Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nari Nari Naduma Murari Movie Review: నారి నారి నడుమ మురారీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, శ్రీ విష్ణు, కమెడియన్ సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
కథ, డైలాగ్స్: భాను భోగవరపు, నందూ
సినిమాటోగ్రఫి: జీ శేఖర, యువరాజ్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: నక్కా వెంకటస్వామి
రిలీజ్ డేట్: 2026-01-14

ఆర్కిటెక్ట్ ఉద్యోగాలు చేసే గౌతమ్ (శర్వానంద్), నిత్య (సాక్షి వైద్య) ప్రేమించుకొంటారు. అయితే శర్వానంద్‌ ప్రవర్తన, ఆయన తల్లిదండ్రుల (వీకే నరేష్, సిరి హన్మంతు) బ్యాక్‌గ్రౌండ్ చూసిన తర్వాత నిత్య తండ్రి రామలింగయ్య (సంపత్ రాజ్) వారి ప్రేమకు, పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాడు. అయితే ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకమైన రామలింగయ్య చివరకు నిత్య పెళ్లిని రిజిస్టర్ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకొంటాడు. కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి గౌతమ్ అభ్యంతరం వ్యక్తం చేసి చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ గౌతమ్ పెళ్లికి రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీసర్ అడ్డంకిగా మారుతాడు.


Nari Nari Naduma Murari Movie Review

లవ్ మ్యారేజ్‌ అంటే నిత్యా తండ్రికి ఎందుకు ఇష్టం ఉండదు? రిజిస్టర్ మ్యారేజ్ చేయడానికే రామలింగయ్య ఎందుకు ఒప్పుకొంటాడు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి గౌతమ్ ఎందుకు భయపడుతాడు? రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌లో అధికారి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాడు? గౌతమ్ జీవితంలోకి వచ్చిన దియా (సంయుక్త మీనన్) ఎవరు? నిత్యతో పెళ్లి జరగడానికి దియా సపోర్ట్ గౌతమ్‌కు ఎందుకు కావాల్సి వచ్చింది? దియా, గౌతమ్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? చివరకు ఎలాంటి సమస్య నిత్యా, గౌతమ్ పెళ్లికి అడ్డంకిగా నిలిచాయి? చివరకు నిత్యను గౌతమ్ పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నారి నారి నడుమ మురారి సినిమా కథ.

పెళ్లి రెండు సంతకాలు కాదు.. రెండు జీవితాలు కలిసి ఉండటం.. కలహాలు, కలతలు లేని జీవితంలో ప్రేమ ఉండదు. ప్రేమికుల మధ్య గొడవలు లేని ప్రయాణం.. పెళ్లి తర్వాత ఒక్క గొడవతో విడాకులు దారి తీస్తుంటాయి అనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ అల్లుకొన్న నాన్ స్టాప్ కామెడీ చిత్రంగా నారి నారి నడుమ మురారీ సినిమా రూపొందింది. అయితే సినిమా ఆరంభంలోనే హిలేరియస్ కామెడీ ఎపిసోడ్‌తో కథలోకి ప్రేక్షకుడిని లాక్కెళ్లిన విధానం బాగుంది. ఆ తర్వాత ప్రతీ సీన్‌లో ఫన్, హ్యుమర్ దట్టించిన విధానం దర్శక, రచయితల ప్రతిభకు అద్దం పట్టింది.

సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు డిజైన్ చేసుకొన్న పాత్రలు, సన్నివేశాలు బలంగా ఉన్నాయి. గురితప్పని గన్ షాట్స్‌లా డైలాగ్స్ సినిమా మొత్తం పేలుతూనే ఉండటంతో ఈ సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేసే ఛాన్స్ దక్కింది. ఫస్టాఫ్‌లోను, సెకండాఫ్‌లోను రెండు ప్రేమ కథలు, ఎమోషనల్ కంటెంట్‌ను చక్కగా రాసుకొన్నారు. వీకే నరేష్ నటించిన కార్తీక్‌ పాత్రను కేంద్ర బిందువుగా చేసుకొని దాని చుట్టూ నడిపించిన డ్రామా హిలేరియస్‌గా ఉంది. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, నెల్లూరు సుదర్శన్ ఎవరికీ వారు తమ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌తో కామెడీని అద్బుతంగా పండించారు. ఈ సినిమా పూర్తిగా ఓ లాఫింగ్ రైడ్‌గా మార్చడంలో చిత్ర యూనిట్ ఈ సినిమా శ్రద్దాసక్తులు తెరపైన కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌కు ముందు కొంత స్లో అయినప్పటికీ.. శ్రీ విష్ణు ఎంట్రీ తర్వాత మళ్లీ ఊపందుకొన్నది. ఈ సినిమా స్క్రిప్టు, స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి కంప్లైట్స్ లేకపోవడంతో పూర్తిగా ఫీల్‌గుడ్‌గా చిత్రంగా మారిందనిపిస్తుంది.

ఈ సినిమా నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పూర్తిగా వీకే నరేష్ ఈ సినిమాకు హీరోగా కనిపిస్తారు. తన భుజాలపై సినిమా భారాన్ని మోసి ఆద్యంతం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని, అనుభూతిని అందించడంలో తన వంతుగా మేజర్ రోల్ పోషించారు. ఆ తర్వాత సత్య, వెన్నెల కిషోర్, సునీల్ ప్రతీ సన్నివేశంలో తమకు అవకాశం దొరికిన ప్రతీసారి సిక్సర్ కొట్టి బంతిని స్టేడియం బయటకు తరలించినంత పనిచేశారు. ఇక ఈ కామెడీ టీమ్‌కు హీరో శర్వానంద్, సాక్షి, సంయుక్త లవ్ ట్రాక్‌లు, వారి కాన్‌ఫ్లిక్టులు సపోర్టింగ్‌గా నిలిచాయి. ఓవరాల్‌గా ఈ సినిమా విజయంలో యాక్టర్లు టీమ్ ఎఫర్ట్‌ను ప్రదర్శించారని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సక్సెస్ బాట పట్టించడంలో రైటింగ్ టీమ్ భాను, నందూ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. ప్రతీ సీన్‌ను మనసుపెట్టి హ్యుమర్‌ను, ఫన్‌ను దట్టించారు. బలమైన కథ, సంభాషణలను దర్శకుడు రామ్ అబ్బరాజ్ విజన్‌కు తగినట్టుగా సినిమాటోగ్రాఫర్ యువరాజ్ సన్నివేశాలుగా పేర్చిన విధానం బాగుంది. కేరళ ఎపిసోడ్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమాలో రిచ్ విజువల్స్ సన్నివేశాల్లో లీనమయ్యేలా చేశాయి. ఇక పాటలు చాలా పరిమితంగా ప్లేస్ చేసి డైలాగ్ పార్ట్‌కు ప్రధాన్యం ఇవ్వడమే ఈ సినిమాను భారీ విజయాన్ని దక్కేలా చేశాయి. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. అనిల్ సుంకర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫ్యామిలీ వాల్యూస్, ఈ తరం జనరేషన్‌కు ప్రేమ, పెళ్లి విషయంలో చక్కటి సందేశంతోపాటు 100 శాతం వినోదం, కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఫస్టాఫ్ హై ఎనర్జీతో సాగడం వల్ల సెకండాఫ్‌లో కొంత పార్ట్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సంక్రాంతి పండుగ ప్రేక్షకులకు క్లీన్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలతో వెళ్లినా చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి.. రెండున్నర గంటలపాటు లాఫింగ్ ట్రీట్‌మెంట్‌లా, రామ్ అబ్బరాజు కామెడీతో సర్జికల్ స్ట్రైక్‌లా ఉంటుంది.

Credit: Filmibeat

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+