Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్
బీహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పేరున్న రాజకీయవేత్తగా ఎదిగారు. రాష్ట్రీయ జనతా దళ్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరించడమే కాక, బీహార్ ముఖ్యమంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు.
By Rashmi | Monday, December 31, 2018, 03:56:20 PM [IST]

లాలూ ప్రసాద్ యాదవ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

బీహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పేరున్న రాజకీయవేత్తగా ఎదిగారు. రాష్ట్రీయ జనతా దళ్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరించడమే కాక, బీహార్ ముఖ్యమంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా రైల్వే శాఖకు కూడా మంత్రిగా పనిచేశారు. పట్నా యూనివర్సిటో చదువుతుండగానే విద్యార్థి ఎన్నికల్లోకి అడుగుపెట్టారు. 1977వ సంవత్సరంలో 29 ఏళ్లకే లోక్ సభకు బీజేపీ తరపున ఎన్నికైయ్యారు. చిన్న వయస్సులో లోక్ సభకు ఎన్నికైన వ్యక్తిగా ఘనత సాధించారు. 1990వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. పోడ్డర్ స్కాం అవినీతి ఆరోపణల దృష్ట్యా 1997వ సంవత్సరంలో ఆ పదవికి రాజీనామా ప్రకటించారు. 2013వ సంవత్సరంలో సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు తొలి పశుగ్రాసం(గడ్డి) స్కాం కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్షతోపాటు రూ.25లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత విచారణలో మూడో గడ్డి స్కాంలోనూ అపరాధిగా తేలారు. రెండో గడ్డి స్కాంలో లాలూ ప్రసాద్ 3.5 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు. మూడొ గడ్డి స్కాంతో పాటు నాలుగో గడ్డి స్కాంలోనూ నేరస్థుడిగా నిరూపితమైయ్యాడు. అంతే కాకుండా దంకా ట్రెజరీకి చెందిన రూ.3.13కోట్ల రూపాయల వరకూ సొమ్మును మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో మొత్తంగా కలిపి రూ.60లక్షల వరకూ జరిమానా 14ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.

మరిన్ని చదవండి

లాలూ ప్రసాద్ యాదవ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు లాలూ ప్రసాద్ యాదవ్
పుట్టిన తేదీ 11 Jun 1948 (వ‌య‌స్సు  77)
పుట్టిన ప్రాంతం ఫూల్‌వారియా, గోపాల్‌గంజ్ జిల్లా
పార్టీ పేరు Rashtriya Janata Dal
విద్య Graduate Professional
వృత్తి సంఘ సంస్కర్త, న్యాయవాది
తండ్రి పేరు శ్రీ కుందన్ రాయ్
తల్లి పేరు Marachhiya Devi
జీవిత భాగస్వామి పేరు Rabri Devi
జీవిత భాగస్వామి వృత్తి Politician
సంతానం 2 కుమారులు 7 కుమార్తెలు
మతం హిందూ
వెబ్‌సైట్ http://rjd.co.in/shri-lalu-prasad-yadav.html

లాలూ ప్రసాద్ యాదవ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹3.05 CRORE
ఆస్తులు
₹3.21 CRORE
బాధ్యతలు
₹16.27 LAKHS

లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఎల్ఎల్‌బీ అనంతరం పట్నాలోని బీఎన్ కాలేజ్ ఆఫ్ పట్నా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. ఆ తర్వాత పట్నాలోని బీహార్ వెటర్నరీ కాలేజ్‌లో గుమస్తా ఉద్యోగంలో పనిచేశారు. ఈయన అన్నయ్య అదే కాలేజ్‌లో ప్యూన్‌గా పనిచేసేవాడు. లాలూ ప్రసాద్‌కు ఆరుగురు తోబుట్టువులు ఉండేవారు. లాలూ అతని భార్య రబ్రీ దేవీకి తొమ్మిది మంది పిల్లలు సంతానంలో ఇద్దరు కొడుకులు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. ఫుట్‌బాల్, రెజ్లింగ్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్‌లతో పాటు మరికొన్ని ఇండోర్ గేమ్స్ పట్ల ఆసక్తి కనబరిచేవారు. ఇదే క్రమంలో 2001 బీహార్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. చప్రాతో పట్నాలో ఉన్న స్పోర్ట్స్ క్లబ్‌లకు అసోసియేటివ్‌గా కూడా పనిచేశారు. అయోధ్యవరకూ జరిగే రామ్ రథ్ యాత్రలో సమస్తిపూర్ వద్ద ఎల్‌కే అద్వానీ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. ఆ సంఘటనలో లాలూ ఓ మంచి నాయకుడిగా మన్ననలు పొందాడు.

లాలూ ప్రసాద్‌కు వ్యతిరేకంగా నమోదైన మేజర్ కేసులివే:
1. 1998లో లెక్కకు మించి ఆస్తులు ఉండటంతో..
2. 1996 గడ్డి (పశుగ్రాసం) స్కాం – డియోఘర్‌కు చెందిన రూ. 89.27 లక్షల్లో నిధుల స్కాం గురించి రెండో కేసు : 2017లో తీర్పు వచ్చింది.
3. 1996 గడ్డి స్కాం– చైబసాకు చెందిన రూ. 35.62 కోట్లలో నిధుల స్కాం గురించి మూడో కేసు : 2018లో తీర్పు వచ్చింది.
4. 1996 గడ్డి స్కాం – దంకాకు చెందిన రూ. 3.97 కోట్లలో నిధుల స్కాం గురించి నాల్గో కేసు : 2018లో తీర్పు వచ్చింది.
5. 1996 గడ్డి స్కాం – దొరండాకు చెందిన రూ. 184 కోట్లలో నిధుల స్కాం గురించి ఐదో కేసు : తీర్పు వాయిదాలో ఉంది.
6. 2005 ఇండియన్ రైల్వే టెండర్ స్కాం: లాలూ కుటుంబమంతా సీబీఐ చేతుల్లో బుక్ అయింది.
7. 2017వ సంవత్సరం రూ. 45 కోట్ల బినామీ, అక్రమాస్తులు, పన్ను ఎగవేత కేసులు: లాలూ కుటుంబమంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేతుల్లో బుక్ అయింది.
8. 2017 ఏబీ ఎగుమతులు కింద రూ. 40 కోట్ల బినామీ అక్రమాస్థులు, పన్ను ఎగవేత కేసులు: లాలూ కుటుంబమంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేతుల్లో బుక్ అయింది.
9. 2017 పట్నా జూ మట్టి స్కాంలోనూ బుక్ అయ్యాడు.

లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితం

  • 2017: లాలూ కుటుంబమంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వద్ద ఏబీ ఎగుమతులు రూ.40కోట్ల బినామీ అక్రమాస్తులు, పన్ను ఎగవేత కేసులలో బుక్కయ్యారు.
  • 2017: పట్నా జూ మట్టి స్కాంలో లాలూ కొడుకులైన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లు బుక్కయ్యారు. తేజ్ ప్రతాప్‌కు చెందిన సగునా మోర్ మాల్ బేస్‌మెంట్ విషయంలో గడ్డి అక్రమ రవాణా, గడ్డి స్కాం, మట్టి అక్రమ అమ్మకాలు విషయంలో తండ్రితో పాటు ఇద్దరు కొడుకులను జైళ్లో పెట్టారు.
  • 2015: బీహార్‌లో 81 సీట్లతో ఆర్‌జేడీ పార్టీ స్థాయిని పెరిగేందుకు కృషి చేశారు. జేడీయూతో కలిసి అతని పార్టీ అత్యధిక మెజార్టీని సంపాదించింది. దీంతో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రెండు పార్టీల మధ్య ఒప్పందం జూలై 2017న రద్దు అయింది.
  • 2014: 2014 సాధారణ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేయలేదు. కానీ, అతని పార్టీ కోసం భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరకి అతని పార్టీ నాలుగు సీట్లను మాత్రమే దక్కించుకుంది.
  • 2013: లాలూ ప్రసాద్ యాదవ్‌కు లోక్ సభ సభ్యత్వం విషయంలో అనర్హత వేటు పడింది.
  • 2009: శరణ్, పాటలీపుత్ర నియోజకవర్గాల నుంచి లాలూ పోటీ చేశారు. శరణ్ నియోజకవర్గం నుంచి ఐదో సారి 15వ లోక్ సభకు ఎన్నికయ్యారు. రాజీవ్ ప్రతాప్ రూడీని మళ్లీ ఓడించారు. కానీ, జేడీయూకి చెందిన ప్రొఫెసర్ రంజన్ ప్రసాద్ చేతుల్లో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓడిపోయారు. మళ్లీ లోక్‌సభలో రాష్ట్రీయ జనతా దళ్ పార్లమెంటరీ పార్టీకి నాయకునిగా సేవలందించారు. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కమిటీ సభ్యునిగా, లా అండ్ జస్టిస్ సభ్యునిగా, లోక్ సభ సభ్యునిగా 2009 ఆగష్టు 31న ఎన్నికయ్యారు.
  • 2004: కేంద్ర మంత్రిగా నియమితులై రైల్వే శాఖ మంత్రిగా 2004 మే 23 నుంచి 2009 మే 22 వరకూ సేవలందించారు. లాలూ నాయకత్వంలో ఉన్న సమయంలోనే గరీభ్ రథ్ ట్రైన్, రైల్వే స్టేషన్లలో టీ కోసం కుల్హాద్‌లు ఏర్పాటయ్యాయి.
  • 2004: బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీని ఓడించి 14వ లోక్ సభకు నాల్గో సారి కూడా ఎన్నికైయ్యారు. తత్ఫలితంగా రాష్ట్రీయ జనతా దళ్ పార్లెమంటరీ పార్టీ నాయకునిగా లోక్ సభలో సేవలందించారు. దాంతో పాటుగా జనరల్ పర్పస్ కమిటీ సభ్యునిగా 2004 నుంచి 2009వరకూ కొనసాగారు.
  • 2002: రాజ్యసభకు ఎన్నికై 2004వరకూ కొనసాగారు. ఈ కొంతకాలంలోనే జనరల్ పర్సప్ కమిటీ సభ్యునిగా, రాష్ట్రీయ జనతా దళ్ నాయకునిగా, రాజ్యసభ సభ్యునిగా, కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా, గ్రామీణాభివృద్ధి మంత్రిగా, వ్యాణిజ్య కమిటీ సలహాదారునిగా, హోం వ్యవహారాల కమిటీ సభ్యునిగా సేవలందించారు.
  • 2000: లాలూ బీహార్ లెజిస్లేటివట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నాలుగో సారి గెలుపొందారు.
  • 1999: శరద్ యాదవ్‌కు పోటీగా నిలబడి 1999లో లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు.
  • 1998: మూడో సారి 12వ లోక్ సభకు మధేపూరా నియోజకవర్గం నుంచి ఎన్నికైయ్యారు. సాధారణ సేవల కమిటీ సభ్యునిగా, లోక్ సభ సభ్యునిగా, స్వతంత్ర్య సైనిక్ సమాన్ పెన్షన్ స్కీం దాని సభ్యుడిగా, హోం వ్యవహారాలు దాని ఉప కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. కన్సల్టేటివ్ కమిటీ, బ్రాడ్‌కాస్టింగ్ సమాచార శాఖల మంత్రిగా సంవత్సరం పాటు కొనసాగారు.
  • 1997: 1997 జూలై 5వ తేదీన లాలూ యాదవ్ తన సొంత పార్టీ అయిన రాష్ట్రీయ జనతా దల్‌ను స్థాపించారు. 2008వ సంవత్సరంలో రాష్ట్రీయ జనతా దల్‌ జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. 2010లో ఆ హోదాను కోల్పోయింది.
  • 1997: గడ్డి స్కాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనతా దళ్ పార్టీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
  • 1996: జనతా దళ్ జాతీయ నాయకుడి పదవి అందుకున్నారు. జనవరి 1996 నుంచి జూలై 1997వరకూ ఇదే పదవిలో కొనసాగారు.
  • 1995: మళ్లీ బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై సభ్యునిగా స్థానం దక్కించుకున్నారు. రాఘోపూర్, దినాపూర్ సీట్లను విజయవంతంగా గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ క్యాండిట్‌గా నిలుచున్న విషుండియో రాయ్‌ను 54603ఓట్ల తేడాతో ఓడించారు. దినాపూర్‌లో 23860ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థఇ విజయ్ సింగ్ యాదవ్‌ను ఓడించారు.
  • 1990: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు 1990 నుంచి 1995వరకూ సభ్యునిగా కొనసాగారు. లాలూ ముఖ్యమంత్రిగా 1990 నుంచి 1997వరకూ బాధ్యతలు నిర్వర్తించారు.
  • 1989: రెండో సారి ఎన్నికై తొమ్మిదో లోక్ సభలో స్థానం దక్కించుకున్నారు. ఈ సారి జేఎన్‌పీ తరపు అభ్యర్థి తాజీవ్ రంజన్‌ను జనతా పార్టీ తరపు పోటీ చేసి ఓడించారు.
  • 1989: బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అసెంబ్లీ ఛైర్మన్, లైబ్రరీ కమిటీ, బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కన్వీనర్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ పదవులను అధిష్టించారు.
  • 1985: ఐదేళ్లలోనే లాలూ ఓట్ల శాతం 45.56శాతానికి పెరిగింది. మళ్లీ సోనేపూర్ నియోజకవర్గ అభ్యర్థిగానే గెలుపొందారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ సింగ్‌ను ఓడించారు.
  • 1980: బీహార్ అసెంబ్లీకి సోనేపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐఎన్‌సీ పార్టీకి చెందిన జవహర్ ప్రసాద్‌ను 9167ఓట్లతో ఓడించారు. ఇందులో లాలూకు పోల్ అయిన ఓట్ల శాతం 48.18%
  • 1977: చప్రా నియోజకవర్గం నుంచి ఆరో లోక్ సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రామ్ శేఖర్ ప్రసాద్‌ను ఓడించి 29ఏళ్లకే ఎంపీగా ఎన్నికైయ్యారు.
  • 1974: జై ప్రకాశ్ నారాయణ్‌కు చెందిన బీహార్ మూవ్‌మెంట్‌లో చేరారు. కొన్నాళ్లకు జనతా పార్టీలో కలిశారు.
  • 1973: పట్నా యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌(పీయూఎస్‌యూ)కు ప్రెసిడెంట్‌గా మారారు.
  • 1970: లాలూ యాదవ్ రాజకీయాల్లో పట్నా యూనివర్సిటీ విద్యార్థుల యూనియన్‌(పీయూఎస్‌యూ)కు జనరల్ సెక్రటరీగా నియమితులై రాజకీయ ప్రవేశం చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్ సాధించిన విజయాలు

2004వ సంవత్సరంలో పట్నా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 1990వ సంవత్సరంలో లాలూ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందడంతో వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+