కిషన్ రెడ్డి పేరు భారత రాజకీయాల్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ వినిపిస్తుంది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు.
కిషన్ రెడ్డి పేరు భారత రాజకీయాల్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ వినిపిస్తుంది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు. అంతేకాదు శాసన చట్టాలు పిల్లలకు అనుకూలంగా ఉండాలని ఆయన అభిలాష. తిమ్మాపూర్ అనే చిన్న గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. జాతీయ స్థాయిలో నేతగా ఎదిగారు. 11 ఏళ్ల వయసులోనే తాను చదువుకున్న ఉన్నత పాఠశాల ప్రెసిడెంట్గా గెలుపొందారు. అంటే విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు. ఇక కళాశాలలో చదివే రోజుల్లో ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించడమో, పాలుపంచుకోవడమో చేసేవారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ముప్పు పెట్టేందుకు రకరకాల అవగాహన సదస్సులను ఏర్పాటు నిర్వహించేవారు. ఇక చూపులేనివారు, దివ్యాంగుల కోసం పోరాడారు. వారికీ సమాన హక్కులను, అవకాశాలను ఇవ్వాలని గట్టిగా పోరాడేవారు. ఆయన జయప్రకాష్ నారాయణ్, స్వామి వివేకానందలను స్పూర్తిగా తీసుకున్నారు. 1977లో జనతా పార్టీలో కార్యకర్తగా చేరారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ ప్రోత్సాహంతో పార్టీలోకి చేరారు. ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరారు. ఆ తర్వాత బీజేపీలోకి చేరి అనతి కాలంలోనే జాతీయ నేతగా గుర్తింపును పొందారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి 2004లో పోటీ చేసి గెలుపొందారు. 2009, 2014లో రెండు సార్లు అంబర్పేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
పూర్తి పేరు | గంగాపురం కిషన్ రెడ్డి |
పుట్టిన తేదీ | 15 May 1964 (వయస్సు 59) |
పుట్టిన ప్రాంతం | తిమ్మాపూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా |
పార్టీ పేరు | Bharatiya Janta Party |
విద్య | Others |
వృత్తి | రాజకీయ నేత, సామాజిక కార్యకర్త |
తండ్రి పేరు | స్వామి రెడ్డి గంగాపురం |
తల్లి పేరు | ఆండాలమ్మ |
జీవిత భాగస్వామి పేరు | కావ్య కిషన్ రెడ్డి |
జీవిత భాగస్వామి వృత్తి | Business |
సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
మతం | హిందూ |
శాశ్వత చిరునామా | ఇంటి నం-3-4-4, ఫ్లాట్ నం.502, లెజెండ్ శ్రీలక్ష్మి అపార్ట్మెంట్స్, భూమన్నగల్లి, కాచిగూడ, హైదరాబాద్, తెలంగాణ - పిన్కోడ్- 500027 |
ప్రస్తుత చిరునామా | ఇంటి నెం.3-4-857, మోతీ అపార్ట్మెంట్స్, బర్కత్పుర, హైదరాబాద్, తెలంగాణ- పిన్ కోడ్- 500 027 |
కాంటాక్ట్ నెంబర్ | 040-27568188,9490599997 |
ఈ-మెయిల్ | [email protected] |
వెబ్సైట్ | http://kishanreddy.com/ |
సామాజిక నిర్వహణ | సామాజిక నిర్వహణ: |
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.