హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..!
ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదు, రైతుల కోసమని సిద్దిపేట రైతు ఉత్సవాల్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు (harish rao)ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)కౌంటర్ ఇచ్చారు. తాను వివక్ష చూపనని, తనది వివక్ష చూపే తత్వం కాదని తేల్చేశారు. తాము పేదల కోసం పని చేస్తాం తప్ప, రాజకీయ నాయకుల కోసం కాదన్నారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చిద్దాం రండి అంటూ సవాల్ విసిరారు. పదేళ్లు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, ఇప్పుడు పదేళ్లు ప్రజలు మమల్ని ఆశీర్వదిస్తారన్నారు. 2029 లో మళ్లీ అధికారం మాదే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత మా మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి శాసన ఎమ్మెల్యేలుగా ఉంటున్నారని,ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మార్పు చేసి చూడండి, మంచి జరుగుతుందో లేదో చూడాలన్నారు. మీరు అడ్డుకుంటే ఏదీ ఆగదంటూ బీఆర్ఎస్ నేతలపై వ్యాఖ్యలు చేశారు. మళ్లీ 2029 లో వస్తాం, సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తామన్నారు. సిద్దిపేటను 119 నియోకవర్గాలతో సమానంగా చూస్తామని, ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం లేదన్నారు.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానన్నారు. అందుకే రైతుల సంక్షేమం విషయంలో ఎక్కడా లోటు రాకుండా రైతుల కళ్లలో ఆనందం చూడాలని రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు.45 రోజుల్లో మూడు విడతలుగా 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రతీ నెల రూ.2533కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ ప్రభుత్వం 28 నెలల్లో ప్రతీ నెల రూ.5500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నామన్నారు.
రైతు సంక్షేమం కోసం రెండేళ్లలో లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశామని రేవంత్ తెలిపారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని, వ్యవసాయంలో మార్పు రావాలని, రైతులు పంట మార్పిడి విధానం అనుసరించాలని కోరారు. గతంలో ప్రాంతాల వారీగా వివిధ రకాల పంటలు పండించేవారని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎక్కువగా కనిపించేవని, వరి ఒక్కటే కాదు, అన్ని రకాల పంటల సాగు వైపు రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. ఈసారి 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని,కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనడం లేదని తెలిపారు. అందుకే పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరిందని, పది లక్షల ఎకరాలు సాగుచేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఆయిల్ పామ్ కర్మాగారం నిర్మించాలని మంత్రి తుమ్మలను కోరారు. వ్యవసాయంలో 12,728 గ్రామ పంచాయితీలకు అంకాపూర్ స్ఫూర్తి కావాలని, ప్రతీ గ్రామాన్ని అంకాపూర్ లా తీర్చి దిద్ది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో పంటలను ఎగుమతులు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణలో పండే ప్రతీ పంటను లాభసాటిగా మార్చడమే బంగారు తెలంగాణ అన్నారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
అదిరిపోయే శుభవార్త.. త్వరలో తెలంగాణాలో ఐదు కొత్త ప్రతిష్టాత్మక పథకాలు -
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
బాసర ఆలయానికి మహర్దశ: రేపే..: తిరుమల మోడల్ -
BRS వ్యూహాత్మక విజయం: కాంగ్రెస్ బహిష్కరణతో గులాబీ జెండా రెపరెపలు -
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా.. ఆప్ ఆరోపణల వెనుక భారీ కుట్ర? -
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..













Click it and Unblock the Notifications