Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు.
By Shalini | Saturday, August 24, 2019, 02:14:53 PM [IST]

అరుణ్ జైట్లీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గతేడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయించుకున్నారు.

న్యాయవాది నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన అరుణ్ జైట్టీ న‌రేంద్ర మోడీ తొలి ప్ర‌భుత్వంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల మంత్రిగా పనిచేశారు. జైట్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన‌వారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు జైట్లీ సుప్రీం కోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేశారు. ఢిల్లీ హైకోర్టు సైతం ఆయ‌న‌ను సీనియ‌ర్ న్యాయ‌వాదిగా గుర్తించింది. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో జైట్లీ చురుగ్గా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న యువ మోర్చా క‌న్వీన‌ర్‌గా ఉన్నారు. ఉద్య‌మంలో పాల్గొన్నందుకు గానూ ఆయ‌న అంబాలా, తీహార్ జైలులో శిక్ష అనుభవించారు.

అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వంలో ఆయ‌న మంత్రిగా ప‌ని చేశారు. మోదీ ప్ర‌భుత్వంలో ఆయ‌న ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. యూపీఏ హ‌యాంలో 2009 నుంచి 2014 మ‌ధ్య రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.

మరిన్ని చదవండి

అరుణ్ జైట్లీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు అరుణ్ జైట్లీ
పుట్టిన తేదీ 28 Dec 1952
మరణం యొక్క తేదీ 24 Aug 2019 (వ‌య‌స్సు  66)
పుట్టిన ప్రాంతం న్యూఢిల్లీ
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి సుప్రీం కోర్టులో సీనియ‌ర్ న్యాయ‌వాది
తండ్రి పేరు మ‌హ‌రాజ్ కిష‌న్ జైట్లీ
తల్లి పేరు ర‌త‌న్ ప్ర‌భ జైట్లీ
జీవిత భాగస్వామి పేరు సంగీత డోగ్రా
జీవిత భాగస్వామి వృత్తి N/A
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
వెబ్‌సైట్ https://www.arunjaitley.com/

అరుణ్ జైట్లీ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹104.82 CRORE
ఆస్తులు
₹113.02 CRORE
బాధ్యతలు
₹8.2 CRORE

అరుణ్ జైట్లీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

కేంద్ర మంత్రివ‌ర్గంలో కొత్త‌గా పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌ (స్వతంత్ర హోదా) శాఖ‌ను ప్ర‌వేశ‌పెట్టబ‌డిన‌ప్పుడు ఆయ‌నే తొలి మంత్రి. జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారాల గురించి 2002 జూలైలో ఆ రాష్ట్రం నామినేట్ చేసిన వ్య‌క్తులు, ఇత‌ర సంస్థ‌లతో కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిథిగా వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌రకూ ఒక్క లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అరుణ్ జైట్లీ రాజకీయ జీవితం

