హోం
 » 
బిప్ల‌బ్ కుమార్ దేబ్

బిప్ల‌బ్ కుమార్ దేబ్

బిప్ల‌బ్ కుమార్ దేబ్

బిప్ల‌వ్‌ కుమార్ దేబ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు ప్ర‌స్తుతం త్రిపుర ముఖ్య‌మంత్రి. జ‌న‌వ‌రి 7, 2016 నుంచి ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

బిప్ల‌బ్ కుమార్ దేబ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

బిప్ల‌వ్‌ కుమార్ దేబ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు ప్ర‌స్తుతం త్రిపుర ముఖ్య‌మంత్రి. జ‌న‌వ‌రి 7, 2016 నుంచి ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడిగా ఉన్నారు. 2018 లో రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో ఆయ‌న నేతృత్వంలో బీజేపీ పార్టీ 25 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న సీపీఎం నాయ‌క‌త్వంలోని వామ‌ప‌క్షాల ప్ర‌భుత్వాన్ని ఓడించింది. త్రిపుర రాష్ట్రంలో గోమ‌తి జిల్లాలోని ఉద‌య్‌పూర్‌లో బిప్ల‌వ్ కుమార్ దేబ్ పుట్టారు. ఆయ‌న బాల్యం మ‌రియు పాఠ‌శాల విద్య అంతా కూడా త్రిపుర‌లోనే గ‌డిచిపోయింది. న్యూఢిల్లీలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌లో చేర‌క ముందు త్రిపుర విశ్వ‌విద్యాల‌యం నుంచి ఆయ‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. 15 ఏళ్ల త‌ర్వాత ఆయ‌న త‌న సొంత రాష్ట్రం త్రిపుర‌కు తిరిగి వ‌చ్చారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

బిప్ల‌బ్ కుమార్ దేబ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు బిప్ల‌బ్ కుమార్ దేబ్
పుట్టిన తేదీ 25 Nov 1971 (వ‌య‌స్సు  52)
పుట్టిన ప్రాంతం ఉద‌య్‌పూర్‌, గోమ‌తి జిల్లా, త్రిపుర‌
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate
వృత్తి సామాజిక సేవ
తండ్రి పేరు హీరుధ‌న్ దేబ్
తల్లి పేరు N/A
జీవిత భాగస్వామి పేరు నీతి దేబ్
జీవిత భాగస్వామి వృత్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్ల‌మెంట్ హౌజ్ శాఖ‌, న్యూ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు.
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా రిసైడింగ్ ఇన్ సీ/ఓ, త‌ప‌న్ దాస్‌గుప్తా, బంగ్లాదేశ్ క‌మీష‌నర్ కార్యాల‌యం ప్ర‌క్క‌న‌, పీ.ఓ. కుంజ‌బాన్‌, పీ.ఎస్‌. తూర్పు అగ‌ర్త‌లా, ప‌శ్చిమ త్రిపుర జిల్లా, పిన్ - 799006
ప్రస్తుత చిరునామా రిసైడింగ్ ఇన్ సీ/ఓ, త‌ప‌న్ దాస్‌గుప్తా, బంగ్లాదేశ్ క‌మీష‌నర్ కార్యాల‌యం ప్ర‌క్క‌న‌, పీ.ఓ. కుంజ‌బాన్‌, పీ.ఎస్‌. తూర్పు అగ‌ర్త‌లా, ప‌శ్చిమ త్రిపుర జిల్లా, పిన్ - 799006
కాంటాక్ట్ నెంబర్ 03812309966, 8794954703
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ N/A

బిప్ల‌బ్ కుమార్ దేబ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹1.86 CRORE
ఆస్తులు :₹2.14 CRORE
బాధ్యతలు: ₹27.79 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

బిప్ల‌బ్ కుమార్ దేబ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఖాళీ స‌మ‌యాల‌లో ఆయ‌న ప్ర‌యాణాలు చేస్తుంటారు. క్రికెట్ ఆయ‌న‌కు ఇష్ట‌మైన ఆట‌. న‌రేంద్ర మోదీని త‌న రాజ‌కీయ గురువుగా ఆయ‌న భావిస్తుంటారు. ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా ఆయ‌న ప్ర‌తిభ‌ను గుర్తించిన త‌ర్వాత 2014 లో మోదీ ఆయ‌న ఢిల్లీ నుంచి త్రిపుర‌కు పంపించారు. మ‌హాభార‌త కాలంలోనే ఇంట‌ర్నెట్ మ‌రియు ఉప‌గ్ర‌హాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చ‌ర్చ‌ల్లో నిలిచారు. సివిల్ స‌ర్వీస్ ప‌రీక్ష‌ల‌పైనా ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సివిల్స్‌కు సివిల్ ఇంజినీర్లు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివినవారు ఇందుకు అన‌ర్హులని ఆయ‌న అన్నారు. అంత‌ర్జాతీయ అందాల పోటీలు కూడా ఒక ప్ర‌హాస‌న‌మ‌ని ఆయ‌న నోరు పారేసుకున్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్ మ‌రియు సుస్మితా సేన్‌ల‌పై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ప్ర‌జ‌లు భావించారు.

బిప్ల‌బ్ కుమార్ దేబ్ రాజకీయ జీవితం

2018
  • సీపీఎంకి చెందిన అమ‌ల్ చ‌క్ర‌వ‌ర్తిపై బ‌నామ‌లిపుర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మార్చి 9, 2018 నాడు త్రిపుర ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
2017
  • సుదీప్ రాయ్ బ‌ర్మ‌న్ నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎమ్మేల్యేలు ఆగ‌స్టు 8 2017 లో బీజేపీలో చేరారు. వీరు బీజేపీలో చేరేలా బిప్ల‌వ్ దేబ్ సహాయ స‌హాకార‌మందించారు.
2016
  • జ‌న‌వ‌రి 7, 2016 న‌ ఆయ‌న త్రిపుర బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు.
2014
  • బీజేపీ త్రిపుర ఇంఛార్జిగా బిప్ల‌బ్ కుమార్ దేబ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న తీవ్రంగా కృషి చేశారు.

బిప్ల‌బ్ కుమార్ దేబ్ సాధించిన విజయాలు

ముఖ్య‌మంత్రిగా తొలి ఆరు నెల‌ల ప‌ద‌వీ కాలంలో మ‌త్తు ప‌దార్థాల మాఫియాపై త్రిపుర ప్ర‌భుత్వం ఉక్కు పాదం మోపింది. 2018 లో 40 వేల కిలోల‌కు పైనే బ్రౌన్ షుగ‌ర్‌, హెరాయిన్ మ‌రియు కొకైన్ ప‌దార్థాల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకొంది.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X