్నెపల్లిలో యాగం చేయడానికి స్థలాన్ని పరిశీలించారు పండితులు. ఇక మేడిగడ్డ లో హోమం చేయడానికి స్థల పరిశీలన చేశారు సీఎంవో అధికారులు. ఇక ఈ నేపథ్యంలో యాగం చేస్తున్నారా హోమం చేస్తున్నారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డలో హోమం
ఎందుకంటే.. కాళేశ్వరం సమీపంలో 21న సీఎం చండీయాగం చేస్తారని పండితులు భావిస్తుండగా, మేడిగడ్డ వద్ద హోమం చేసి బ్యారేజీ గేట్లను పైకెత్తి బ్యారేజీని ప్రారంభిస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు సీఎంవో భద్రతా కార్యదర్శి రాజశేఖర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ మురళీధర్‌రావుతోపాటు ఇతరఅధికారులు గురువారం మేడిగడ్డ వద్ద స్థలపరిశీలన చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ముఖ్య అతిథులకు ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని దానిపై పరిశీలన జరిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు ముందుగా ముఖ్యమంత్రి మేడిగడ్డ కు చేరుకుంటారు కాబట్టి మేడిగడ్డ లోనే హోమం జరిపిస్తారని అధికారులు, స్థానికులు అంచనా వేస్తున్నారు.

కన్నెపల్లిలో యాగ స్థలాన్ని పరిశీలించిన సీఎం పీఎస్ , పురోహితులు
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం శివారులోని కన్నెపల్లి వద్ద 21న ముఖ్యమంత్రి నిర్వహించే యాగ స్థలాన్ని శుక్రవారం సీఎం పీఎస్ పరమేశ్వర్‌రెడ్డి, సీఎం పురోహితులు గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్ శర్మ పరిశీలించారు. యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్‌తో చర్చించారు. ఇక దీంతో రెండు చోట్ల యాగం జరగనుంది అన్న భావన కూడా వ్యక్తమవుతోంది.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద, గ్రావిటీ కెనాల్‌వద్ద, అప్రోచ్ కెనాల్ దగ్గర, వ్యూపాయింట్ వద్ద స్థలాలను పరిశీలించారు.

రెండు చోట్లా సీఎంవో అధికారుల పరిశీలన .. ఏర్పాట్లపై అధికారుల టెన్షన్
కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రారంభించడానికి ముందే సుమారు మూడు గంటలపాటు కేసీఆర్ యాగం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఉదయం మేడిగడ్డలో హోమం చేసి.. మధ్యాహ్నం కాళేశ్వరం వద్ద యాగం చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది . సీఎం షెడ్యూలు అధికారికంగా విడుదల కాకపోవడంతో ఏర్పాట్లు ఎక్కడ చేయాలో తెలియక అధికారులు టెన్షన్ పడుతున్నారు పడుతున్నారు. మొత్తం మీద ఏ కార్యక్రమం చేసిన సీఎం కేసీఆర్ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలోనే అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కెసిఆర్ నిర్వహించే యాగాల విషయంలో క్లారిటీ లేక కాస్త టెన్షన్ పడుతున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications