వ్యవసాయవేత్త, వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన నిమ్మల కిష్టప్ప గారు హిందూపూర్ లోక్‌సభా స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినవారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షుడిగా ఎన్నికవడం ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. గత మూడు దశాబ్ధాలుగా అనంతపురం జిల్లాలోని కరువు ప్రాంతాలు మరియు వెనకబడ్డ ప్రాంతాల బాగు కోసం ఆయన నిబద్ధతతో కృషి చేశారు. దీంతోపాటు రాష్ట్రంలోని ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీ మరియు మైనారిటీ వర్గాల ప్రజల కోసం కృషి సల్పారు.
ఆయన 1999 లో ఒకసారి మరియు 1999 లో మరోసారి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2009 లో ఆయన లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. ఫ్యాక్షన్‌తో హింస చెలరేగే రాయలసీమ ప్రాంతంలో టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రెండో వ్యక్తి నిమ్మల కిష్టప్పే కావడం విశేషం. 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి నెగ్గి ఆయన 16 వ లోక్‌సభలో అడుగుపెట్టారు. లోక్‌సభలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ కమిటీ, పార్లమెంటు హౌజులో ఆహార నిర్వహాణ కమిటీ, రవాణా, పర్యాటకం మరియు సాంసృతిక కాన్సులేటివ్ కమిటీ, మరియు కేంద్ర జలవనరుల మరియు నదీ అభివృద్ధి, గంగానదీ పునరుద్ధరణ కాన్సులేటివ్ కమిటీలలో సభ్యుడిగా సేవలందించారు.
| పూర్తి పేరు | శ్రీ నిమ్మల కిష్టప్ప |
| పుట్టిన తేదీ | 25 Nov 1956 (వయస్సు 69) |
| పుట్టిన ప్రాంతం | పెరుమాళ్ల పల్లి, అనంతపూర్, ఆంధ్ర ప్రదేశ్ |
| పార్టీ పేరు | Telugu Desam |
| విద్య | Graduate |
| వృత్తి | వ్యవసాయవేత్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | శ్రీ నిమ్మల రంగప్ప |
| తల్లి పేరు | శ్రీమతి నిమ్మల ఆదిలక్ష్మమ్మ |
| జీవిత భాగస్వామి పేరు | శ్రీమతి నిమ్మల వరలక్ష్మీ |
| సంతానం | 2 కుమారులు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.