Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్త చేసిన పాడుపని.. ఇజ్జత్ తీసిన భార్యామణి: వీడియో వైరల్!!

వరంగల్: భర్త చేసిన పాడు పనికి భార్యామణి ఇజ్జత్ తీసిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వివాహేతర సంబంధం భార్య భర్త పై, భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువతిపై దాడి చేయడానికి కారణంగా మారింది.

వరంగల్ మున్సిపల్ ఉద్యోగుల వివాహేతర సంబంధం..

అసలు విషయానికి వస్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిభ అనే ఉద్యోగిని రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక అదే కార్పొరేషన్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జీవన్ కుమార్, సదరు ఉద్యోగినితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.

నాలుగేళ్ల క్రితం వరంగల్ కు చెందిన యువతిని వివాహం చేసుకున్న జీవన్ కుమార్, గత కొంత కాలంగా భార్యను వేధిస్తున్నారు. భార్య చందన వద్ద జీవన్ కుమార్ ప్రవర్తన సరిగా లేకపోవడం, నిత్యం భార్యను వేధించడం, ఇంటికి సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టడంతో అనుమానం వచ్చిన భార్య, భర్త అసలు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు అన్నది ఆరా తీసింది.

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసిన భార్య, ఆమె బంధువులు

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసిన భార్య, ఆమె బంధువులు

దీంతో భర్త అక్రమ సంబంధం వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పైడిపల్లి లోని ప్రతిభ ఇంటికి జీవన్ కుమార్ వెళ్లిన సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇంటికి తాళం వేసి, ఆ పై పోలీసులకు ఫిర్యాదు చేసి జీవన్ కుమార్ తో పాటుగా సదరు మహిళకు దేహశుద్ధి చేశారు భార్య చందన, ఆమె తరపు బంధువులు.

వివాహం కాకముందు నుండే జీవన్ కుమార్ కు, ప్రతిభ కు మధ్య అక్రమ సంబంధం ఉందని చందన బంధువులు ఆరోపిస్తున్నారు. నిత్యం తనకు విడాకులు ఇస్తానని టార్చర్ చేస్తున్నాడని భార్య చందన ఆరోపిస్తోంది.

భర్తను, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

భర్తను, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

దీంతో సహనం నశించిన భార్య చందన ప్రతిభ ఇంట్లోకి చొరబడి భర్త జీవన్ కుమార్ పై దాడికి దిగింది. తనకు అన్యాయం చేస్తున్నాడని రెచ్చిపోయిన చందన, ఆమె బంధువులు చెప్పు తీసుకుని జీవన్ కుమార్ ను చితకబాదారు. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసి దేహశుద్ధి చేసిన జీవన్ కుమార్ ను, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సదరు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రతిభను అరెస్టు చేశారు.

ఇక ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక భార్య భర్తను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుంది. .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+