అటల్ బిహారీ వాజ్‌పేయీ పూర్తి కాలం పదవిలో కొనసాగిన తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. కార్గిల్ యుద్ధంలో దేశాన్ని విజయపథాన నడిపించి, గొప్ప రాజకీయనాయకుడిగా పేరు గాంచి, 1999 లో ఆయన దేశ ప్రధాని అయ్యారు. అంతకుముందు 1996 మరియు 1998 లోనూ ప్రధానమంత్రి అయినప్పటికీ, స్వల్పకాలం మాత్రమే ఆయన పదవిలో కొనసాగారు. 1924 లో గ్వాలియర్ పట్టణంలో వాజ్‌పేయీ జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయనపై మార్క్సిస్టు భావజాల ప్రభావం ఉండేది. అయితే క్రమంగా ఆ సిద్ధాంతాలను వీడి ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరారు. రాజకీయ నాయకుడిగా ఆయన హిందూ జాతీయవాదానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వాజ్‌పేయీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1951 లో జన్‌సంఘ్ పార్టీని స్థాపించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఖైదు చేయబడ్డారు. ఆ ఉదంతం తర్వాత ఆయన పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాని ఏర్పరిచి, 1979 లో ఆయన విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి అయ్యారు. అయితే అంతర్గత లుకలుకల కారణంగా సంకీర్ణ ప్రభుత్వం కొద్దికాలంలోనే కుప్పకూలిపోవడంతో, విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన కొద్దికాలం పాటే కొనసాగారు.
రాజకీయాల్లో తాను నమ్మిన సిద్దాంతాల పట్ల అపార విశ్వాసం కనబరిచే ఆయన ఒక్కోసారి ఆర్ఎస్ఎస్ భావజాలంతోనూ విభేధించడానికి వెనుకాడేవారు కాదు. తన పార్టీ సభ్యులు విమర్శించినప్పటికీ, పొరుగుదేశం పాకిస్థాన్‌తో సబంధాలు మెరుగుపరిచేందుకు ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. శాంతి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు గుజరత్ అల్లర్లలో మోదీ ప్రమేయం కారణంగా నిష్ప్రయోజనమయ్యాయి. వాజ్‌పేయీకి కవిత్వం అంటే ఎంతో ఇష్టం. కవిత్వంపై ఆయన ఎన్నో పుస్తకాలను రచించారు మరియు ఆర్ఎస్ఎస్ మేగజైన్‌కు రచయితగానూ పని చేశారు.2018 లో తొంభై మూడవ ఏట ఆయన కన్నుమూశారు.
| పూర్తి పేరు | అటల్ బిహారీ వాజ్‌పేయీ |
| పుట్టిన తేదీ | 25 Dec 1924 |
| మరణం యొక్క తేదీ | 16 Aug 2018 (వయస్సు 93) |
| పుట్టిన ప్రాంతం | గ్వాలియర్, మధ్య ప్రదేశ్ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | |
| వృత్తి | పాత్రికేయులు మరియు సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | శ్రీ కృష్ణ బిహారీ వాజ్‌పేయీ |
| తల్లి పేరు | కృష్ణ దేవి |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.