• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ఫ‌రూఖ్‌ అబ్దుల్లా

ఫ‌రూఖ్‌ అబ్దుల్లా

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

డాక్ట‌ర్ ఫ‌రూఖ్‌ అబ్దుల్లా ప్ర‌ముఖ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న జ‌మ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి మాజీ ముఖ్య‌మంత్రి. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీన‌గ‌ర్ నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్నారు. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నాయ‌కుడైన షేక్ అబ్దుల్లాకు జ‌న్మించిన‌ ఆయ‌న త‌న పాఠ‌శాల చ‌దువును త్యాండేల్ బిస్కోయ్ స్కూల్ నుంచి పూర్తి చేశారు. ఆ త‌ర్వాత జైపూర్‌లోని ఎస్ఎమ్ఎస్ వైద్య క‌ళాశాల నుంచి ఎమ్‌బీబీఎస్ ప‌ట్టాను అందుకున్నారు. అనంత‌రం వైద్య‌వృత్తిని కొన‌సాగించ‌డానికి ఆయ‌న యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు వెళ్లారు. 1980 లో ఏడ‌వ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో గెలిచి ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టారు. త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం 1983 లో ఆయ‌న జ‌మ్మూ & కాశ్మీర్‌కి ముఖ్య‌మంత్రి అయ్యారు. జ‌మ్మూ & కాశ్మీర్‌కి ప‌లుమార్లు ముఖ్య‌మంత్రిగా అబ్దుల్లా ప‌ని చేశారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఫ‌రూఖ్‌ అబ్దుల్లా
పుట్టిన తేదీ 21 Oct 1937 (వ‌య‌స్సు  83)
పుట్టిన ప్రాంతం శ్రీన‌గ‌ర్ (జ‌మ్మూ & కాశ్మీర్‌)
పార్టీ పేరు Jammu & Kashmir National Conference
విద్య Graduate Professional
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు దివంగ‌త శ్రీ షేక్ మొహ‌మ్మ‌ద్ అబ్దుల్లా
తల్లి పేరు దివంగ‌త శ్రీమ‌తి. అక్బ‌ర్ జెహాన్ బేగం
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి. మోలీ అబ్దుల్లా
జీవిత భాగస్వామి వృత్తి మాజీ న‌ర్సు
సంతానం 1 కుమారులు 3 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా 40, గుప్‌కార్ రోడ్, శ్రీన‌గ‌ర్‌, జ‌మ్మూ & కాశ్మీర్‌, టెలిఫోన్ : (0194) 2452540, 09018210000 (M), ఫ్యాక్స్‌. (0194) 2452120
ప్రస్తుత చిరునామా ఏబీ-9, తిల‌క్ మార్గ్, న్యూ ఢిల్లీ-110001, టెలీఫ్యాక్స్ : (011) 23782102, 09018210000(M)
కాంటాక్ట్ నెంబర్ 0194-2452540
ఈ-మెయిల్ iamfarooq70@hotmail.com, farooq_abdullah@rediffmail.com

ఆసక్తికర అంశాలు

డాక్ట‌ర్ ఫరూఖ్ అబ్దుల్లా బ్రిటన్‌కు చెందిన మోలీ అనే న‌ర్స్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు న‌లుగురు పిల్ల‌లు. వారిలో ఒక‌రైన ఒమ‌ర్ అబ్దుల్లా జ‌మ్మూ & కాశ్మీర్ కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఫ‌రూఖ్ అబ్దుల్లా కూతుళ్ల‌లో ఒక‌రైన సారా, ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్‌ను పెళ్లాడారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 2017
  శ్రీన‌గ‌ర్ లోక్‌స‌భ సీటుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఆయ‌న పీపుల్స్ డెమొక్ర‌టిక్ పార్టీకి చెందిన న‌జీర్ అహ్మ‌ద్ ఖాన్ పై గెలిచారు.
 • 2014
  2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో ఆయ‌న శ్రీన‌గ‌ర్ నుంచి పోటీ చేసిన‌ప్ప‌టికీ, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన తారీఖ్ హ‌మీద్ క‌ర్రా చేతిలో ఓడిపోయారు.
 • 2009
  ఫిబ్ర‌వ‌రి 2009 లో రాజ్య‌స‌భ‌కు తిరిగి ఎన్నిక‌య్యారు కానీ 2009 మే లో త‌న స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీకి మ‌రోమారు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు.
 • 2009
  లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో ఆయ‌న శ్రీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి యూపీఏ ప్ర‌భుత్వంలో చేరారు. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో ఆయ‌న నూత‌న మ‌రియు పున‌ర్వినియోగ ఇంధ‌న వ‌న‌రుల మంత్రిగా ప‌ని చేశారు.
 • 2006
  పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడు, జ‌నాభా మ‌రియు ప్ర‌జారోగ్య పార్ల‌మెంట‌రీ ఫోరంలో స‌భ్యుడ‌య్యారు.
 • 2004
  ఆగ‌స్టు 2004 నుంచి న‌వంబ‌రు 2008 మ‌ధ్య పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడ‌య్యారు.
 • 2003
  జ‌న‌వ‌రి 2003 నుంచి ఫిబ్ర‌వ‌రి 2004 మ‌ధ్య ర‌క్ష‌ణ శాఖ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు.
 • 2002
  2002 న‌వంబ‌ర్‌లో ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. జ‌మ్మూ & కాశ్మీర్ పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న దిగిపోయారు. అనంత‌రం ఆయ‌న కొడుకు ఒమ‌ర్ పార్టీ అధ్యుడ‌య్యారు.
 • 1996
  మ‌రోమారు అబ్దుల్లా ఎమ్మేల్యేగా ఎన్నికై అక్టోబ‌రు 9, 1996 న ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న అక్టోబ‌ర్ 18, 2002 వ‌ర‌కు సేవ‌లందించారు.
 • 1986
  జ‌మ్మూ కాశ్మీర్ శాస‌న‌స‌భ‌కు మ‌రోసారి ఎన్నికైన ఫ‌రూఖ్ న‌వంబ‌ర్ 7, 1986 నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న జ‌న‌వ‌రి 19, 1990 వ‌ర‌కు ప‌ని చేశారు.
 • 1984
  నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ లో కుట్ర చోటు చేసుకోవ‌డంతో, గులామ్ మ‌హ్మ‌ద్ షా పార్టీ నుంచి వేరుప‌డ్డారు మ‌రియు అబ్దుల్లా ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. జూలై 2, 1984 నాడు ఆయ‌న సీఎం పద‌వి నుంచి దిగిపోయారు.
 • 1983
  జ‌మ్మూ & కాశ్మీర్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
 • 1982-83
  జ‌మ్మూ & కాశ్మీర్ శాస‌న మండ‌లికి ఎన్నికై, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
 • 1981
  జ‌మ్మూ & కాశ్మీర్ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్య‌క్షుడ‌య్యారు.
 • 1980
  శ్రీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 7 వ లోక్‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఫ‌రూఖ్ అబ్దుల్లా ఎన్నిక‌య్యారు.
 • 1970s
  త‌న తండ్రి షేక్ అబ్దుల్లా స్థాపించిన జ‌మ్మూ & కాశ్మీర్ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీతో డాక్ట‌ర్ ఫ‌రూఖ్ అబ్దుల్లా త‌న అనుబంధాన్ని మొద‌లుపెట్టారు.
 • 1982 లో త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం, సెప్టెంబ‌రు 8, 1982 న‌ ఆయ‌న జ‌మ్మూ & కాశ్మీర్ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు.
నికర ఆస్తులు13.1 CRORE
ఆస్తులు 13.1 CRORE
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X