ప్రముఖ పాత్రికేయుడిగా, రచయితగా అందరి మన్ననలు అందుకున్న ఎం.జే. అక్బర్ 1989లో రాజకీయ రంగప్రవేశం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రముఖ వార్తా పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి మంచి పేరు గడించారు. 1971లో ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ జర్నలిస్టుగా తన కెరీర్‌ను మొదలుపెట్టి, అనతికాలంలోనే రచయిత/రిపోర్టర్‌గా పేరు తెచ్చుకుని, పాత్రికేయ రంగంలో ఉన్నత శిఖరాలనధిరోహించారు. అనంతరం సొంత మీడియా సంస్ధలను ఏర్పాటు చేసి, దేశంలోనే అతి పెద్ద సంస్థలలో ఒకటిగా వాటిని నిలిపారు.
ఆయన మానస పుత్రికైన ఏషియాన్ ఏజ్ మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ వార్తల సమగ్ర సమాచారాన్ని అందించింది. అనంతరం ఆ సంస్థ దేశ, విదేశాల్లో తన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని, ప్రపంచ స్థాయి మీడియా సంస్థగా అవతరించింది. 1989 లో కిషన్‌గంజ్ నియోజకవర్గ ఎంపీగా గెలవడం ద్వారా ఆయన మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. దీనితో రాజకీయాలకు విరామం ఇచ్చి, పాత్రికేయ వృత్తిలోకి తిరిగి వెళ్లారు. 2009లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లోనూ ఆయన తిరిగి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ ఏడాది ఆయన కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. అక్బర్ ఇంతకుముందు సంపాదకుడిగా పని చేసిన సంస్థలలో, పలువురు మహిళలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించడంతో అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. `మీటూ` ఉద్యమం బాగా ప్రచారంలోకి రావడంతో, దాదాపు 20 మంది మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం గమనార్హం.
| పూర్తి పేరు | ఎం.జే. అక్బర్ |
| పుట్టిన తేదీ | 11 Jan 1959 (వయస్సు 67) |
| పుట్టిన ప్రాంతం | తెలినిపారా, జిల్లా. హూగ్గీ, పశ్చిమ బెంగాల్ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | |
| వృత్తి | రచయిత, పాత్రికేయులు; ప‌్రస్తుతం ప్రజా సేవలో ఉన్నారు |
| తండ్రి పేరు | శ్రీ షేక్ అక్బర్ అలీ |
| తల్లి పేరు | శ్రీమతి ఇంతియాజ్ అక్బర్ |
| జీవిత భాగస్వామి పేరు | మల్లికా అక్బర్ |
| జీవిత భాగస్వామి వృత్తి | పాత్రికేయురాలు |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.