• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
అనంత్ కుమార్

అనంత్ కుమార్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

అనంత్ కుమార్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు సామాజిక కార్య‌క‌ర్త‌, వ్యాపారి మ‌రియు విజ‌య‌వంత‌మైన పారిశ్రామిక‌వేత్త‌. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందినవారు మ‌రియు 14 వ లోక్‌స‌భ‌లో ఆయ‌న బెంగ‌ళూరు నుంచి ఎన్నిక‌య్యారు. క‌ర్ణాట‌క బీజేపీలో ఆయ‌న చాలా ప్ర‌ముఖ వ్య‌క్తి. 1996 నుంచి ఆయ‌న లోక్‌స‌భ‌లో ద‌క్షిణ బెంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో అనంత్‌కుమార్ రెండు కీల‌క మంత్రిత్వ శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. అందులోభాగంగా మే 2014 నుంచి కేంద్ర రసాయ‌నాలు మ‌రియు ఎరువుల శాఖ‌తో పాటు జూలై 2016 నుంచి పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హ‌రాల మంత్రిగా సేవ‌లందించారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు అనంత్ కుమార్
పుట్టిన తేదీ 22 Jul 1959
మరణం యొక్క తేదీ 12 Nov 2018 (వ‌య‌స్సు  59)
పుట్టిన ప్రాంతం బెంగ‌ళూరు(క‌ర్ణాట‌క‌)
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు శ్రీ హెచ్‌.ఎన్‌. నారాయ‌ణ శాస్త్రి
తల్లి పేరు శ్రీమతి. గిరిజా ఎన్‌. శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు శ్రీమతి. తేజ‌స్విని అనంత్ కుమార్
సంతానం 2 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఇంటి.నెం. 26, హెచ్‌,బీ. స‌మ‌జా రోడ్, బ‌స‌వ‌న‌గుడి, బెంగ‌ళూరు-560004, క‌ర్ణాట‌క టెలిఫోన్ : (080) 26568484, ఫ్యాక్స్‌ : (080) 26560286
ప్రస్తుత చిరునామా 26, తుగ్ల‌క్ క్రిసెంట్, న్యూ ఢిల్లీ-110011, టెలిఫోన్ : (011) 23794754, ఫ్యాక్స్ : (011) 23012791
కాంటాక్ట్ నెంబర్ 9899107084
ఈ-మెయిల్ akumar-alpha@sansad.nic.in
వెబ్‌సైట్ http://ananth.org/
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

వివిధ సామాజిక‌, సాంసృతిక కార్య‌క‌లాపాల‌తో పాటు అన్న‌పూర్ణ‌, ఆటాపాటా వంటి కార్య‌క్ర‌మాల‌లో ఆయ‌న పాల్గొన్నారు.
జాతీయ అంశాల‌పై ఆయ‌న రాసిన క‌థ‌నాలు ప్ర‌ముఖ వార్త‌ప‌త్రిక‌లు, పీరియాడిక‌ల్స్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.
రాజ‌కీయ మ‌రియు విద్యాప‌ర‌మైన అంశాల‌పై ఆయ‌న క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీషు మ‌రియు తెలుగులో ఆయ‌న ధారాళంగా మాట్లాడగ‌ల‌రు.
పుస్త‌క‌ప‌ఠ‌నం, ర‌చ‌న‌, క‌విత్వం మ‌రియు ప్ర‌యాణాలంటే ఆయ‌న‌కి ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి.
తీరిక‌వేళల్లో ఆయ‌న చిన్న‌పిల్ల‌ల‌తో ఆడ‌టం, ప్ర‌ముఖ‌ల‌ను క‌ల‌వ‌డం, కొత్త ప్రాంతాల‌ను చూడ‌టం ద్వారా సేద‌తీరుతుంటారు.
వీటితోపాటు క్రికెట్, బ్యాడ్మింట‌న్‌, టేబుల్ టెన్నిస్‌, చెస్ వంటి ఆట‌లంటే కూడా ఆయ‌న‌కి ఆస‌క్తి మెండు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 2018
  క్యాన్స‌ర్ వ్యాధి కార‌ణంగా న‌వంబ‌రు 12, 2018 న అనంత్ కుమార్ తుదిశ్వాస విడిచారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేట‌ర్ సాయంతో కొన్ని రోజులు ఆయ‌న చికిత్స పొందారు.
 • 2016
  పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.
 • 2014
  ద‌క్షిణ బెంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అనంత్ కుమార్ మ‌రోమారు ఎన్నిక‌య్యారు. ఈ ద‌ఫా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి నంద‌న్ నీలేక‌నీని ఓడించారు. అనంత‌రం ఆయ‌న న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో ర‌సాయ‌నాలు మ‌రియు ఎరువుల మంత్రిగా నియ‌మితుల‌య్యారు. దీంతోపాటు, బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ మ‌రియు పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌భ్యుడిగా ప‌ని చేశారు.
 • 2014
  జూన్ 2014 న బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ మ‌రియు పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌భ్యుడిగా ప‌ని చేశారు.
 • 2013
  ఆగ‌స్టు 16, 2013 నుంచి చ‌నిపోయే వ‌ర‌కు నిమ్‌హాన్స్ స‌భ్యుడిగా సేవ‌లందించారు.
 • 2012
  67 వ ఐక్య‌రాజ్య స‌మితి సాధార‌ణ అసెంబ్లీకి వెళ్లిన భార‌త పార్ల‌మెంట‌రీయ‌న్ ప్ర‌తినిధి బృందంలో స‌భ్యుడిగా ఉన్నారు.అక్టోబ‌రు 16, 2012 లో ఐక్య‌రాజ్య స‌మితి సాధార‌ణ అసెంబ్లీలో క‌న్న‌డ‌లో ప్ర‌సంగించిన తొలి వ్యక్తిగా ప్ర‌సిద్ధి పొందారు.
 • 2010
  మే 7, 2010 లో ప్ర‌పంచ వ్య‌వ‌హారాల కౌన్సిల్‌కు ఉపాధ్య‌క్షుడయ్యారు. అలాగే జూలై 29, 2010 లో ఇండియ‌న్‌-పోర్చుగ‌ల్ పార్ల‌మెంట‌రీ స్నేహాపూర్వ‌క బృందంలో స‌భ్యుడిగా ఉన్నారు.
 • 2008
  2008-10 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఏబీఐడీఈ(ఎజెండా ఫ‌ర్ బెంగ‌ళూరు ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్) వైస్ ఛైర్మ‌న్‌గా సేవ‌లందించారు.
 • 2004
  2004 లో బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్, బీహార్, ఛ‌త్తీస్‌ఘ‌డ్ మ‌రియు ఇత‌ర రాష్ట్రాలో పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. మే 26, 2014 నాడు శ్రీ న‌రేంద్ర మోదీ క్యాబినేట్‌లో ర‌సాయ‌నాలు మ‌రియు ఎరువుల మంత్రిగా కుమార్ నియ‌మితుల‌య్యారు.
 • 2004
  2004-09 మ‌ధ్య బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌లో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
 • 2003
  2003 లో బీజేపీ పార్టీ క‌ర్ణాట‌క రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆయ‌న‌ నియ‌మితుల‌య్యారు. 2004 లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఆయ‌న నేతృత్వంలో బీజేపీ క‌ర్ణాట‌క‌లో అత్య‌ధిక సంఖ్య‌లో లోక్‌స‌భ సీట్ల‌ను సాధించ‌డ‌మే గాక రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో అతిపెద్ద పార్టీగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.
 • 1999
