Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గిరిరాజ్ సింగ్

గిరిరాజ్ సింగ్
గిరిరాజ్ సింగ్ బీజేపీకి చెందిన భారత రాజకీయ నాయకుడు. 16వ లోక్ సభ ద్వారా నవాదా నియోజకవర్గం నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా ఎన్నుకోబడ్డారు.
By Rashmi | Monday, February 8, 2021, 01:09:31 PM [IST]

గిరిరాజ్ సింగ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

గిరిరాజ్ సింగ్ బీజేపీకి చెందిన భారత రాజకీయ నాయకుడు. 16వ లోక్ సభ ద్వారా నవాదా నియోజకవర్గం నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా ఎన్నుకోబడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా స్వతంత్ర్య హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. నితీశ్ కుమార్ క్యాబినేట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. బీహార్ జంతు సంరక్షణ చేపల పెంపకం అభివృద్ధి సహాయక మంత్రిగా పనిచేశారు. గిరిరాజ్ సింగ్ 1952 సెప్టెంబరు 8న బరాహీయా లక్కసరాయ్‌కు జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు. బరాహీయా గ్రాడ్యుయేషన్ నిమిత్తం మగధ యూనివర్సిటిలో 1971వ సంవత్సరం చేరారు. ఈయన భూమిహార్ కమ్యూనిటీకి చెందిన వారు. ఉమా సిన్హాను సతీమణిగా జీవితంలోకి ఆహ్వానించి ఒక పాపకు తండ్రి అయ్యారు.

మరిన్ని చదవండి

గిరిరాజ్ సింగ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు గిరిరాజ్ సింగ్
పుట్టిన తేదీ 08 Sep 1952 (వ‌య‌స్సు  73)
పుట్టిన ప్రాంతం బరాహీయా, లక్కీసరాయ్ జిల్లా, బీహార్
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate
వృత్తి వ్యవసాయదారుడు
తండ్రి పేరు శ్రీ రామావతార్ సింగ్
తల్లి పేరు లేట్ శ్రీమతి తారాదేవీ
జీవిత భాగస్వామి పేరు శ్రీమతి ఉమా సిన్హా
సంతానం 1 కుమార్తెలు
మతం హిందూ

గిరిరాజ్ సింగ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹13.42 CRORE
ఆస్తులు
₹14.32 CRORE
బాధ్యతలు
₹90 LAKHS

గిరిరాజ్ సింగ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

i) గ్రామాల్లోని వ్యవసాయాభివృద్ధి, పరిసరాల అభివృద్ధి, లైవ్ స్టాక్‌లపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ii) సౌర-శక్తి దాని వినియోగం గురించి ప్రజలకు తెలియజేశారు.
iii) ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సహాయంతో పశుపోషణ దాంతో పాటుగా మోరింగా బయోమాస్ తయారీ విధానాలను తెలియపరిచేలా కృషిచేశారు. (పరిశోధనకు సంబంధించిన వివరాలు ఆమోదించాల్సి ఉంది)

గిరిరాజ్ సింగ్ రాజకీయ జీవితం

  • 2017 : 2014 నవంబరు 9 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు స్వతంత్ర్య హోదాలో రాష్ట్ర మంత్రిగా ఎన్నికయ్యారు.
  • 2016 : ఈ సంవత్సరంలో జనాభా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మతాలకతీతంగా కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పుకొచ్చారు. అందరి కుటుంబాల్లో ఒకే సంఖ్యలో పిల్లలు ఉండాలని అన్నారు. కొద్ది రోజుల తర్వాత అక్టోబరులో మరొకసారి వేరే మతాలు మాత్రమే నియంత్రణ పాటించాలి. హిందువులు మాత్రం వారందరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని పెంచాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  • 2014 - 2017 : 2014 నవంబరు 9 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర మంత్రిగా స్వతంత్ర్య హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.
  • 2014 : 2014 సెప్టెంబరులో ఎంపీల జీతభత్యాల గురించి వేసిన జాయింట్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.
  • 2014 : శ్రామికుల స్టాండింగ్ కమిటీకి 2014 నవంబరు 9న సభ్యుడైయ్యారు.
  • 2014 : 2014 సెప్టెంబరు 1వ తేదీన ఎంపీల జీతభత్యాల గురించి వేసిన జాయింట్ కమిటీలో సభ్యుడైయ్యారు.
  • 2014 : నవాడ నియోజక వర్గం నుంచి 16వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2,50,091 ఓట్లతో ఆర్‌జేడీ అభ్యర్థి రాజ్ వల్లభ్ ప్రసాద్‌ను ఓడించారు.
  • 2010-2013 : పశుపోషణ చేపల పెంపకం అభివృద్ధి సంబంధిత శాఖకు బీహార్ రాష్ట్ర మంత్రిగా పని చేశారు.
  • 2005-2010 : బీహార్ క్యాబినెట్‌లో సహాయక మంత్రిగా సేవలందించారు.
  • 2002 : 2002లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి బీహార్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు సభ్యుడైయ్యారు.

గ‌త చ‌రిత్ర

  • 2019: పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సంపద అభివృద్ధి మంత్రిగా నియమితులు అయ్యారు.
  • 2019: బిహార్‌లోని బేగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి అయిదు లక్షలకు పైగా ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థిని ఓడించారు. 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+