హోం
 » 
కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు

కొన‌క‌ళ్ల నారాయ‌ణ లోక్‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఆయ‌న తెలుగుదేశం పార్టీకి చెందినవారు.

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కొన‌క‌ళ్ల నారాయ‌ణ లోక్‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఆయ‌న తెలుగుదేశం పార్టీకి చెందినవారు. నారాయ‌ణ రావు 2009 మ‌రియు 2014 లో 15 మ‌రియు 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వ్య‌వ‌సాయం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన ఆయ‌న తొలుత కాంట్రాక్ట‌ర్‌గా ప‌ని చేసారు. మ‌చిలీప‌ట్నంలోని వెనుక‌బ‌డిన త‌రగ‌తుల వారు మరియు వారి నాయ‌కుల‌తో ఆయ‌న స‌న్నిహిత సంబంధాల‌ను క‌లిగి ఉండేవారు. త‌న సామాజిక వ‌ర్గంలోని వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారు మ‌రియు పేద ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తుల‌ను మార్చివేసేందుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అంద‌రి మెప్పును పొందాయి.

తెలుగుదేశం పార్టీ స‌భ్యుడిగా 2009 మ‌రియు 2014 లో మ‌చిలీప‌ట్నం నుంచి ఆయ‌న లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. లోక్‌స‌భ ప్యానెల్ స్పీక‌ర్‌ల‌లో ఒక‌రిగా రావు నియ‌మితుల‌య్యారు.

మరిన్ని చదవండి
By Keshav Karna Updated: Monday, February 8, 2021, 01:06:01 PM [IST]

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు
పుట్టిన తేదీ 04 May 1950 (వ‌య‌స్సు  73)
పుట్టిన ప్రాంతం మ‌చిలీప‌ట్నం, జిల్లా. కృష్ణా, ఆంధ్ర ప్ర‌దేశ్
పార్టీ పేరు Telugu Desam
విద్య 12th Pass
వృత్తి వ్య‌వ‌సాయ‌వేత్త‌, రాజ‌కీయ నాయ‌కులు
తండ్రి పేరు గ‌ణ‌ప‌తి
తల్లి పేరు కాశీశ్వ‌ర‌మ్మ
జీవిత భాగస్వామి పేరు ప‌ద్మ‌జ
సంతానం 2 కుమారులు
శాశ్వత చిరునామా 18/126, సుక‌ర్ల‌బాద‌, మ‌చిలీప‌ట్నం - 521001
ప్రస్తుత చిరునామా 1, ఫిరోజ్‌షా రోడ్, న్యూ ఢిల్లీ - 110001
కాంటాక్ట్ నెంబర్ 9848012699
ఈ-మెయిల్ [email protected]

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹2.51 CRORE
ఆస్తులు :₹3.49 CRORE
బాధ్యతలు: ₹98 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

మ‌చిలీప‌ట్నంలోని జాల‌రులు, షెడ్యూల్డ్ కులాలు మ‌రియు షెడ్యూల్డ్ తెగ‌ల ప్రజ‌ల అభివృద్ధి కోసం ఆయ‌న కృషి చేసారు. నారాయ‌ణ రావు చేప‌ట్టిన సామాజిక సంక్షేమ కార్య‌క్ర‌మాల వ‌ల్ల‌నే 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు.

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు రాజకీయ జీవితం

2016
  • 2016 మే లో అంచ‌నాల క‌మిటీలో స‌భ్యుడయ్యారు. దీంతోపాటు మే 1 ,2018 నుంచి అక్టోబ‌రు 8, 2018 వ‌ర‌కు ప‌బ్లిక్ అండ‌ర్‌టేకింగ్స్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
2015
  • జ‌న‌వ‌రి 29 నాడు సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2014
  • జూన్ 9, 2014 నాడు లోక్‌స‌భ ఛైర్‌ప‌ర్స‌న్ల ప్యానెళ్‌లో స‌భ్యుడిగా, జూన్ 12, 2014 నాడు హౌజ్ క‌మిటీలో, సెప్టెంబ‌రు 1, 2014 నాడు వ్య‌వ‌సాయ స్టాండింగ్ క‌మిటీలో, సెప్టెంబ‌రు 3, 2014 నాడు కాన్సులేటివ్ క‌మిటీ మ‌రియు ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితులై సేవ‌లందించారు.
2014
  • అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి గెలిచి ఆయ‌న 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఈ సారి ఆయ‌న వైఎస్సార్సీ అభ్య‌ర్థి కొలుసు పార్థ సార‌థిపై 81,057 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2013
  • 2013, మే 3 నాడు ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
2009
  • 2009, ఆగ‌స్టు 31 నాడు పెట్రోలియం మ‌రియు స‌హజ‌వాయువుపై నియ‌మించిన స్టాండింగ్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2009
  • మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెగ్గి, ఆయ‌న 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన బ‌డిగ రామ‌కృష్ణ‌పై 12,456 ఓట్ల తేడాతో నెగ్గారు.

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు సాధించిన విజయాలు

కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు గ‌త 30 ఏళ్ల నుంచి మ‌చిలీప‌ట్నం ఆర్‌టీసీ డిపోలో నేష‌న‌ల్ మ‌జ్దూర్ ట్రేడ్ యూనియ‌న్ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X