  1999 ఎన్నిక‌ల‌లో ఆయ‌న మూడోసారి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు మ‌రియు జాతీయ ప్ర‌జాస్వామ్య కూట‌మి(ఎన్‌డీఏ) లో క్యాబినేట్ మంత్రి అయ్యారు. ఆ ప్ర‌భుత్వంలో ప‌ర్యాట‌కం, క్రీడ‌లు మ‌రియు యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, సాంసృతికం, ప‌ట్ట‌ణాభివృద్ధి మ‌రియు పేద‌రిక నిర్మూల‌న వంటి వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌ను ఆయ‌న చేప‌ట్టారు. ఏప్రిల్, 1999 లో బెంగ‌ళూరులో ఏరోస్పేస్ మ్యూజియం సొసైటీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. చైనాకు వెళ్లిన భార‌త పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధి బృందంలో స‌భ్యుడిగా ఉన్నారు.
 • 1998
  1998 ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన డీపీ శ‌ర్మ‌ను ఓడించ‌డం ద్వారా ఆయ‌న తిరిగి లోక్‌స‌భ‌కు ఎన్నికై అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ప్ర‌భుత్వంలో పౌర విమాన‌యాన మంత్రి అయ్యారు. అట‌ల్జీ క్యాబినేట్‌లో అత్యంత చిన్న వ‌య‌స్సు గ‌ల వ్య‌క్తి ఆయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. 1988 న‌వంబ‌రులో మౌలిక స‌దుపాయాల టాస్క్‌ఫోర్స్‌లో స‌భ్యుడ‌య్యారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎక్స్‌ఛేంజ్ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యంతోపాటు, 1998 ఆగ‌స్టులో 51 వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా వాషింగ్ట‌న్‌లో భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున మూడు రంగుల జెండాను ఎగుర‌వేశారు.
 • 1997
  1997 లో ఆయ‌న యువ‌జ‌న పార్ల‌మెంట‌రీయ‌న్ కాన్ఫ‌రెన్స్‌లో స‌భ్యుడిగా ఉన్నారు.
 • 1996
  బీజేపీలో చేరిన త‌ర్వాత భార‌తీయ జ‌న‌తా యువ మోర్చా రాష్ట్ర అధ్య‌క్షుడిగా నామినేట్ అయ్యారు. 1996 లో పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శిగా ఎదిగారు. అదే ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ద‌క్షిణ బెంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 11 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్‌కు చెందిన వ‌ర‌ల‌క్ష్మి గుండూరావును ఓడించారు. 1996-97 మ‌ధ్య జాతీయ ప‌ట్టు బోర్డు స‌భ్యుడిగా ఉన్నారు. యునెస్కోకు భార‌త పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధి బృంద స‌భ్యుడిగా ఉన్నారు. 1996-98 మ‌ధ్య ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ప‌ని చేశారు.
 • 1996
  1996 నుంచి 2016 వ‌ర‌కు రెండు ద‌శాబ్దాల‌పాటు మ‌ధ్య‌లో విరామం లేకుండా శ్రీ అనంత్ కుమార్ ద‌క్షిణ బెంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న‌ సేవ‌లందించారు. యాదృచ్ఛికంగా ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీకి 1991-2016 మ‌ధ్య 25 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న కేవ‌లం ఏడాదిపాటు మాత్ర‌మే కొన‌సాగారు.
 • 1993
  1993 లో శ్రీ న‌రేంద్ర‌మోదీతో క‌లిసి ప్ర‌తినిధి బృంద స‌భ్యుడిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించారు.
 • 1983-86
  1983 లో సేవ్ అస్సామ్ ఉద్య‌మానికి క‌ర్ణాట‌క కన్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. వీటితోపాటు 1985 లో అంత‌ర్జాతీయ యువ సంవ‌త్స‌రం మరియు 1986 లో క‌ర్ణాట‌క‌లో ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత క‌ర‌వు ఉప‌శ‌మ‌న కమిటీకి సైతం క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హరించారు. రాష్ట్ర మ‌రియు జాతీయ స్థాయుల‌లో వివిధ స‌ద‌స్సులు మ‌రియు విద్యా శిబిరాల నిర్వహకుడిగా ప‌నిచేశారు. ప‌లు విశ్వ‌విద్యాల‌యాలు మ‌రియు రాష్ట్రాలలో చోటు చేసుకున్న ఉద్య‌మాల‌కు క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.
 • 1982
  అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్, క‌ర్ణాట‌క రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా 1982-85 మ‌ధ్య ప‌నిచేశారు.

గ‌త చ‌రిత్ర

 • 1975-77
  1975-77 మ‌ధ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులకు వ్య‌తిరేకంగా జే.పీ చేప‌ట్టిన ఉద్య‌మంలో ఆయ‌న పాల్గొని 40 రోజులపాటు జైలు శిక్ష అనుభ‌వించారు.
నికర ఆస్తులు4.23 CRORE
ఆస్తులు 4.52 CRORE
బాధ్యతలు28.83 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X