• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ఏ పీ జితేంద‌ర్ రెడ్డి

ఏ పీ జితేంద‌ర్ రెడ్డి

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఏ.పీ. జితేంద‌ర్ రెడ్డి హైద‌రాబాద్ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని మ‌నోపాడు మండ‌లం, పెద్ద ఆముద్యాల‌పాడు గ్రామంలో శ్రీ ఎ.పీ. రామ‌చంద్రా రెడ్డి మ‌రియు శ్రీమ‌తి ఈశ్వ‌ర‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు.

జితేంద‌ర్ రెడ్డి ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి బీ.కాం డిగ్రీని పూర్తి చేశారు. శ్రీమ‌తి ఏ.పీ. రాజేశ్వ‌రీ రెడ్డిని ఆయ‌న పెళ్లాడారు. ఈ దంప‌తులకు ముగ్గురు కుమారులు.

వ్యాపార‌వేత్త నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగిన ఆయన తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంటు స్థానానికి ప్రాతినిథ్యం వ‌హించారు. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ త‌ర‌పున గెలుపొందారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఏ పీ జితేంద‌ర్ రెడ్డి
పుట్టిన తేదీ 26 Jun 1954 (వ‌య‌స్సు  67)
పుట్టిన ప్రాంతం క‌ర్నూలు, ఆంధ్ర ప్ర‌దేశ్
పార్టీ పేరు Telangana Rashtra Samithi
విద్య Graduate
వృత్తి వ్యాపార‌వేత్త
తండ్రి పేరు ఏ.పీ. రామ‌చంద్ర రెడ్డి
తల్లి పేరు ఈశ్వ‌రమ్మ
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి ఏ.పీ. రాజేశ్వ‌రీ రెడ్డి
సంతానం 3 కుమారులు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా జేఆర్ ట‌వ‌ర్స్‌, ప్లాట్ నెం.7 & 8, రోడ్ నెం. 2, బంజారాహిల్స్‌, హైద‌రాబాద్, తెలంగాణ - 500034
ప్రస్తుత చిరునామా 1, బ‌ల్వంత్ రాయ్ మెహ‌తా లేన్‌, క‌స్తూర్బా గాంధీ మార్గ్, న్యూ ఢిల్లీ - 110001
కాంటాక్ట్ నెంబర్ 09848030036,
ఈ-మెయిల్ jreddy@sansad.nic.in

ఆసక్తికర అంశాలు

ఆయ‌న తెలంగాణ ఒలింపిక్ అసోసియేష‌న్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఒలింపిక్ సంఘం, క్రికెట్ మ‌రియు స్నూక‌ర్ సంఘాల అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు.

1998 నుంచి 2014 వ‌ర‌కు ఆయ‌న ఆంధ్ర ప్ర‌దేశ్ ఒలింపిక్ సంఘం మ‌రియు ఆల్ ఇండియా సాఫ్ట్‌బాల్ ఫెడ‌రేష‌న్ ఉపాధ్య‌క్షుడిగా సేవ‌లందించారు.

అంతేగాక ఆయ‌న సికింద్రాబాద్ క్ల‌బ్‌, నిజాం క్ల‌బ్, జూబ్లీ హిల్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్ల‌బ్, ఫిల్మ్‌న‌గ‌ర్ క్ల‌బ్ మ‌రియు జింఖానా క్ల‌బ్, హైద‌రాబాద్ గోల్ఫ్ క్ల‌బ్ మ‌రియు ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌ల‌లో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.

షాపూర్జీ ప‌ల్లోంజీ నిర్మాణ సంస్థ త‌ర‌పున మ‌స్క‌ట్(ఒమ‌న్‌)లో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్‌గానూ మ‌రియు 1976 నుంచి 1995 వ‌ర‌కు నేష‌న‌ల్ ట్రేడింగ్ కంపెనీ త‌ర‌పున మ‌స్క‌ట్‌లో నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించారు.

1999 వ‌ర‌కు ఆయ‌న ప్ర‌వాస భార‌తీయుడిగా ఉన్నారు.

1999 లో ఆయ‌న ప్ర‌వాస భార‌తీయ ఎంపీగానే గెలిచారు. గ‌త 22 ఏళ్లుగా ఆయ‌న ప్ర‌వాస భార‌తీయుడుగానే ఉన్నారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014
    16 వ లోక్‌స‌భ‌కు ఆయ‌న తిరిగి ఎన్నిక‌య్యారు(మొత్తంగా రెండ‌వసారి). ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన జైపాల్ రెడ్డిపై 2,590 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జూన్ 13, 2014 లో ఆయ‌న బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు. సెప్టెంబ‌రు 14, 2014 నాడు ఆయ‌న పార్ల‌మెంటు హౌజ్ కాంప్లెక్స్‌లో ఆహార నిర్వ‌హాణ సంయుక్త క‌మిటీ చైర్‌ప‌ర్స్‌న్‌గా నియ‌మితుల‌య్యారు. మ‌రియు పార్ల‌మెంటు స‌భ్యుల స్థానిక ప్రాంతాభివృద్ధి ప‌థ‌కం(ఎంపీల్యాడ్స్‌) క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. సెప్టెంబ‌రు 19, 2014 నాడు ఆయ‌న ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు. దీంతోపాటు పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2010
    2010 లో ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి పొలిట్ బ్యూరోలో స‌భ్యుడిగా తీసుకోబ‌డ్డారు.
  • 1999
    ఆయ‌న 13 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 1999
    1999 నుంచి 2000 మ‌ధ్య‌కాలంలో ఆయ‌న ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
నికర ఆస్తులు13.94 CRORE
ఆస్తులు 14.08 CRORE
బాధ్యతలు13.87 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X