గుట్టలపై కలెక్టర్ అమ్రపాలి ట్రెక్కింగ్(వీడియో)

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: అందరు కలెక్టర్ల కంటే కాస్తా భిన్నంగా వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విధుల్లో ఎంతో బాధ్యతగా ఉంటూ, విద్యార్థులు, యువతకు పలు అంశాల్లో మార్గనిర్దేశనం చేస్తున్నారు. అంతేగాక, ఆమెకు ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టం.

 అమ్రపాలి టెక్కింగ్..

అమ్రపాలి టెక్కింగ్..

ఈ నేపథ్యంలోనే వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రెక్కింగ్‌ నిర్వహించగా.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి పాల్గొన్నారు.

 ట్రెక్కింగ్‌కు అనువైన ప్రాంతం..

ట్రెక్కింగ్‌కు అనువైన ప్రాంతం..

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో ఇష్టమని తెలిపారు. ట్రెక్కింగ్‌కు ఈ ప్రాంతం అనువైందని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మంది సందర్శకులు వచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

 అందరి సహకారంతో..

అందరి సహకారంతో..

జిల్లా కేంద్రానికి కేవలం 20కి.మీల దూరంలోని ఈ ప్రాంతాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని అమ్రపాలి చెప్పారు. కాగా, ఈ ట్రెక్కింగ్‌లో నిట్‌ కాకతీయ వర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గతంలోనూ టెక్కింగ్..

కాగా, గతంలో కూడా జిల్లాలోని పలు గుట్టల(కొండల)పై కలెక్టర్ అమ్రపాలి ట్రెక్కింగ్ నిర్వహించారు. పెద్ద గుట్టలను తాడు సహాయంతో ఎక్కి సంచలనం సృష్టించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Warangal Collector Amrapali Treks to Visit Dharma Sagar Project in Warangal district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి