• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
అజ‌య్ మాకెన్

అజ‌య్ మాకెన్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

అజ‌య్ మాకెన్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న భార‌త జాతీయ కాంగ్రెస్‌లో స‌భ్యులు. అజ‌య్ మాకెన్ రెండు సార్లు పార్ల‌మెంట్ స‌భ్యులుగా మ‌రియు మూడు సార్లు ఢిల్లీ శాస‌న స‌భ‌లో స‌భ్యుడిగా సేవ‌లందించారు. ఆయ‌న మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర గృహ నిర్మాణం మ‌రియు ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న మంత్రిగానూ పని చేశారు.

అజ‌య్ మాకెన్ జ‌న‌వ‌రి 12, 1964 లో ఢిల్లీలో జ‌న్మించారు. ఢిల్లీలోని సెయింట్ జేవియ‌ర్ స్కూల్ లో విద్యాభ్యాసం చేశారు మ‌రియు ఢిల్లీ విశ్వ విద్యాల‌యం నుంచి బీఎస్సీ కెమిస్ట్రీలో గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేశారు. శ్రీమ‌తి రాధికా మాకెన్ ను ఆయ‌న వివాహమాడారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు అమ్మాయిలు మరియు ఒక అబ్బాయి.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు అజ‌య్ మాకెన్
పుట్టిన తేదీ 12 Jan 1964 (వ‌య‌స్సు  57)
పుట్టిన ప్రాంతం ఢిల్లీ
పార్టీ పేరు Indian National Congress
విద్య Post Graduate
వృత్తి వ్యాపార‌వేత్త మ‌రియు రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు శ్రీ సీ.పీ. మాకెన్
తల్లి పేరు శ్రీమ‌తి. సంతోష్ మాకెన్
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి. రాధికా మాకెన్
జీవిత భాగస్వామి వృత్తి Na
సంతానం 1 కుమారులు 2 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా రెసిడెంట్ ఆఫ్ జే-12/2, రాజౌరీ గార్డెన్‌, న్యూ ఢిల్లీ-110027
ప్రస్తుత చిరునామా 10, పండిట్ పంత్ మార్గ్, న్యూ ఢిల్లీ-110001
కాంటాక్ట్ నెంబర్ 09711000333
ఈ-మెయిల్ ajaymaken.newdelhi@gmail.com
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

39 ఏళ్ల వ‌య‌స్సులో దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్సు గ‌ల స్పీక‌ర్‌గా అజ‌య్ మాకెన్ గుర్తింపు పొందారు. ప‌ర్యావ‌ర‌ణం మ‌రియు జీవావ‌ర‌ణంల‌ను కాపాడ‌డం అంటే ఆయ‌నకు ఆస‌క్తి ఎక్కువ‌. పార్ల‌మెంట్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డంలో ఆయ‌న ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉంటారు. క్రికెట్ మ‌రియు గోల్ఫ్ ఆడ‌టాన్ని అజ‌య్ మాకెన్ ఎక్కువ‌గా ఇష్ట ప‌డుతుంటారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014
    2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో అజ‌య్ మాకెన్ బీజేపీ అభ్య‌ర్థి మీనాక్షీ లేఖీ చేతిలో ఓడిపోయారు. 2015 వ‌ర‌కు ఆయ‌న కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేశారు.
  • 2012-2013
    కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున కేంద్ర గృహ నిర్మాణం మ‌రియు ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న మంత్రిగా ప‌ని చేశారు.
  • 2011-2012
    కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు మ‌రియు క్రీడ‌లు(స్వ‌తంత్ర హోదా) మంత్రిగా ప‌ని చేశారు.
  • 2009 - 2011
    కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖా మంత్రిగా ప‌ని చేశారు.
  • 2007
    ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ లో శాశ్వ‌త ఆహ్వ‌నితుడిగా మ‌రియు స‌భ్యుడిగా ఎంపిక‌య్యారు. కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు మ‌రియు క్రీడ‌లు(స్వ‌తంత్ర హోదా) మంత్రిగా ప‌ని చేశారు.
  • 2006
    కేంద్ర ప‌ట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా నియ‌మితుల‌య్యారు.
  • 2004
    ఢిల్లీ శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్‌గా ఎన్నిక‌య్యారు.
  • 2004
    న్యూఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 14 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో అజ‌య్ మాకెన్‌ బీజేపీకి చెందిన జ‌గ్‌మోహ‌న్‌ను ఓడించారు.
  • 2004
    సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీ, రూల్స్ క‌మిటీ, స‌మాచార సాంకేతిక క‌మిటీ, హౌజ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా మ‌రియు లోక్‌స‌భ‌లో ప్యానెల్ ఛైర్మ‌న్‌గా వివిధ హోదాల‌లో ఆయ‌న తన సేవ‌లందించారు.
  • 2004
    ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ(ఏఐసీసీ) కార్య‌ద‌ర్శిగా నియ‌మింప‌బ‌డ్డారు.
  • 2001-2003
    ఢిల్లీ ప్ర‌భుత్వంలో ర‌వాణా మ‌రియు విద్యుత్తు మంత్రిగా ఉన్నారు.
  • 1999-2001
    ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన షీలా దీక్షిత్ ప్ర‌భుత్వంలో పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.
  • 1993
    1993 లో రాజౌరీ గార్డెన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఢిల్లీ శాస‌న స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 1998 మ‌రియు 2003 లోనూ(మొత్తం మూడు సార్లు) గెలిచారు. 2001-2003 మ‌ధ్య దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్సు గ‌ల స్పీక‌ర్‌గా మ‌రియు 37 ఏళ్ల చిన్న వ‌య‌స్సులో 1998-2001 మ‌ధ్య విద్యుత్తు, ర‌వాణా మరియు ప‌ర్యాట‌క మంత్రిగానూ గుర్తింపు పొందారు.

గ‌త చ‌రిత్ర

  • 1985
    ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో విద్యార్థిగా ఉన్న‌ప్పుడే అజ‌య్ మాకెన్ త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించారు. 1985 లో ఆయ‌న ఢిల్లీ విశ్వ‌విద్యాల‌య విద్యార్థి సంఘం అధ్య‌క్షునిగా గెలిచారు. అజ‌య్ మాకెన్ వ్యాపార‌వేత్త కూడా.
నికర ఆస్తులు6.06 CRORE
ఆస్తులు 6.11 CRORE
బాధ్యతలు5 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X