జైరామ్ రమేష్ ప్రముఖ ఆర్థికవేత్త. ఆయన 1990 వీ.పీ. సింగ్ ప్రభుత్వంలో, నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్‌కు సలహదారుడిగానూ పని చేశారు. అంతేగాక 1996-98 లో దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న పీ చిదంబరంకు కూడా ఆయన సలహాదారుడిగా పని చేశారు. వీటితోపాటు ఆయన కర్ణాటక ప్రణాళిక బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సలహామండలికి డిప్యూటీ ఛైర్మన్‌గానూ పని చేశారు. 2004 లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. 2010 లో మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, కేంద్ర గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు, పారిశుద్ధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అయ్యాకా ఎద్దులు, దున్నలతో చేపట్టే ప్రదర్శపై నిషేధం విధించారు. 2016 లో ఇది తమిళనాడులో జరిపే జల్లికట్టు ప్రదర్శనపై నిషేధానికి దారి తీసింది. 2015 లో ఆయన మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
| పూర్తి పేరు | జైరాం రమేష్ |
| పుట్టిన తేదీ | 09 Apr 1954 (వయస్సు 71) |
| పుట్టిన ప్రాంతం | చిక్‌మగళూర్, కర్ణాటక |
| పార్టీ పేరు | Indian National Congress |
| విద్య | |
| వృత్తి | ఆర్థికవేత్త |
| తండ్రి పేరు | దివంగత సీ.కే. రమేష్ |
| తల్లి పేరు | శ్రీదేవి రమేష్ |
| జీవిత భాగస్వామి పేరు | కే.ఆర్. జయశ్రీ |
| జీవిత భాగస్వామి వృత్తి | గృహిణి |
| సంతానం | 2 కుమారులు |
| మతం | హిందూ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.