వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఆన్‌లైన్‌లో.. ఫిర్యాదులు: అంతర్జాలంలో ప్రజావాణి

|
Google Oneindia TeluguNews

వరంగల్ : ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు తీసుకొని జిల్లా పాలనాధికారి, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సామాన్యులకు సాంత్వన కలిగే చర్యలు చేపట్టింది.

రాతపూర్వకంగా ఇస్తున్న ఫిర్యాదులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి 'ప్రజావాణి- పర్యవేక్షణ వ్యవస్థ'ను అంతర్జాలంలోcpgrams.ts.nic.in పేరుతో వైబ్‌సైట్‌ను రూపొందించింది. ఫిర్యాదుల స్వీకరణతోపాటు పరిష్కారం కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు.. ఫిర్యాదు పురోగతిని సామాన్యుడు తెలుసుకునేలా అంతర్జాలంలో రూపకల్పన చేసింది.

 Public voice in internet: Complaints will be taken on online

దీంతో ఫిర్యాదు చేశాక తన వినతి ఏ దశలో ఉందో సామాన్యుడు ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం కలగనుంది. ఈ వెబ్‌సైట్‌లో వివిధ శాఖల వివరాలతో పాటు అధికారుల పేర్లు, హోదా కూడా నమోదు చేశారు. దీంతో ఫిర్యాదుల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవలసిందే. దరఖాస్తుల స్వీకరణ.. పరిష్కారం, తిరస్కరిస్తే వాటి కారణాలను స్పష్టంగా పొందుపరచాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అంతర్జాలంలో ప్రజావాణి పురోగతిని పరిశీలించే అవకాశం ఉండడంతో మండల, డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తే తక్షణమే తెలియనుంది.

ఫిర్యాదు ఎలా చేయాలంటే: ఫిర్యాదుదారుని పూర్తి వివరాలు, ఫిర్యాదు పత్రం అప్‌లోడ్‌ చేయాలి. దీంతో ఫిర్యాదు నమోదు అయినట్లు రసీదు, పాస్‌వర్డు వస్తుంది. ఈ పాస్‌వర్డుతో ఫిర్యాదు స్థితి.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరిష్కారం వివరాలు కూడా పొందుపరుస్తారు.

ఇందులో అధికారులకు ప్రత్యేకంగా లాగిన్‌, పాస్‌వర్డు ఉంటుంది. ఫిర్యాదులు, విచారణలో ఉన్నవి, విచారణ ముగిసినవి, చర్యలు తీసుకున్నవి, నివేదిక ఇచ్చినవి, తిరస్కరించన వాటి వివరాలు బాధ్యులు నిక్షిప్తం చేస్తే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధానంతో సామాన్యులు జిల్లా కేంద్రానికి రాకుండానే ఉన్న చోటు నుంచే ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

సులువుగా ఫిర్యాదు చేసుకునేందుకే..

ఈ వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ రూపొందించింది. ఎప్పటికప్పుడు అర్జిదారు తన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, పరిష్కారమయిందా.. లేకుంటే కారణాలేమిటో తెలుసుకోవచ్చు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇది ఉపయోగపడుతుంది.

English summary
Complaints from publice will be taken on online n Mahabooba Bad distrit of telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X