• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
శ్రీమ‌తి మీనాక్షి లేఖీ

శ్రీమ‌తి మీనాక్షి లేఖీ

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మీనాక్షి లేఖీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన రాజకీయ నాయ‌కురాలు. ఆమె ప్ర‌స్తుతం న్యూఢిల్లీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధిగా పార్టీలో ఆమె డైన‌మిక్ లీడ‌ర్‌గా గుర్తింపు పొందారు మ‌రియు ఆమె సుప్రీం కోర్టులో న్యాయ‌వాదిగా ప‌ని చేస్తున్నారు. మీనాక్షి లేఖీ ది వీక్ మేగ‌జైన్‌లో ఫోర్త్‌రైట్ అనే పేరుతో వ్యాసాలు రాశారు. వివిధ అంశాల‌పై ఆమె టెలివిజ‌న్ షోలు మ‌రియు వార్త ప‌త్రిక‌ల‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు.

జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్‌(ఎన్‌హెచ్చార్సీ) మ‌రియు వివిధ మంత్రిత్వ శాఖ‌లు నిర్వ‌హించే లింగ స‌మాన‌త్వ కార్య‌క్ర‌మాల‌లో ఆమె ఉప‌న్యాసాలు ఇచ్చారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు & ప‌ని చేసే ప్ర‌దేశాల‌లో లైంగిక వేధింపుల‌పై రూపొందించిన ముసాయిదా బిల్లుల క‌మిటీలోనూ ఆమె స‌భ్యురాలిగా ఉన్నారు.

మీనాక్షి లేఖీ ఏప్రిల్ 30, 1967 లో న్యూఢిల్లీలో పుట్టారు. మ‌ధ్య‌త‌ర‌గతిలో పుట్టిన‌ప్ప‌టికీ ఆమె గొప్ప ప్ర‌తిభావంతురాలు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఢిల్లీ యూనివ‌ర్సిటీ, హిందూ కాలేజీ నుంచి బీఎస్సీ(బోట‌నీ)లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1990 లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో త‌న పేరును న‌మోదు చేసుకున్నారు. ఆమె మామ‌గారు ప్రాణ్ నాథ్ లేఖీ సుప్రీం కోర్టు న్యాయ‌వాదిగా ఉన్నారు. సుప్రీం కోర్టు న్యాయ‌వాది అయిన అమ‌న్ లేఖీతో ఆమె ప్రేమ‌లో ప‌డ్డారు. బార్ కౌన్సిల్ ఎన్నిన‌క‌ల్లో అభ్య‌ర్థిగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న‌ప్పుడు అమ‌న్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వీరిరువురూ ఏప్రిల్ 11, 1992 లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు శ్రీమ‌తి మీనాక్షి లేఖీ
పుట్టిన తేదీ 30 Apr 1967 (వ‌య‌స్సు  54)
పుట్టిన ప్రాంతం న్యూ ఢిల్లీ
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి న్యాయ‌వాది, సామాజిక‌వేత్త మ‌రియు రాజ‌కీయ నాయ‌కురాలు
తండ్రి పేరు శ్రీ భ‌గ‌వాన్ ఖ‌న్నా
తల్లి పేరు శ్రీమ‌తి. అమ‌ర్‌ల‌తా ఖ‌న్నా
జీవిత భాగస్వామి పేరు శ్రీ అమ‌న్ లేఖీ
జీవిత భాగస్వామి వృత్తి న్యాయ‌వాది
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా సీ-98 ఏ, సౌత్ ఎక్స్‌టెన్ష‌న్‌, పార్ట్-2, న్యూ ఢిల్లీ-110049, టెలిఫోన్ : (011) 26267501, 09810729643 (M)
ప్రస్తుత చిరునామా సీ-98 ఏ, సౌత్ ఎక్స్‌టెన్ష‌న్‌, పార్ట్-2, న్యూ ఢిల్లీ-110049, టెలిఫోన్ : (011) 26267501, 09810729643 (M)
కాంటాక్ట్ నెంబర్ 9810729643
ఈ-మెయిల్ meenakashi.lekhi@sansad.nic.in
వెబ్‌సైట్ http://www.meenakshilekhi.com
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

మ‌హిళ‌లు మ‌రియు పిల్ల‌లకు న్యాయం కోసం చేప‌ట్టే వివిధ సామాజిక & సాంసృతిక కార్య‌క్ర‌మాల‌లో ఆమె చురుగ్గా పాల్లొంటారు. బ్లైండ్ రిలీఫ్ అసోసియేష‌న్‌లో జాయింట్ సెక్ర‌టరీగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధిగా పార్టీ విధానాలు, కార్య‌క్ర‌మాలను ప్ర‌జ‌ల్లోకి విజ‌య‌వంతంగా చేరేలా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తుంటారు. జాతీయ మ‌రియు అంత‌ర్జాతీయ ప్రాధాన్యం గ‌ల అంశాల గురించి వివిధ టెలివిజ‌న్ షోల‌లో చ‌ర్చ‌లు జ‌రుపుతుంటారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 3 Nov 2017
  న‌వంబ‌రు 3, 2017 న ఆమె ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్‌గా నియ‌మింప‌బ‌డ్డారు.
 • 2014
  ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు చెందిన ఆశీష్ కేత‌న్‌ను ఓడించ‌డం ద్వారా న్యూ ఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
 • 2010
  రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌) అనుబంధ సంస్థ అయిన స్వ‌దేశీ జాగ‌ర‌ణ్ మంచ్‌లో మీనాక్షి లేఖీ ప‌ని చేశారు. ఈ సంస్థ‌లో ప‌ని చేస్తున్న‌ప్పుడే బీజేపీ మాజీ అధ్య‌క్షుడైన నితిన్ గ‌డ్క‌రీ ఆమెను పార్టీలోకి ఆహ్వ‌నించారు. మీనాక్షి లేఖీ ఆ ప్ర‌తిపాద‌న‌ను స్వీక‌రించి బీజేపీ మ‌హిళా విభాగం మ‌హిళా మోర్చాలో చేరారు. తొంద‌ర‌లోనే ఆమె బీజేపీ మ‌హిళా మోర్చా జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా ఎదిగారు.
 • 20 July 2016
  జూలై 20, 2016 నాడు ప్రివిలిజేస్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితుల‌య్యారు.
 • 12 June 2014
  జూన్ 12 న హౌజ్ క‌మిటీలో స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యారు.
 • 11 Dec 2014
  డిసెంబ‌రు 11, 2014 నుంచి ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ సంయుక్త క‌మిటీలో స‌భ్యురాలిగా ప‌ని చేస్తున్నారు.
 • 1 Sep 2014
  సెప్టెంబ‌రు 1, 2014 నుంచి జూలై 20, 2016 వ‌ర‌కు ప్రివిలిజేస్ క‌మిటీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి స్టాండింగ్ క‌మిటీల‌లో స‌భ్యురాలిగా ప‌ని చేశారు.

గ‌త చ‌రిత్ర

 • 2013
  సంచ‌ల‌నం సృష్టించిన 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం నిర్భ‌య చ‌ట్టం(స‌వ‌ర‌ణ) బిల్లు-2013 ముసాయిదా క‌మిటీని ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీలోని కీల‌క వ్య‌క్తుల‌లో మీనాక్షి లేఖీ ఒక‌రు. దీంతోపాటు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు మ‌రియు ప‌ని చేసే ప్ర‌దేశాల‌లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల ముసాయిదా బిల్లుల క‌మిటీల‌లోనూ ఆమె పాలు పంచుకున్నారు.
 • 2011-2012
  శాంతి ముకుంద్ హాస్పిట‌ల్ అత్యాచార‌ కేసులో బాధితురాలి త‌ర‌పున లాయ‌ర్‌గా వాదించారు. నిర్భ‌య రేప్‌ కేసు వివ‌రాల‌ను ప్ర‌చురించినందుకు మీడియా క‌వ‌రేజీపై కోర్టు నిషేధం విధించిన‌పుడు మీడియా త‌ర‌పున వాదించి నిషేధం ఎత్తివేసేలా వాదించారు. అలాగే భార‌త సైన్యంలో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న మ‌హిళా అధికారుల నియ‌మాకం కేసులోనూ త‌న వాద‌న‌ను వినిపించారు.
 • 2000s
  జాతీయ మ‌హిళా క‌మీష‌న్ ప్ర‌త్యేక క‌మిటీ లో స‌భ్యురాలిగా ప‌ని చేశారు. అలాగే మ‌హిళా సాధికార‌త పై ఏర్పాటైన ప్ర‌త్యేక కార్య‌ద‌ళం ఛైర్మ‌న్‌గా, న్యూఢిల్లీలోని జేపీఎమ్ అంధుల పాఠ‌శాల వైస్ ఛైర్మ‌న్ గా మ‌రియు బ్లైండ్ రిలీఫ్ అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేశారు.
 • 1990
  1990 లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో ఆమె త‌న పేరును న‌మోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, ఢిల్లీ హైకోర్టు, ఇత‌ర కోర్టులు, ఢిల్లీ మ‌రియు దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌లోని ట్రిబ్యున‌ళ్లు మ‌రియు ఫోరంల‌లో న్యాయ‌వాదిగా త‌న ప్రాక్టీసును ప్రారంభించారు. ఈ కోర్టుల‌లో అనేక‌ ర‌కాలైన వ్యాజ్యాలు బెయిళ్లు, రివిజ‌న్లు, ట్ర‌య‌ల్సు, అప్పీళ్లు, అవినీతి నిరోధ‌క చ‌ట్టం/ క‌స్ట‌మ్స్ చ‌ట్టం/ ఫెరా ప్రాసిక్యూష‌న్లు, గృహ హింస మ‌రియు కుటుంబ న్యాయ వివాదాలకు సంబంధించిన కేసుల‌ను వాదించారు.
నికర ఆస్తులు34.66 CRORE
ఆస్తులు 34.99 CRORE
బాధ్యతలు32.76 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X