• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
మల్లికార్జున్ ఖర్గే

మల్లికార్జున్ ఖర్గే

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నేత., 16వ లోక్ సభలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వానికి రైల్వే మంత్రిగా కూడా ఆయన సేవలను అందించారు. రాజకీయంలో, చట్టం, అడ్మినిస్ట్రేషన్లలో ప్రజల నుంచి మంచి ఆదరణ పొంది ఎదురులేని వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖర్గే కొనసాగుతున్నారు. లోక్‌సభలో నరేంద్ర మోడీ నేతృత్వంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రికార్డు స్థాయిలో పది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొమ్మిది సార్లు గెలుపొందారు. ఇటీవల ఎన్నికల్లో గుల్బార్గా నుంచి పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులానికి చెందిన ఎంపీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా 40 ఏళ్ల చరిత్రతో పాటు ఐదేళ్లు ఎంపీగా కూడా కొనసాగారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మల్లికార్జున్ ఖర్గే
పుట్టిన తేదీ 21 Jul 1942 (వ‌య‌స్సు  79)
పుట్టిన ప్రాంతం వార్వట్టి, భల్కి తాలుకా, బీదర్ జిల్లా
పార్టీ పేరు Indian National Congress
విద్య Graduate Professional
వృత్తి రాజకీయ నాయకుడు & న్యాయవాది
తండ్రి పేరు శ్రీ మాపన్న
తల్లి పేరు శ్రీమతి సైబవ్వ
జీవిత భాగస్వామి పేరు శ్రీమతి రాధాబాయి
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 3 కుమారులు 2 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా న్యూఢిల్లీ
ప్రస్తుత చిరునామా 9, సఫ్దర్జంగ్ రోడ్, న్యూఢిల్లీ - 110 011
కాంటాక్ట్ నెంబర్ 09980035555
ఈ-మెయిల్ kharge@gmail.com
వెబ్‌సైట్ NIL
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

ఖర్గే పుస్తకాలు ఎక్కువగా చదవుతుంటారు. హేతుబద్దమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి, సంప్రదాయాలకు., మూడనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే మనిషి. కబడ్డీ, హాకీ, క్రికెట్ వంటి క్రీడలపై కూడా ఆసక్తి చూపించేవారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే గుల్బర్గా విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 2014
  2014 జనరల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఖర్గే బీజేపీ తరపున పోటీ చేసిన తన ప్రత్యర్థిపై 73,000ల ఓట్ల మెజారిటీతో గుల్బర్గా పార్లమెంటరీ సీటును గెలిచారు. తర్వాత జూన్ నెలలో లోక్ సభ కాంగ్రెస్ నాయకునిగా నియమితులయ్యారు.
 • 2009
  2009లో పదోసారి కూడా సాధారణ ఎన్నికల్లో గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
 • 2008
  2008లో ఎన్నికల్లో చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన అసెంబ్లీలో తొమ్మిదో సారి కూడా గెలిచి రికార్డు సృష్టించారు. 2004తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మరింత హుషారుగా పనిచేసినప్పటికీ కొందరు సీనియర్ నేతలు పార్టీకి దూరం కావటంతో కాంగ్రెస్ తన ఆధిక్యతను కోల్పోయింది. ఆ సమయంలో ఖర్గే 2008లో రెండోసారి ప్రతిపక్ష నాయకుడిగా నియమితుడయ్యాడు.
 • 2005
  2005లో కర్ణాటక ప్రదేశ కాంగ్రెస్ కమిటీకి ఖర్గే అధ్యక్షత వహించారు. కొద్ది రోజుల అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో బీజేపీ , జేడీ(ఎస్) పార్టీల కన్నా కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో తన సత్తా చాటింది.
 • 2004
  2004లో ఎనిమిదో సారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికై కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి మరోసారి గట్టి పోటీ కలిగిన అభ్యర్థిగా మారారు. ఆ తరవాత ధరమ్ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా, నీటి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
 • 1999
  1999లో ఏడవ సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి గట్టీ పోటీగా నిలిచారు.
 • 1994
  1994లో గుర్మిట్కల్ నియోజకవర్గం నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోసారి ఎన్నికై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
 • 1992
  1992 నుంచి 1994 వరకు వీరప్ప మౌళి క్యాబినెట్‌లో కో-ఆపరేషన్, మాధ్యమ, పెద్ద పరిశ్రమల మంత్రిగా పని చేశారు.
 • 1990
  1990లో బంగారప్ప క్యాబినెట్ లో చేరి రెవెన్యూ, గ్రామీణ అభివ్రద్ధి మరియు పంచాయత్ రాజ్ శాఖలలో మంత్రిగా పని చేసి ఆయా శాఖల్లో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చారు.
 • 1989
  తరవాత 1989లోనే గుర్మిట్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదవ సారి కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును కైవసం చేసుకున్నారు.
 • 1985
  నాలుగో సారి కూడా అదే నియోజకవర్గం నుంచి 1985 ,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ నేతగా వ్యవహరించారు.
 • 1983
  1983లో మూడోసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గుర్మిట్కల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
 • 1980
  1980లో గుండు రావు క్యాబినెట్ లో రెవెన్యూ శాఖ మంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలోనే భూ సంస్కరణలపై దృష్టి సారించి, భూమి లేని వారి కోసం, కార్మికుల కోసం పోరాడారు.
 • 1978
  1978లో రెండో సారి గుర్మిట్కర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దేవరాజు యుఆర్ ఎస్ మంత్రిత్వ శాఖలోగ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖలకు మంత్రిగా నియమితులయ్యారు.
 • 1976
  1976లో ఒకే సారి ఖాళీగా ఉన్న 16,000 ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ స్థానాల్లో టీచర్ల నియామకాలు చేసి నేరుగా వారికి విధులను అప్పగించారు. ఆ సమయంలో ఖర్గేను రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా నియమించారు.
 • 1974
  1974లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన లెదర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా చేరిన ఖర్గే తోలు పరిశ్రమల ద్వారా నష్టపోయిన ఎందరో చెప్పులు కుట్టేవారితో పాటు చిరు శ్రామికుల జీవన పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేశారు.
 • 1973
  1973లో ఆయన పురపాలక, పురావస్తు శాఖల ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దిశగా పనిచేసే ఆక్ట్రోయ్ అబోలిషన్ కమిటీ ఛైర్మన్ పదవిని చేపట్టారు.
 • 1972
  1972లో తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గుర్మిట్కల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన గెలిచారు.

గ‌త చ‌రిత్ర

 • 1969
  1969లో ఆయన ఎంఎస్కే మిల్స్ ఉద్యోగుల సంఘానికి అధికారిక సలహాదారునిగా పనిచేశారు. సంయుక్త మజ్దూర్ సంఘంలో కార్మిక సంఘం నేతగా కార్మికుల హక్కుల కోసం పోరాడి ఎన్నో అలజడులు సృష్టించారు. అదే సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి గుల్బర్గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని చేపట్టారు.
 • 60? ???????? ?????..
  గుల్బర్గాలోని నూతన్ విద్యాలయాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఖర్గే., అక్కడి ప్రభుత్వ కళాశాలలోనే డిగ్రీ చదివారు. తరవాత గుల్బర్గాలోని సేత్ శంకర్ లాల్ లహోటీ లా కాలేజీలో లా పూర్తి చేసుకున్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే గుల్బర్గా ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
నికర ఆస్తులు9.48 CRORE
ఆస్తులు 10.22 CRORE
బాధ్యతలు74.1 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X