  • 2019 : 2019 ఆగస్ట్ 24: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్’లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
  • 2018 : నాలుగోసారి జైట్లీ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 2017 : మార్చి 13, 2017 నుంచి సెప్టెంబ‌రు 3, 2017 వ‌ర‌కు ర‌క్ష‌ణ మంత్రిగా మ‌రోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 2014 : న‌వంబ‌రు 9, 2014 నుంచి జూలై 2016 మ‌ధ్య కాలంలో కేంద్ర స‌మాచార, ప్ర‌సారాల శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
  • 2014 : జూన్ 2, 2014 నాడు రాజ్య‌స‌భ నాయ‌కుడిగా జైట్లీ ఎన్నిక‌య్యారు.
  • 2014 : మే 27, 2014 నుంచి 14 మే, 2018 వ‌ర‌కు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 2014 : మే 27 నుంచి న‌వంబ‌రు 9, 2014 మ‌ధ్య కాలంలో ర‌క్ష‌ణ మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు.
  • 2012 : 2012 జూన్ నుంచి న‌వంబ‌రు వ‌ర‌కు లోక్‌పాల్, లోకాయుక్త‌ల‌పై రాజ్య‌స‌భ సెలెక్ట్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2012 : జైట్లీ మూడోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 2009 : డిసెంబ‌రు 2009 నుంచి మే 2014 మ‌ధ్య పార్ల‌మెంట్ హౌస్, వార‌స‌త్వ సంప‌ద, అభివృద్ధి నిర్వ‌హ‌ణ‌పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 2009 : 2009 ఆగ‌స్టు నుంచి మే, 2014 మ‌ధ్య‌కాలంలో పార్ల‌మెంటు హౌస్ కాంప్లెక్స్‌లో జాతీయ నాయ‌కులు, పార్ల‌మెంటేరియ‌న్ల విగ్ర‌హాలు/చిత్ర ప‌టాల ఏర్పాటుకై ఉద్దేశించిన సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2009 : సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీలో స‌భ్యుడిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.
  • 2009 : జూన్ 3, 2009 నుంచి మే 26, 2014 వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు.
  • 2009 : జూన్ 3, 2009 నుంచి ఏప్రిల్ 2, 2012 వ‌ర‌కు వాణిజ్య క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 2006 : 2006 ఆగ‌స్టు నుంచి డిసెంబ‌రు 2009 వ‌ర‌కు ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ సంయుక్త‌ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2006 : 2006 ఆగ‌స్టు నుంచి డిసెంబ‌రు 2008 వ‌ర‌కు ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్‌పై రాజ్యాంగ, న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిశీలించేందుకు ఏర్పాటైన సంయుక్త క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2006 : రాజ్య‌స‌భ‌కు మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు(మొత్తంగా రెండోసారి).
  • 2006 : 2006 జ‌న‌వ‌రి నుంచి జూలై 2010 వ‌ర‌కు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ వ‌రల్డ్ అఫైర్స్‌లో స‌భ్యుడిగా ఉన్నారు.
  • 2005 : మార్చి 2005 నుంచి మార్చి 2010 మ‌ధ్య మ‌రోసారి ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం కోర్టులో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2004 : అక్టోబ‌రు 2004 నుంచి మే 2009 వ‌ర‌కు హోం వ్య‌వ‌హరాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2004 : 2004 ఆగ‌స్టు నుంచి మే 2009 వ‌ర‌కు వాణిజ్య కమిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 2004 : 2004 ఆగ‌స్టు నుంచి జూలై 2009 వ‌ర‌కు ప్రివిలేజేస్ క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 2003 : జ‌న‌వ‌రి 29, 2003 - మే 21, 2004 మ‌ధ్య కేంద్ర న్యాయం, చ‌ట్టం, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
  • 2003 : జ‌న‌వ‌రి 29, 2003 నాడు హోం వ్య‌వ‌హ‌రాల క‌మిటీ మ‌రియు విదేశీ వ్య‌వ‌హ‌రాల క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2002 : జూలై 29, 2002 నుంచి జ‌న‌వ‌రి 29, 2003 వ‌ర‌కు ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం కోర్టులో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
  • 2001 : మార్చి 20, 2001 నుంచి సెప్టెంబ‌రు 1, 2001 వ‌ర‌కు కేంద్ర షిప్పింగ్ మంత్రిగా అద‌న‌పు బాద్య‌త‌ల‌ను చేప‌ట్టారు.
  • 2000 : న‌వంబ‌రు 7, 2000 నుంచి జూలై 1, 2002 వ‌ర‌కు కేంద్ర చ‌ట్టం, న్యాయం మ‌రియు కార్పోరేట్ వ్య‌వ‌హ‌రాల మంత్రిగా ప‌ని చేశారు.
  • 2000 : జూలై 23, 2000 నుంచి న‌వంబ‌రు 6, 2000 వ‌ర‌కు ఆయ‌న కేంద్ర చ‌ట్టం, న్యాయం, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా)గా ప‌ని చేశారు.
  • 2000 : 2000 ఏప్రిల్‌లో, జైట్లీ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 1999 : డిసెంబ‌రు 10, 1999 నుంచి జూలై 2000 వ‌ర‌కు కేంద్ర పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ శాఖ స‌హాయమంత్రి (స్వ‌తంత్ర హోదా)గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు.
  • 1999 : అక్టోబ‌రు 13, 1999 నుంచి సెప్టెంబ‌రు 30, 2000 వ‌ర‌కు కేంద్ర స‌మాచార, ప్ర‌సారాల శాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా)గా ప‌ని చేశారు.
  • 1989 : భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌ను అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌గా నియ‌మించింది. ఈ ప‌ద‌విలో ఆయ‌న ఏడాది పాటు సేవ‌లందించారు.
  • 1977 : అరుణ్ జైట్లీ జ‌న్‌సంఘ్‌లో చేరారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఏబీవీపీ ఆలిండియా సెక్ర‌ట‌రీగా నియ‌మితుల‌య్యారు.
  • 1975 : అంత‌ర్గ‌త అత్య‌వ‌స‌ర ప‌రిస్థితికి వ్య‌తిరేకంగా పోరాడినందుకు మీసా చ‌ట్టం కింద 19 నెల‌ల పాటు జైలులో గ‌డిపారు.
  • 1974 : ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి సంఘం అధ్య‌క్షుడిగా ఆయ‌న ఎన్నిక‌య్యారు.
  • 1970 : బీజేపీ యువ‌జ‌న విభాగ‌మైన అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ (ఏబీవీపీ)లో అరుణ్ జైట్లీ చేరారు. అవినీతికి వ్య‌తిరేకంగా 1975లో దివంగ‌త జయ‌ప్రకాష్ నారాయ‌ణ్‌ చేప‌ట్టిన ఉద్య‌మంలో పాల్గొన్న నాయకుల‌లో అరుణ్ జైట్లీ ముఖ్యులు.

గ‌త చ‌రిత్ర

  • 1990: జ‌న‌వ‌రి 1990 ఢిల్లీ హైకోర్టు ఆయ‌న‌ను సీనియ‌ర్ న్యాయ‌వాదిగా గుర్తించింది.
  • 1977: ఎల్‌.ఎల్‌.బీ ప‌ట్టా పుచ్చుకున్న త‌ర్వాత 1977 నుంచి ఆయ‌న వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో, సుప్రీం కోర్టులోనూ న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేశారు.

అరుణ్ జైట్లీ సాధించిన విజయాలు

2010 సంవ‌త్స‌రానికి ఉత్త‌మ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా అవార్డు అందుకున్నారు. మాద‌క‌ద్ర‌వ్యాలు, మ‌నీలాండ‌రింగ్ చ‌ట్టాల‌పై 1998 జూలైలో ఐక్య‌రాజ్య స‌మితి అసెంబ్లీలో జ‌రిగిన స‌ద‌స్సుకు హాజ‌రైన‌ భార‌త ప్ర‌భుత్వ అధికారుల బృందంలో ఆయ‌న‌ ఉన్నారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+