బొగ్గుగని బ్లాస్టింగ్ లో కళ్ళు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8 వ బొగ్గు గనిలో గురువారం బొగ్గు తవ్వకాలలో భాగంగా బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కోల్ కట్టింగ్ కార్మికులు బొగ్గు తొలచటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో జరిగిన దుర్ఘటనలో గాయాలపాలైన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిలో ఇద్దరు కార్మికులు కంటిచూపును కోల్పోయారు.
గని లోని మూడవ సీమ్ 21 వ లెవెల్లో మొదట పెట్టిన పేలుడు పదార్థం ఒక చోట పేలకుండా ఉండిపోయింది . ఆ తర్వాత రెండో దఫా పేలుడు పదార్థాన్ని పెట్టడానికి డ్రిల్ చేస్తున్న క్రమంలో డ్రిల్లింగ్ మెషిన్ బలంగా మొదట పెట్టిన, పేలని పేలుడు పదార్ధానికి తలిగింది. దీంతో భారీ పేలుడు సంభవించి కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాల పాలైన వ్యక్తి భూపాలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే భూపాలపల్లి సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆసుపత్రి సిబ్బందిని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారిని కలిసి పరామర్శించిన కవిత వారి కుటుంబాలకు అండగా తెలంగాణా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో రామకృష్ణ, రాజశేఖర్ లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు కవితకు వివరించారు. ముగ్గురు కార్మికులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందించి, కంటిచూపు వచ్చేలా చేయాలని ఎమ్మెల్సీ కవిత వైద్యులను కోరారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications