• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
క‌న్హయ్య కుమార్

క‌న్హయ్య కుమార్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

క‌న్హయ్య కుమార్ జేఎన్‌యూ మాజీ విద్యార్థి సంఘ నాయ‌కుడు. దేశ వ్య‌తిరేక‌ నినాదాలు చేసార‌నే ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. పార్ల‌మెంటుపై దాడి చేసిన అఫ్జ‌ల్ గురు ఉరితీత‌ను వ్య‌తిరేకిస్తూ క‌న్హయ్య త‌దిత‌రులు ప్ర‌ద‌ర్శ‌నలు చేప‌ట్టార‌ని బీజేపీ ఎంపీ మ‌హేష్ గిరి, ఏబీవీపీ విద్యార్థి నాయ‌కులు 2016 లో ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు ఆయ‌న‌పై ఛార్జీషీట్ దాఖ‌లు చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఖండించారు.

సీపీఐ మ‌ద్దతుదారుడైన కన్హయ్య కుమార్ బిహర్‌లోని బేగుస‌రాయ్‌లో జ‌న్మించారు. గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న రోజుల్లోనే ఆయ‌న విద్యార్థి రాజ‌కీయాల్లో పాల్గొనేవారు. ప‌ట్నాలోని న‌లందా విశ్వ‌విద్యాల‌యం నుంచి ఎంఏ పూర్తి చేశాక ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (ఏఐఎస్ఎఫ్‌)లో చేరారు. అనంత‌రం ఆఫ్రిక‌న్ స్ట‌డీస్‌పై పీ.హెచ్‌డీ చేసేందుకు గానూ 2011 లో జేఎన్‌యూకు త‌న మ‌కాం మార్చారు. జేఎన్‌యూ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఆయ‌న మొద‌టి ర్యాంకు సాధించ‌డం విశేషం. 2018 లో సీపీఐలో చేరిన ఆయ‌న రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీహార్‌లోని బెగుస‌రాయ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్నారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు క‌న్హయ్య కుమార్
పుట్టిన తేదీ 13 Jan 1987 (వ‌య‌స్సు  34)
పుట్టిన ప్రాంతం బేగుస‌రాయ్‌, బిహార్‌, ఇండియా
పార్టీ పేరు Communist Party Of India
విద్య
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త, రాజ‌కీయ ఉద్య‌మ‌కారుడు
తండ్రి పేరు జైశంక‌ర్ సింగ్
తల్లి పేరు మీనా దేవి
జీవిత భాగస్వామి పేరు NA
జీవిత భాగస్వామి వృత్తి NA

కాంటాక్ట్

శాశ్వత చిరునామా గ్రామం - ఖార‌య్యా, జిల్లా - అరారియా
ప్రస్తుత చిరునామా గ్రామం - ఖార‌య్యా, జిల్లా - అరారియా
కాంటాక్ట్ నెంబర్ NA
ఈ-మెయిల్ NA

ఆసక్తికర అంశాలు

ఏఐఎస్ఎఫ్ నుంచి జేఎన్‌యూ విద్యార్థి నాయ‌కుడు అయిన తొలి వ్య‌క్తి క‌న్హయ్య కుమారే కావ‌డం విశేషం. విద్యార్థి సంఘ ఎన్నిక‌ల్లో కుమార్‌ ఏఐఎస్ఏ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియ‌న్‌), ఏబీవీపీ (అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్), ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా), ఎన్ఎస్‌యూఐ (నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా) అభ్య‌ర్థులంద‌రినీ ఓడించి ఎన్నిక‌య్యారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2019
    పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో బెగుస‌రాయ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేయ‌నున్నారు.
  • 2018
    సీపీఐ పార్టీ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
  • 2015
    ఏఐఎస్ఎఫ్ త‌రపున జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయ‌కుడైన తొలి వ్య‌క్తిగా పేరు గాంచారు.
  • 2008
    ఆయన ఏఐఎస్ఎఫ్‌లో చేరారు.
నికర ఆస్తులుN/A
ఆస్తులు N/A
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X