Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య
కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. న్యాయ‌వాది, ఆర్ఎస్ఎస్ స‌భ్యుడైన ఆయ‌న చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతుంటారు.
By Rashmi | Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. న్యాయ‌వాది, ఆర్ఎస్ఎస్ స‌భ్యుడైన ఆయ‌న చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతుంటారు. రామ్ జ‌న్మ‌భూమి ఉద్య‌మం అనంత‌రం జ‌రిగిన సామూహిక అల్ల‌ర్ల‌లో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. చాలా పేద కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న త‌న బాల్యంలో టీ అమ్ముతుండేవారు. 2002, 2007, 2012 ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆయ‌న‌కు మొద‌టి రెండు ఎన్నిక‌ల్లో వైఫ‌ల్యాలే ఎదురుగా కాగా 2012 ఎన్నికల్లో ఎట్ట‌కేలకు విజ‌యం సాధించారు. ఉప ముఖ్య‌మంత్రి కాక మునుపు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య అలాహ‌బాద్ జిల్లాలోని ఫూల్‌పుర్ నియోజ‌క‌వ‌ర్గ లోక్‌స‌భ స‌భ్యుడిగానూ సేవ‌లందించారు.

మరిన్ని చదవండి

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య
పుట్టిన తేదీ 07 May 1969 (వ‌య‌స్సు  56)
పుట్టిన ప్రాంతం సిరాథు, జిల్లా. కౌశాంబీ, ఉత్త‌ర్ ప్ర‌దేశ్
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate
వృత్తి వ్యాపార‌వేత్త
తండ్రి పేరు శ్యామ్ లాల్ మౌర్య
తల్లి పేరు ధ‌న్‌ప‌తి దేవి మౌర్య
జీవిత భాగస్వామి పేరు రాజ్ కుమారి దేవి మౌర్య‌
జీవిత భాగస్వామి వృత్తి డైరెక్ట‌ర్‌, అకౌంటెంట్, జీవ‌న్ జ్యోతి క్లినిక్ హాస్పిట‌ల్ లో భాగ‌స్వామి
సంతానం 2 కుమారులు
మతం హిందూ

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹6.89 CRORE
ఆస్తులు
₹9.32 CRORE
బాధ్యతలు
₹2.44 CRORE

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

కేశవ్ ప్ర‌సాద్ మౌర్య 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిరాథు తహ‌సిల్ నుంచి బీజేపీ ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ స్థానం నుంచి బీజేపీ ఎమ్మేల్యేగా ఎన్నికైన మొద‌టి వ్య‌క్తి ఆయ‌నే కావ‌డం విశేషం. 2002 ఎన్నిక‌ల్లో ఆయ‌న బందా స్థానం నుంచి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2007 లోనూ అలాహాబాద్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌వి చూశారు.

కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య రాజకీయ జీవితం

  • 2017 : ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.
  • 2014 : ఫూల్‌పుర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెగ్గి 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నికల్లో ఆయ‌న ధ‌రం రాజ్ సింగ్ ప‌టేల్‌పై 3,08,308 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 2012 : సిరాథు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌య‌వంతంగా ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని కొన‌సాగించారు. ఆ ఎన్నిక‌ల్లో బీఎస్‌పీ అభ్య‌ర్థి ఆనంద్ మోహ‌న్ పై 8863 ఓట్ల తేడాతో ఆయ‌న నెగ్గారు.
  • 2007 : అలాహబాద్ స్థానం నుంచి రెండో సారి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ఆయ‌న మొత్తం 11,111 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ సారి ఎన్నిక‌ల్లో బీఎస్‌పీకి చెందిన పూజా పాల్ 56,198 ఓట్లు తెచ్చుకుని గెలిచారు.
  • 2002 : బందా నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల బరిలో నిలిచిన ఆయ‌న‌కు కేవ‌లం 204 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన బీఎస్‌పీ అభ్య‌ర్థి బాబు లాల్ కేశ‌వకు 36,748 ఓట్లు వ‌చ్చాయి.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+