హోం
 » 
కనిమొళి

కనిమొళి

కనిమొళి

వృత్తిరీత్యా పాత్రికేయురాలు, కవయిత్రి కనిమొళి. 2007లో డీఎంకే అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

కనిమొళి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

వృత్తిరీత్యా పాత్రికేయురాలు, కవయిత్రి కనిమొళి. 2007లో డీఎంకే అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటినుంచి పార్టీలో ఆమె డీఎంకే కళా, సాహిత్యం, హేతువాద విభాగాల నాయకురాలిగా పలు కీలక హోదాలలో పని చేశారు. మహిళలు, న్యాయవాదుల సాధికారత కోసం ఆమె చేసే ఉపన్యాసాలు రాజకీయ రంగంలో ఆమెకు మంచి పేరుని తీసుకొచ్చాయి . ఆమె ది హిందూ నేషనల్ ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షురాలిగా పని చేయడం విశేషం . ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం. కరుణానిధి కుమార్తె. కేంద్ర మాజీ ఎం.కే. అళగిరి, తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ చెల్లెలు. గొప్ప రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆమె స్వతంత్రగానే ఎదిగారు . ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.

మరిన్ని చదవండి
By Administrator Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

కనిమొళి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు కనిమొళి
పుట్టిన తేదీ 05 Jan 1968 (వ‌య‌స్సు  56)
పుట్టిన ప్రాంతం చెన్నై , తమిళనాడు
పార్టీ పేరు Dravida Munetra Kazhagam
విద్య NULL
వృత్తి రాజకీయ నాయకురాలు , కవయిత్రి , పాత్రికేయురాలు
తండ్రి పేరు కరుణానిధి
తల్లి పేరు రాజాతి కరుణానిధి

కనిమొళి నికర ఆస్తులు

నికర ఆస్తులు: N/A
ఆస్తులు :N/A
బాధ్యతలు: N/A

కనిమొళి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

2018లో మురళీ మనోహర్ జోషి వంటి ఉత్తమ వ్యక్తులతో కూడిన జ్యూరీ ఆమెను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపిక చేయగా , ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు .

కనిమొళి రాజకీయ జీవితం

2012
  • హోమ్ వ్యవహారాల కమిటీలో సభ్యురాలిగా పని చేసేసారు. 2012 ఆగస్టు నుంచి మానవ వనరుల అభివృద్ధి పై విద్యా హక్కు చట్టం అమలు కోసం ఏర్పాటైన సబ్ -కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
2012
  • ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీలో సభ్యురాలిగా కనిమొళి సేవలందించారు.
2010
  • గ్రామీణాభివృద్ధి పై ఏర్పాటైన కమిటీలో కనిమొళి సభ్యురాలిగా వ్యవహరించారు.
2009
  • విదేశీ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీ, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఆహార నిర్వహణపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ లో సభ్యురాలిగా సేవలందించారు .
2007
  • ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009 వరకు ఆమె ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు.

గ‌త చ‌రిత్ర

2005
  • రాజాకీయాలు కాక కనిమొళి ది హిందూ సబ్ ఎడిటర్, కుంగుమం అనే తమిళ వార పత్రికకు ఇన్ ఛార్జి ఎడిటర్ గా పని చేశారు. వీటితో పాటు సింగపూర్ కేంద్రంగా పని చేసే తమిళ పత్రిక తమిళ్ మురసుకు కూడా సంపాదకురాలిగా పని చేసారు.

కనిమొళి సాధించిన విజయాలు

కనిమొళి, తమిళనాడులో గల విరుధ్ నగర్ జిల్లాలోని కరియాపట్టి అనే గ్రామంలో 2008లో ప్రయోగాత్మకంగా జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. అప్పటినుంచి 2010 మార్చి వరకు, రెండేళ్ల కాలంలో వరుసగా జాబ్ ఫెయిర్ లను నిర్వహిస్తున్నారు. నాగర్ కోయిల్, వెలూర్, ఉదగమండలం, తిరుచిరాపల్లి, విరుధ్ నగర్ జిల్లాలో లక్షకి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. దీంతో ఆమె తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి జాబ్ ఫెయిర్లను నిర్వహించాలని అనుకుంటున్నారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X